App Store & గోప్యత

మీ శోధనలు, బ్రౌజింగ్, కొనుగోళ్ళు, అలాగే డివైజ్ విశ్వసనీయత స్కోర్‌ను Apple Storeలో మీ అనుభవాన్ని వ్యక్తిగతీకరించడానికి, మీకు మార్కెటింగ్ ఇమెయిల్‌లు, అలాగే నోటిఫికేషన్‌లను పంపడానికి, స్టోర్‌ను మెరుగుపరచడానికి, మోసాన్ని నిరోధించడానికి ఉపయోగించవచ్చు. మీరు మీ మార్కెటింగ్, వ్యక్తిగతీకరణ ప్రాధాన్యతలను ఎప్పుడైనా మార్చవచ్చు.
 

App Store మీ సమాచారాన్ని సంరక్షించడానికి డిజైన్ చేయబడింది మరియు మీరు ఏం షేర్ చేయాలో ఎంచుకునేలా మిమ్మల్ని అనుమతిస్తుంది.


Privacy Icon

  • మేము మీ వ్యక్తిగత డేటాను సేకరిస్తాము, దీనితో మేము మీకు మీరు కొనుగోలు, డౌన్‌లోడ్ చేసే లేదా iTunes Store, Apple Booksతో సహా App Store, ఇతర Apple ఆన్‌లైన్ స్టోర్‌లలో అప్‌డేట్ చేయాలనుకునే కంటెంట్‌ను అందిస్తాము.
  • మేము App Store, Apple News, స్టాక్స్‌కి సంబంధించిన ప్రకటనలలో మీకు తగినవాటిని మీకు చూపించడానికి స్టోర్‌ల నుండి మీ ఖాతా, కొనుగోళ్లు, డౌన్‌లోడ్‌ల సమాచారాన్ని కూడా ఉపయోగిస్తాము. ఈ ప్రకటన గురించి కింద వివరించిన విధంగా మీకు అవకాశాలు ఉంటాయి.
  • తగిన ఫీచర్‌లను ఇవ్వడానికి, వ్యక్తిగతీకరించిన సిఫార్సులు అందించడానికి, Apple మార్కెటింగ్ కోసం సహా నోటిఫికేషన్‌లను పంపడానికి మేము స్టోర్‌లలో మీ కొనుగోళ్లు, డౌన్‌లోడ్‌లు, ఇతర యాక్టివిటి సమాచారాన్ని ఉపయోగిస్తాము. మీరు కింద వివరించిన విధంగా ఈ అవసరాల కోసం మీరు ఎప్పుడైనా ఈ డేటా వినియోగాన్ని నిలిపివేయవచ్చు.
  • మోసాలను గుర్తించడం అలాగే నివారించడంలో సహాయపడటానికి, మీరు చేసిన అలాగే అందుకున్న సుమారు కాల్స్ లేదా ఇమెయిల్‌లతో పాటు మీ డివైజ్‌ను ఎలా ఉపయోగిస్తారు అనేది, మీరు కొనుగోలు చేయడానికి ప్రయత్నించినప్పుడు డివైజ్ ట్రస్ట్ స్కోర్‌ను కంప్యూట్ చేయడానికి ఉపయోగించబడుతుంది. సబ్మిషన్‌లు ఇలా డిజైన్ చేయబడింది కాబట్టి Apple మీ డివైజ్ నిజమైన విలువను తెలుసుకోలేదు. స్కోర్‌లు మా సర్వర్‌లలో నిర్ణీత సమయం వరకు స్టోర్ చేయబడతాయి.
  • స్టోర్‌లను మెరుగుపరచడంలో భాగంగా, మేము మీ బ్రౌజింగ్, కొనుగోళ్లు, శోధన, డౌన్‌లోడ్‌ల సమాచారాన్ని ఉపయోగిస్తాము. ఈ రికార్డ్‌లు IP అడ్రెస్, ర్యాండమ్ ప్రత్యేక ఐడెంటిఫైయర్ (ఏర్పడిన చోట) అలాగే మీరు App Store లేదా ఇతర Apple ఆన్‌లైన్ స్టోర్‌లలో సైన్ ఇన్ అయినప్పుడు Apple ఖాతాతో స్టోర్ చేయబడవచ్చు.

స్టోర్‌ను అందించడం

మేము Apple స్టోర్‌లో సర్వీస్‌లు, ఫీచర్‌లను అందించడానికి మీ వ్యక్తిగత డేటాను ఉపయోగిస్తాము. ఉదాహరణకు, ఈ సమాచారంలో మీరు సెట్టింగ్స్‌లో యాక్సెస్ చేయగలిగే, మార్చగలిగే అలాగే మీ కొనుగోలు చరిత్రతో పాటు ఖాతా, చెల్లింపు సమాచారం ఉంటుంది.

