అధునాతన డేటా సంరక్షణ విశ్లేషణలు, గోప్యత
అధునాతన డేటా సంరక్షణ Apple అత్యున్నత స్థాయి క్లౌడ్ డేటా భద్రతను అందించడానికి ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్‌ను ఉపయోగిస్తుంది మరియు మీ సమాచారాన్ని సంరక్షించడానికి డిజైన్ చేయబడింది.
![]()
- అధునాతన డేటా సంరక్షణ, మీ iCloud డేటాలో చాలా వరకు విశ్వసనీయమైన డివైజ్‌ల ద్వారాల మాత్రమే డీక్రిప్ట్ చేయడాన్ని నిర్ధారించడానికి ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్‌ను ఉపయోగిస్తుంది.
- అధునాతన డేటా సంరక్షణను ఎనేబల్ చేయడానికి మీరు తప్పనిసరిగా రికవరీ కీని మరియు/లేదా ఒకటి లేదా ఎక్కువ రికవరీ కాంటాక్ట్స్‌ను సెటప్ చేయాలి. మీ డేటాను రికవర్ చేయడానికి అవసరమైన కీలు Apple వద్ద ఉండవు, కాబట్టి మీరు యాక్సెస్ కోల్పోతే, మీ ఖాతా రికవరీ పద్ధతులు మాత్రమే మీ డేటాను తిరిగి పొందడంలో సహాయపడవచ్చు.
- డేటా రికవరీకి అత్యంత ప్రాధాన్యతను ఇచ్చి, మీరు అధునాతన డేటా సంరక్షణను ఎనేబల్ చేస్తే, Apple ఫీచర్ గురించి, ఖాతా రికవరీ పద్దతులతో మీ ఇంటరాక్షన్‌లను మరియు ఖాతా అలాగే డేటా రికవరీ ప్రాసెస్‌ను మెరుగుపరచడానికి, విశ్వసనీయతను నిర్ధారించడానికి మీ ఎన్‌క్రిప్షన్ కీలు ఎలా నిర్వహించబడుతుంది అనే పరిమిత సమాచారం సేకరించబడుతుంది.
మీ అనుభూతిని మెరుగుపరచడానికి మాత్రమే అవసరమైన డేటాను సేకరించడానికి మేము చాలా కష్టపడతాము, మేము డేటాను సేకరిస్తున్నప్పుడు మేము ఏం సేకరిస్తున్నాం అది మాకు ఎందుకు అవసరం అనేది మీకు తెలియాలి అని ముఖ్యంగా భావిస్తాం, దీనితో మీరు తెలివిగా నిర్ణయాలు తీసుకోవచ్చు. అధునాతన డేటా సంరక్షణ లానే ప్రతి Apple ప్రోడక్ట్ మరియు సర్వీస్ ఈ సూత్రాలను దృష్టిలో ఉంచుకుని డిజైన్ చేయబడతాయి.
iCloud కోసం అధునాతన డేటా సంరక్షణ ఐచ్ఛిక సెట్టింగ్ అది మీ అత్యధిక iCloud డేటా కోసం ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్‌ను అందించడం ద్వారా Apple అత్యున్నత స్థాయి క్లౌడ్ డేటా భద్రతను అందిస్తుంది. iCloud ఇప్పటికే సున్నితమైన డేటా విభాగాలను ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్‌తో పాస్‌వర్డ్‌లు, iCloud కీచెయిన్ మరియు ఆరోగ్య డేటాను సంరక్షిస్తుంది, అధునాతన డేటా సంరక్షణ iCloud బ్యాకప్, నోట్స్, ఫోటోలు మొదలైనవాటితో పాటుగా ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్‌ను ద్వారా డేటా సంరక్షణ విభాగాలను విస్తరిస్తుంది.
అధునాతన డేటా సంరక్షణ ఎనేబల్ చేయబడినప్పుడు, మీ ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్ట్ చేయబడిన డేటాను రికవరీ చేయడానికి Apple వద్ద ఎన్‌క్రిప్షన్ కీలు ఉండవు. మీరు మీ ఖాతాకు యాక్సెస్‌ను కోల్పోతే, మీ iCloud డేటాను రికవరీ చేయడానికి మీరు Apple తెలియని — మీ డివైజ్ పాస్‌కోడ్ లేదా పాస్‌వర్డ్, మీ రికవరీ కాంటాక్ట్ లేదా రికవరీ కీ — లాంటి మీ ఖాతా రికవరీ పద్దతులలో ఒక దానిని ఉపయోగించాలి. మీ iCloud డేటాలో ఎక్కువ మొత్తం ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ సంరక్షణతో ఉంటుంది కాబట్టి, మీరు అధునాతన డేటా సంరక్షణను ఆన్ చేయడానికి ముందే మీరు కనీసం ఒక రికవరీ కాంటాక్ట్ లేదా రికవరీ కీని సెటప్ చేయడానికి గైడ్ చేయబడతారు.
- ఖాతా మరియు డేటా రికవరీ ప్రాసెస్ విశ్వసనీయతను నిర్ధారించడానికి మరియు మెరుగుపరచడానికి, అధునాతన డేటా సంరక్షణ ఎనేబల్ చేయబడినప్పుడు Apple మీ Apple ఖాతాతో అనుబంధించిన పరిమిత సమాచారాన్ని సేకరిస్తుంది, ఇందులో ఇవి ఉండవచ్చు:
- అధునాతన డేటా సంరక్షణను ఎనేబల్ లేదా డిసేబల్ చేయడం వలన విజయాలు లేదా వైఫల్యాలు.