మీరు రిక్వెస్ట్ చేసే రీఫండ్ రిక్వెస్ట్‌ల వంటి నిర్దిష్ట సర్వీస్‌లను అందించడానికి మేము మీ వ్యక్తిగత డేటా కూడా ఉపయోగించవచ్చు. ఇందులో మీరు Appleకు నేరుగా పంపే లేదా యాప్ డెవలపర్‌ల ద్వారా ఏర్పాటు చేయబడినట్లుగా మీరు Appleకు పంపే రీఫండ్ రిక్వెస్ట్‌లు చేర్చబడవచ్చు. మీ సమ్మతితో, మీరు కొనుగోలును ఉపయోగించారా లేదా వంటి ఈ రీఫండ్ రిక్వెస్ట్‌లను ప్రాసెస్ చేయడంలో సహాయపడటానికి డెవలపర్‌లు నిర్దిష్ట వ్యక్తిగత సమాచారాన్ని Appleకు అందించవచ్చు.

మీ డివైజ్‌లో స్క్రీన్ టైమ్ యాప్ కంటెంట్ పరిమితులు ఆన్ చేయబడి ఉంటే, మీకు అందుబాటులో ఉన్న కంటెంట్‌ను మీకు చూపించడానికి మేము యాప్ కంటెంట్ పరిమితి గురించి సమాచారాన్ని ఉపయోగిస్తాము. కొన్ని దేశాలు లేదా ప్రాంతాలలో చట్ట ప్రకారం అవసరమైనప్పుడు, మీరు యాప్‌ను డౌన్‌లోడ్ చేసే ముందు మీరు వయోజనులని నిర్ధారించడానికి అదనపు సమాచారాన్ని అందించాల్సి ఉంటుంది. మీ Apple ఖాతాతో అనుబంధించబడిన తేదీ, పద్ధతి, దేశం లేదా ప్రాంతం గురించి వయస్సు నిర్ధారణ సమాచారాన్ని Apple స్టోర్ చేస్తుంది. మీరు Apple Store నుండి యాప్ డౌన్‌లోడ్ చేసినప్పుడు లేదా మీ Apple Watchలో యాప్‌ను ఇన్‌స్టాల్ చేసినప్పుడు, మీ Apple ఖాతాతో Apple లాగ్ చేసిన మీ డివైజ్ హార్డ్‌వేర్ ID, IP అడ్రెస్‌ల లాంటి ఐడెంటిఫైయర్‌లు ఉంటాయి. కొన్ని ప్రాంతాల్లో చట్టపరమైన పరిమితులకు లోబడి, నిర్దిష్ట యాప్‌లు మీకు అందుబాటులో ఉంచాలో లేదో నిర్ధారించడం కోసం మీ సుమారు లొకేషన్‌ను అంచనా వేయడానికి, Apple మీ ఇంటర్నెట్ కనెక్షన్ IP అడ్రెస్‌ను ఉపయోగించవచ్చు.

స్టోర్‌ను మెరుగుపరచడం

App Store, ఇతర Apple యాప్‌లు, సర్వీస్‌ల అనుభూతిని మెరుగుపరచడానికి, ఆప్జిమైజ్ చేయడానికి మేము మీరు App Storeను ఎప్పుడు తెరుస్తారు లేదా మూసివేస్తారు, ఏ కంటెంట్ కోసం మీరు వెతికారు, మీరు చూసిన, డౌన్‌లోడ్ చేసిన కంటెంట్, App Store పుష్ నోటిఫికేషన్‌లు అలాగే బ్యాడ్జ్‌లు ఇంకా App Store యాప్స్‌లో నుండి సందేశాలతో మీ ఇంటరాక్షన్‌తో పాటు మీ App Storeల వినియోగ సమాచారాన్ని సేకరిస్తాము. మేము మీ డివైజ్, ఇంకా ఖాతా సమాచారాన్ని సేకరిస్తాము, దీనిలో మీ డివైజ్ రకం, ఆపరేటింగ్ సిస్టమ్ వెర్షన్, మీ డివైజ్‌లో ఎంత స్పేస్ ఉంది, మీ ఖాతా సృష్టించి ఎంత కాలం అయ్యిందో తెలుసుకోవడం కోసం గణాంక సంబంధిత సమాచారం వంటివి ఉంటాయి. మేము ఈ సమాచారాన్ని కింది విధాలుగా ఉపయోగించవచ్చు, ఉదాహరణకు:

  • ట్రెండింగ్ శోధనలు, మీకు నచ్చే మరిన్ని గేమ్స్ లాంటి వ్యక్తిగతీకరించిన ఫీచర్‌లను అందించడానికి
  • రిక్వెస్ట్ చేసిన కంటెంట్‌ను డౌన్‌లోడ్ చేయాలా వద్దా అనేది అంచనా వేయడానికి
  • డివైజ్ స్టోరేజ్ వినియోగంలో సాధారణ ట్రెండ్‌లను అర్థం చేసుకోవడానికి, మీ డివైజ్ Wi-Fi లేదా మొబైల్ సర్వీస్ ద్వారా కనెక్ట్ చేయబడిందా లేదా అనే విషయాన్ని తెలుసుకోవడానికి

మీ iOS, iPadOS లేదా visionOS డివైజ్‌లో మీ App Store వినియోగ సమాచారానికి అనుబంధించబడిన ఐడెంటిఫైయర్‌ను రీసెట్ చేయడానికి, సెట్టింగ్స్ > యాప్‌లు > App Store > ‘ఐడెంటిఫైయర్‌ను రీసెట్ చేయండి’కి వెళ్ళండి. మీ Macలో, App Store > సెట్టింగ్స్ > ‘ఐడెంటిఫైయర్‌ను రీసెట్ చేయండి’కి వెళ్ళండి.

మేము, App Storeను అందించే మోడల్‌లను మెరుగుపరచడానికి App Store యాప్‌లకు మీ రేటింగ్స్, రివ్యూలను, మీరు దేనికోసం శోధించారు అనేది కూడా ఉపయోగించవచ్చు. ఉదాహరణకు, రివ్యూ సారాంశాలను అందించడానికి, App Store శోధన మోడల్‌ను చక్కగా ట్యూన్ చేయడానికి యాప్ రివ్యూలు, మీ నుండి మరియు ఇతర యాప్ స్టోర్ యూజర్‌ల నుండి వచ్చిన సమగ్ర శోధన క్వెరీలు ఉపయోగించబడతాయి.

స్టోర్‌ను వ్యక్తిగతీకరించడం

మేము మీకు తగినట్లుగా కంటెంట్‌ను కనుగొనడానికి సహయపడటానికి App Store తో మీ ఇంటరాక్షన్‌ను ఉపయోగిస్తాము. ఉదాహరణకు, మీ మునుపటి శోధనలు, చూసిన, డౌన్‌లోడ్ చేసిన, అప్‌డేట్ చేసిన లేదా App Storeలో రివ్యూ చేసిన వాటి ఆధారంగా మేము మీకు నచ్చే కంటెంట్‌ను సిఫార్సు చేస్తాము. మేము మీ Apple ఖాతా నుంచి తీసుకున్న ఖాతా సమాచారంతో, అంటే మీరు ఉపయోగించే డివైజ్‌లు అలాగే మీరు యాక్టివేట్ చేసే కొత్త డివైజ్‌ల వంటి వాటితో కలిపి ఇన్-యాప్ కొనుగోళ్ళు, సబ్‌స్క్రిప్షన్‌తో సహా కొనుగోళ్ల చరిత్ర, చెల్లింపు పద్ధతులను కూడా ఉపయోగిస్తాము. మెరుగైన సిఫార్సులను చేయడానికి, మేము యాప్ లాంచ్‌లు, ఇన్‌స్టాల్‌లు, Appleతో డివైజ్ విశ్లేషణలను షేర్ చేయడానికి ఎంచుకున్న యూజర్‌ల నుండి తొలగింపుల సమగ్ర సమాచారం కూడా ఉపయోగిస్తాము అలాగే యాప్ రేటింగ్‌ల గురించిన సమాచారాన్ని సమగ్ర పరుస్తాము. మా సిఫార్సులను మెరుగుపరచడానికి App Store స్థానిక, ఆన్-డివైజ్ ప్రాసెసింగ్‌ను ఉపయోగిస్తుంది. మీ డివైజ్‌లో స్టోర్ చేసిన యాప్ వినియోగ డేటాను, అంటే మీరు తరచుగా తెరిచే యాప్‌లు, నిర్దిష్ట యాప్‌లను ఉపయోగించడంలో గడిపే సమయం, అలాగే మీ యాప్ ఇన్‌స్టాల్‌లు, అన్‌ఇన్‌స్టాల్‌లు వంటివి ఉపయోగించి App Store మీకు సంబంధించిన యాప్‌లు, ఇన్-యాప్ ఇవెంట్‌లు ఇంకా మరిన్నింటిని సూచించగలదు. మీ నిల్వల వినియోగం గురించి Apple స్వీకరించే సమాచారంలో మీరు ట్యాప్ చేసి, వీక్షించే వ్యక్తిగతీకరించిన కంటెంట్ సమాచారం ఉంటుంది.