- Apple ఖాతాకు సైన్ ఇన్ చేస్తున్నప్పుడు, మీ వద్ద సమీపంలో ఇప్పటికే ఉన్న వేరే డివైజ్‌ను ఉపయోగించి కొత్త డివైజ్‌ను సెటప్ చేస్తున్నప్పుడు, మీ Apple ఖాతాను అప్‌డేట్ చేస్తున్నప్పుడు అలాగే మీ డేటాను యాక్సెస్ చేయడానికి మీ ఖాతాలోకి ప్రామాణీకరిస్తున్నప్పుడు మీ అనుభూతి మరియు ఎన్నిసార్లు విజయవంతమయ్యారు లేదా సమస్య ఏర్పడింది.
- రికవరీ కాంటాక్ట్స్‌ను కేటాయిస్తున్నప్పుడు అలాగే మీ డేటాకు యాక్సెస్‌ను రికవరీ చేయడానికి రికవరీ కాంటాక్ట్ ఉపయోగిస్తున్నప్పుడు, రికవరీ కాంటాక్ట్ ప్రాసెస్‌తో మీ ఇంటరాక్షన్‌లతో పాటు రికవరీ కాంటాక్ట్స్ క్రియేషన్, ఉపయోగాల పనితీరు అలాగే విశ్వసనీయత ఇవెంట్‌లు క్యాప్చర్ చేయబడతాయి. Appleకు మీ రికవరీ కాంటాక్ట్స్ తెలియవు లేదా యాక్సెస్ ఉండదు.
- మీ డేటాకు యాక్సెస్‌ను రికవరీ చేయడానికి మీరు రికవరీ కీని ఉపయోగిస్తున్నప్పుడు రికవరీ కీ క్రియేషన్ ప్రాసెస్, ప్రాసెస్‌తో అనుబంధించిన ఇవెంట్‌లతో మీ ఇంటరాక్షన్‌లతో పాటు మీ క్రియేషన్ అలాగే రికవరీ కీల పనితీరు, విశ్వసనీయత ఇవెంట్‌లు క్యాప్చర్ చేయబడతాయి. Appleకు మీ రికవరీ కీ తెలియదు లేదా యాక్సెస్ ఉండదు.
- మీ పాస్‌కోడ్‌ను రికవరీ పద్ధతిగా ఉపయోగిస్తున్నప్పుడు, మీ పాస్‌కోడ్‌ల జ్ఞానాన్ని ఉపయోగించి డేటా రికవరీ పద్ధతిగా ఉపయోగించినప్పుడు ఎంత తరచుగా మీరు విజయవంతమయ్యారు లేదా సమస్యలు తలెత్తాయి, రికవరీ ప్రాసెస్‌తో మీ జర్నీ, ఇంటరాక్షన్‌లతో పాటు, మీ డేటాకు యాక్సెస్‌ను రికవరీ చేయడానికి మీ డివైజ్ పాస్‌కోడ్ లేదా పాస్‌వర్డ్‌ను ఉపయోగించే పనితీరు, విశ్వసనీయత ఇవెంట్‌లు క్యాప్చర్ చేయబడతాయి. Appleకు మీ డివైజ్ పాస్‌కోడ్ లేదా పాస్‌వర్డ్‌లు తెలియవు లేదా యాక్సెస్ ఉండదు.
- ఖాతా అలాగే డేటా రికవరీ వైఫల్యం ప్రభావాన్ని నిర్ణయించడానికి మీ iCloud డేటా మొత్తాన్ని రీసెట్ చేసే, మరియు డిలీట్ చేసే ప్రాసెస్‌తో అనుబంధించిన ఇవెంట్‌లు, ఎంత తరచుగా ఎన్‌క్రిప్షన్ కీలు రోల్ చేయబడ్డాయనే దానితోపాటు, మీరు అధునాతన డేటా సంరక్షణను ఎనేబల్ లేదా డిసేబల్ చేసినప్పుడు మీ డివైజ్‌లో ఎన్‌క్రిప్షన్ కీలు ఎలా నిర్వహించబడ్డాయనే దాని గురించిన డేటా.
వ్యక్తిగత డేటాను ప్రాసెస్ చేయడానికి వర్తించే చట్టపరమైన ఆధారం
మేము Appleతో మీ కాంటాక్ట్‌ల పనితీరు, తప్పనిసరిగా అందించాల్సిన సర్వీస్‌లు అలాగే చట్టపరమైన బాధ్యతలను పాటించడం కోసం సాధారణంగా మీ వ్యక్తిగత డేటాను ప్రాసెస్ చేస్తాము. సమ్మతి అనేది తగిన చట్టపరమైన ఆధారం అయినప్పుడు, మేము వర్తించే చట్టానికి అనుగుణంగా దానిని కోరుతాము.
రిటెన్షన్
ఈ నోటీసులో వివరించినట్లుగా Apple గోప్యత పాలసీ లేదా చట్టాలకు అవసరమైన విధంగా వ్యక్తిగత డేటాను దాన్ని సేకరించిన అవసరం తీరే వరకు Apple దాన్ని అలాగే ఉంచుతుంది. డేటాను అలాగే ఉంచాల్సిన వ్యవధులను పరిశీలిస్తున్నప్పుడు, మేము ముందుగా సేకరించిన వ్యక్తిగత డేటాను అలాగే ఉంచడం అవసరమా అనేది జాగ్రత్తగా పరిశీలిస్తాము, అవసరమైతే, వ్యక్తిగత డేటాను చట్టాన్ని అనుసరించి, చట్టంలో అనుమతించిన అత్యంత తక్కువ సమయం పాటు స్టోర్ చేసి ఉంచడానికి కృషి చేస్తాము.
అన్ని వేళలా Apple సేకరించిన సమాచారం, Apple గోప్యతా విధానానికి అనుగుణంగా ఉపయోగించబడుతుంది, దీని గురించి www.apple.com/in/privacy ద్వారా తెలుసుకోండి
2025-12-12