మీరు మీ Apple ఖాతా కోసం Apple నుంచి వ్యక్తిగతీకరించిన సిఫార్సులను ఆఫ్ చేయడం ద్వారా App Store, Apple Books, iTunes Store, Apple TV, పాడ్‌కాస్ట్‌లు మరియు సబ్‌స్క్రిప్షన్‌ల కోసం వ్యక్తిగతీకరణ ఫీచర్‌లను ఆఫ్ చేయవచ్చు. మీ iOS, iPadOS లేదా visionOS డివైజ్‌లో, సెట్టింగ్స్ > [మీ పేరు] > మీడియా & కొనుగోళ్ళు > ‘ఖాతాను చూడండి’కి వెళ్ళండి, ఆ తర్వాత వ్యక్తిగతీకరించిన సిఫార్సులను ఆఫ్ చేయడానికి ట్యాప్ చేయండి. మీరు సెట్టింగ్స్ > యాప్స్ > App Store > వ్యక్తిగతీకరించిన సిఫార్సులకు వెళ్ళి, ఆపై ‘యాప్ వినియోగ డేటాను క్లియర్ చేయండి’పై ట్యాప్ చేయడం ద్వారా iOS, ఇంకా iPadOS సర్వీస్‌లలో వ్యక్తిగతీకరణ కోసం మీ డివైజ్‌లో లాగ్ చేయబడిన యాప్ వినియోగ డేటాను క్లియర్ చేయవచ్చు. ఇది మీ డివైజ్‌లో లాగ్ చేసిన డేటాను డిలీట్ చేయదు, కానీ మీరు మీ యాప్ వినియోగ డేటాను క్లియర్ చేసే సమయానికి లాగ్ చేసిన ఏదైనా డేటా, వ్యక్తిగతీకరణ కోసం ఇకపై అందుబాటులో ఉండదు. మీరు మీ యాప్ వినియోగ డేటా హిస్టరీని క్లియర్ చేసిన తర్వాత App Store వ్యక్తిగతీకరణ ఫీచర్‌లు కొత్తగా లాగ్ చేసిన డేటాను ఉపయోగిస్తాయి.

App Store మరియు Apple Games

మీరు Apple Games యాప్‌ను ఉపయోగిస్తే, మీ గేమ్స్ అనుభవాన్ని వ్యక్తిగతీకరించడానికి, App Store, ఇంకా Apple Gamesను ఆప్టిమైజ్ చేసి, మెరుగుపరచడానికి, అలాగే మీకు కమ్యూనికేషన్‌లను పంపడానికి పైన ఉన్న ‘స్టోర్‌లను మెరుగుపరచడం’, ‘స్టోర్‌లను వ్యక్తిగతీకరించడం’ వంటి విభాగాలలో వివరించినట్లు, మీరు వెతికి, చూసి, డౌన్‌లోడ్ చేసే కంటెంట్‌తో సహా, మీరు App Storeను ఎలా ఉపయోగిస్తున్నారనే సమాచారం గేమ్స్ యాప్ ద్వారా ఉపయోగించబడుతుంది. గేమ్స్ యాప్ గురించి మరింత సమాచారం కోసం, www.apple.com/legal/privacy/data/en/apple-games లింక్‌కు వెళ్ళండి.

మీతో కమ్యూనికేట్ చేయడం

Apple మీకు App Store, ఇతర Apple ప్రోడక్ట్‌లు, సర్వీస్‌లు, అలాగే మీకు ఆసక్తికరంగా అనిపించే ఆఫర్‌ల కమ్యూనికేషన్‌లను పంపడానికి, Apple మీ వద్ద ఉన్న Apple ప్రోడక్ట్‌లు, Apple సర్వీస్‌లకు మీ సబ్‌స్క్రిప్షన్‌ల వంటి మీ ఖాతాకు సంబంధించిన సమాచారాన్ని ఉపయోగించవచ్చు. Apple, App Storeలో అందుబాటులో ఉన్న కొత్త ఫీచర్‌లు, కంటెంట్, ఆఫర్‌ల గురించి కమ్యూనికేషన్‌లను పంపడానికి, App Storeలోని మీ యాక్టివిటి సమాచారాన్ని కూడా ఉపయోగించవచ్చు.

ఇమెయిల్ మార్కెటింగ్
మీరు ఇమెయిల్ మార్కెటింగ్‌కు సమ్మతిస్తే, మీరు ఇమెయిల్ ద్వారా కమ్యూనికేషన్‌లను అందుకోవచ్చు. మీరు account.apple.com సైట్‌కు లేదా మీ iOS, iPadOS లేదా visionOS డివైజ్‌లో సెట్టింగ్స్ > [మీ పేరు] > వ్యక్తిగత సమాచారం > కమ్యూనికేషన్ ప్రాధాన్యతలకు వెళ్లడం ద్వారా మీ ఇమెయిల్ ప్రాధాన్యతలను మార్చవచ్చు లేదా నిలిపివేయడాన్ని ఎంచుకోవచ్చు.

నోటిఫికేషన్‌లు
మీరు Push, బ్యానర్ లేదా బ్యాడ్జ్ నోటిఫికేషన్‌ల ద్వారా కూడా ఈ కమ్యూనికేషన్‌లను స్వీకరించవచ్చు. మీ నోటిఫికేషన్ ప్రాధాన్యతలను మార్చడానికి లేదా నిలిపివేయడానికి, మీ iOS, iPadOS లేదా visionOS డివైజ్‌లో సెట్టింగ్స్ > నోటిఫికేషన్‌లు > App Storeకు వెళ్లండి.

ప్రకటన

Apple-ఇచ్చే ప్రకటనలు, App Store, Apple News, అలాగే స్టాక్స్‌లో యాప్‌లు, ప్రోడక్ట్‌లు అలాగే సర్వీస్‌లను కనుగొనడానికి సహాయం చేస్తాయి. ప్రకటనలు మీకు సంబంధించినవే అని నిర్ధారించడానికి, మేము మీ డివైజ్ ఖాతా, కొనుగోళ్లు, సబ్‌స్క్రిప్షన్‌లు, మునుపటి డౌన్‌లోడ్‌ల గురించిన సమాచారాన్ని ఉపయోగిస్తాము. App Storeలో, మీకు సంబంధిత ప్రకటనలను అందించడానికి మీరు శోధిస్తున్నప్పుడు మీ శోధన పదాలు, మీరు చూస్తున్న పేజీ లేదా మీరు డౌన్‌లోడ్ చేస్తున్న యాప్ గురించిన సమాచారంతో సహా సందర్భానుసార సమాచారం కూడా మేము ఉపయోగించవచ్చు. ఒకే రకమైన లక్షణాలను షేర్ చేసుకునే వ్యక్తులను సెగ్మెంట్‌ల రూపంలో గ్రూప్‌గా సృష్టిస్తాము అలాగే ఈ గ్రూప్‌లను లక్షిత ప్రకటనలను అందించడానికి ఉపయోగిస్తాము. మిమ్మల్ని ఏ సెగ్మెంట్‌కు అసైన్ చేయాలి, దాని ప్రకారం మీరు ఎలాంటి ప్రకటనలు అందుకోవాలి అనేది నిర్ణయించడానికి మీ గురించిన సమాచారం ఉపయోగించబడుతుంది. మీ గోప్యతను సంరక్షించడానికి, టార్గెట్ చేసిన ప్రమాణాలను 5,000 కంటే ఎక్కువ మంది పాటించినప్పుడు మాత్రమే టార్గెట్ చేసిన ప్రకటనలు అందించబడతాయి. మీకు సంబంధించిన ప్రకటనలను నిర్ధారించడానికి ఉపయోగించే సమాచారం మీ Apple ఖాతాతో కాకుండా ర్యాండమ్ ఐడెంటిఫైయర్‌లతో అనుబంధించబడుతుంది.

App Storeలో మీ కోసం ఉన్న అనేక ప్రకటనల నుంచి ఏ ప్రకటనను చూపించడానికి ఎంచుకొనే సమయంలో, మీకు ఏ ప్రకటన బాగా తగినది అనేది నిర్ణయించడానికి, మేము పైన పేర్కొన్న సమాచారంలో కొంత, అదే విధంగా App Store శోధనలు, బ్రౌజింగ్ యాక్టివిటీని ఉపయోగిస్తాము. App Store బ్రౌజింగ్ యాక్టివిటీలో, App Storeలో బ్రౌజింగ్ చేస్తున్నప్పుడు మీరు ట్యాప్ చేసిన, చూసిన కంటెంట్ అలాగే యాప్‌ల వంటి సమాచారం ఉంటాయి. ఈ సమాచారంలో యూజర్‌లందరికి సంబంధించిన సమీకృత డేటా ఉంటుంది, కాబట్టి దానిని ఉపయోగించి మీ వ్యక్తిగత వివరాలను తెలుసుకోవడం సాధ్యపడదు. మేము, మీరు తరచుగా తెరిచే యాప్‌ల లాంటి, డివైజ్‌లో స్టోర్ అయిన సమాచారాన్ని ఉపయోగించి, ఏ ప్రకటనను ప్రదర్శించడం కోసం ఎంచుకోవాలో నిర్ణయించడానికి, లోకల్, ఆన్-డివైజ్ ప్రాసెసింగ్‌ను కూడా ఉపయోగించవచ్చు. Apple అడ్వర్టయిజింగ్ ప్లాట్‌ఫామ్ మీ Apple ఖాతాకు సంబంధం లేని ర్యాండమ్ ఐడెంటిఫైయర్‌లో స్టోర్ అయ్యే, మీరు ట్యాప్ చేసిన, చూసిన ప్రకటనల గురించిన సమాచారాన్ని అందుకుంటుంది.

మీరు మీ లొకేషన్‌ను యాక్సెస్ చేసేలా App Storeకు అనుమతిస్తే, App Storeలో భౌగోళిక టార్గెట్ చేసిన ప్రకటనలను అందించడానికి, మీ సుమారు లొకేషన్ ఉపయోగించబడవచ్చు. మీరు సెట్టింగ్స్ > గోప్యత, భద్రత > లొకేషన్ సర్వీస్‌లు > App Storeకు వెళ్ళి ఆపై ‘ఎప్పటికీ వద్దు’ను ట్యాప్ చేయడం ద్వారా లొకేషన్-ఆధారిత కార్యాచరణను ఏ సమయంలోనైనా మీ iOS, iPadOS లేదా visionOS డివైజ్‌లో ఆపివేయవచ్చు.

‘వ్యక్తిగతీకరించిన ప్రకటనలు’ సెట్టింగ్ ఆన్‌లో ఉంటే, Apple వ్యాపార ప్రకటన ప్లాట్‌ఫారమ్ మీకు సంబంధించిన ప్రకటనలను చూపడానికి మీ సమాచారాన్ని ఉపయోగించవచ్చు. మీరు Apple ప్రకటనల ప్లాట్‌ఫారమ్ నుంచి మీ ఆసక్తులకు సంబంధించిన ప్రకటనలను అందుకోవద్దు అనుకుంటే, మీరు వ్యక్తిగతీకరించిన ప్రకటనలను ఆఫ్ చేయడానికి ఎంచుకోవచ్చు. వ్యక్తిగతీకరించిన ప్రకటనలను ఆఫ్ చేయడం వలన, సంబంధిత ప్రకటనలను కోసం Apple మీ సమాచారాన్ని ఉపయోగించడం నిరోధించబడుతుంది. ఇది మీకు వచ్చే ప్రకటనల సంఖ్యను తగ్గించదు, కానీ ప్రకటనలు మీకు అంతగా సంబంధించినవి ఉండకపోవచ్చు.

www.apple.com/in/legal/privacy/data/en/apple-advertisingలో Apple అడ్వర్టయిజింగ్ & గోప్యత గురించి మరింత తెలుసుకోండి.

support.apple.com/105131 లింక్‌లో App Store, Apple News, స్టాక్స్‌లో వ్యక్తిగతీకరించిన ప్రకటనలను నిలిపివేసే విధానం గురించి తెలుసుకోండి.

థర్డ్ పార్టీలతో షేర్ చేయబడుతోంది

మా ప్రోడక్ట్‌లను, సర్వీస్‌లను అందించడానికి, మా కస్టమర్‌లకు Apple మార్కెట్ సహాయం చేయడానికి అలాగే App Store, Apple News, స్టాక్స్‌లో Apple తరపున ప్రకటనలను చూపేందుకు విక్రయించడానికి మేము కొంత వ్యక్తిగతం కాని డేటాను వ్యూహత్మక పార్ట్‌నర్‌లకు అందిస్తాము. ఉదాహరణకు, మేము యాప్ డెవలపర్‌లతో మీ సబ్‌స్క్రిప్షన్, ఇంకా కంటెంట్ కొనుగోళ్ళ గురించి వ్యక్తిగత యేతర డేటాను షేర్ చేయవచ్చు, దీనితో వారు వారి క్రియేటివ్ పనితీరును తెలుసుకోగలరు, రాయల్టీ, జవాబుదారి అవసరాలను పాటించగలరు, అలాగే వారికి సంబంధించిన ప్రోడక్ట్‌లు, సర్వీస్‌లను మెరుగుపరుచుకోగలరు.

డెవలపర్‌లు వారి యాప్‌లను నిర్వహించడంలో, మెరుగుపరచడంలో సహాయపడటానికి మేము సమాచారాన్ని వారికి షేర్ చేయవచ్చు. వినియోగదారులు సమ్మతించి, ఇచ్చిన వినియోగ సమాచారాన్ని డెవలపర్‌లు చూడవచ్చు, దీని ద్వారా ఒకే రకమైన లక్షణాలు లేదా ప్రవర్తన ఉన్న వినియోగదారులందరి నుండి సేకరించిన డేటాను వారు పరిశీలించవచ్చు. ఈ వినియోగ డేటా గోప్యతను మెరుగుపరిచే పద్ధతులకు లోబడి ఉంటుంది, అలాగే మిమ్మల్ని వ్యక్తిగతంగా గుర్తించదు. డెవలపర్‌లు App Storeలో వారి ప్రోడక్ట్‌లు, సర్వీస్‌ల కొనుగోళ్ళు, రీఫండ్‌లకు సంబంధించిన రసీదు సమాచారాన్ని కూడా యాక్సెస్ చేయవచ్చు. డెవలపర్‌లకు అందించిన రసీదులలో వ్యక్తిగత డేటా ఉండదు; అయినప్పటికీ, మీరు ఆ డేటాను యాప్‌లకు అందించి ఉంటే వారి యాప్‌ల మీ వినియోగం, డౌన్‌లోడ్‌ల నుండి వ్యక్తిగత డేటాతో అనుబంధించడానికి డెవలపర్‌లు ప్రయత్నించవచ్చు.

మీరు ఒక సబ్‌స్క్రిప్షన్‌ను థర్డ్-పార్టీ యాప్‌లో కొనుగోలు చేస్తే, మీకు అలాగే డెవలపర్ లేదా పబ్లిషర్‌కు ప్రత్యేకంగా ఉండేలా మేము ఒక సబ్‌స్క్రైబర్ IDని సృష్టిస్తాము. మీరు కొనుగోలు చేసిన సబ్‌స్క్రిప్షన్ అలాగే మీ దేశం లేదా నివాస ప్రాంతం గురించిన సమాచారం కలిగి ఉన్న రిపోర్ట్‌లను డెవలపర్‌కు అందించడానికి మేము సబ్‌స్క్రైబర్ IDని ఉపయోగిస్తాము. మీరు సబ్‌స్క్రిప్షన్ బండిల్‌ను కొనుగోలు చేస్తే, బండిల్‌లో భాగంగా యాప్ సబ్‌స్క్రిప్షన్‌ను అందించే ప్రతి డెవలపర్‌లు బండిల్ గురించి రసీదు, అలాగే సబ్‌స్క్రిప్షన్ రిపోర్టింగ్ సమాచారాన్ని అందుకుంటారు. ఈ సమాచారం డెవలపర్‌లకు అందించబడుతుంది, దానివలన వారి సబ్‌స్క్రిప్షన్‌ల పనితీరును వారు అర్థం చేసుకుంటారు. మీరు నిర్దిష్ట డెవలపర్‌తో మీ అన్ని సబ్‌స్క్రిప్షన్‌లను రద్దు చేసి, మళ్ళీ సబ్‌స్క్రైబ్ చేయకపోతే, సబ్‌స్క్రైబర్ ID 180 రోజుల తర్వాత రీసెట్ చేయబడుతుంది.

నిర్దిష్ట ప్రాంతాలలో, మీరు యాప్ కోసం డిజిటల్ వస్తువులు లేదా సర్వీస్‌ల కోసం బయట కొనుగోలు చేస్తే, మీ కొనుగోలు Apple ఇన్-యాప్ చెల్లింపు సిస్టమ్ ద్వారా చేయబడలేదు అని అర్థం, అలాంటి సందర్భంలో ఆ యాప్ విషయంలో యాప్ డెవలపర్ Apple అకౌంటింగ్, రిపోర్టింగ్ మరియు విశ్లేషణల ప్రయోజనాల కోసం చెల్లించిన మొత్తం మరియు కొనుగోలు చేసిన ఐటెమ్ సహా కొనుగోలు గురించిన సమాచారాన్ని Appleకు రిపోర్ట్ రూపంలో అందిస్తారు. Apple కొనుగోలు సమాచారాన్ని మీ Apple ఖాతాకు లింక్ చేయదు.

అదనంగా, యాప్ డెవలపర్‌ల నుండి ఇన్-యాప్ కంటెంట్ ఆటోమేటిక్ డౌన్‌లోడ్‌లు సంభవించినప్పుడు, యాప్ మొదటిగా తెరవబడక ముందే మీ డివైజ్ IP అడ్రెస్ యాప్ డెవలపర్‌లకు కనిపిస్తుంది. యాప్ డెవలపర్ ద్వారా నిర్వహించబడే మీ IP అడ్రెస్ యాప్ డెవలపర్ గోప్యత పాలసీలకు లోబడి ఉంటుంది. మీరు యాప్‌ను మొదటిసారి తెరవక ముందే డెవలపర్‌ల నుండి ఇన్-యాప్ కంటెంట్ ఆటోమేటిక్ డౌన్‌లోడ్‌లను ఆఫ్ చేయడానికి, సెట్టింగ్స్ > యాప్స్ > App Storeకు వెళ్ళి, ఆపై ఇన్-యాప్ కంటెంట్‌ను ఆఫ్ చేయడానికి ట్యాప్ చేయండి.

వ్యక్తిగత డేటాను ప్రాసెస్ చేయడానికి వర్తించే చట్టపరమైన ఆధారం

మేము Appleతో మీ కాంటాక్ట్‌ల పనితీరు, తప్పనిసరిగా అందించాల్సిన సర్వీస్‌లు అలాగే చట్టపరమైన బాధ్యతలను పాటించడం కోసం సాధారణంగా మీ వ్యక్తిగత డేటాను App Storeలో ప్రాసెస్ చేస్తాము. సమ్మతి అనేది తగిన చట్టపరమైన ఆధారం అయినప్పుడు, మేము వర్తించే స్థానిక చట్టానికి అనుగుణంగా దానిని కోరుతాము.

వర్తించే స్థానిక చట్టాలు అందించినప్పుడు, మేము మా అలాగే థర్డ్ పార్టీల చట్టపరమైన అవసరాల కోసం కింది విభాగాల వ్యక్తిగత డేటాను ప్రాసెస్ చేస్తాము, ఇందులో భాగంగా:

  • సంబంధిత కంటెంట్‌ను డిస్‌ప్లే చేస్తుంది, రిక్వెస్ట్ చేసిన కంటెంట్‌ను డౌన్‌లోడ్ చేయడానికి మీ డివైజ్‌లో తగినంత ఖాళీ ఉందా లేదా అనేది అంచనా వేస్తుంది అలాగే అప్‌డేట్ చేయబడిన కంటెంట్ ఆటోమేటిక్ డౌన్‌లోడ్‌లను ఏర్పాటు చేస్తుంది
  • మీకోసం, ఇతరుల కోసం App Storeను, Apple ప్రోడక్ట్‌లు, సర్వీస్‌లను మెరుగుపరచడంలో, అలాగే ఆప్టిమైజ్ చేయడంలో సహాయపడుతుంది
  • మీకు ఆసక్తి ఉన్న ఆఫర్‌లు ఇమెయిల్ లేదా నోటిఫికేషన్‌ల ద్వారా పంపబడతాయి, అలాగే App Store, Apple News, ఇంకా స్టాక్స్‌లో మీకు ప్రకటనలను అందించడానికి విభాగాలు సృష్టించబడతాయి
  • రీఫండ్ రిక్వెస్ట్‌లను ప్రాసెస్ చేయండి
  • వారి యాప్‌లలోని కొనుగోళ్ళపై రిపోర్టింగ్‌ను డెవలపర్‌లకు అందించండి
  • మోసాలు మరియు హానికర యాక్టివిటీని నిరోధించడం

ఉపయోగించే డేటాలో ఇవి ఉంటాయి:

  • మీరు వెతికే కంటెంట్‌తో మీ ఇంటరాక్షన్‌లు, వీక్షణ, డౌన్‌లోడ్ అలాగే కొనుగోలు మరియు App Store నోటిఫికేషన్‌లు, సందేశాలు, ఇన్-యాప్ నోటిఫికేషన్‌లు ఇంకా సందేశాల వంటి మీ App Store యాప్ వినియోగం ఉంటాయి
  • మీ డివైజ్ మరియు ఖాతా గురించి వివరాలు
  • మీ IP అడ్రెస్
  • డివైజ్ ట్రస్ట్ స్కోర్

రిటెన్షన్

మేము ఫైనాన్షియల్ రిపోర్టింగ్ సంబంధిత వర్తించే, చట్టాలు పేర్కొన్న కాలానికి మీ కొనుగోళ్లు, App Store అలాగే వేరే Apple ఆన్‌లైన్ స్టోర్‌లలోని డౌన్‌లోడ్‌లతో అనుబంధించిన వ్యక్తిగత డేటాను స్టోర్ చేసి ఉంచుకుంటాము, ఇది ప్రాంతాల వారీగా వేరుగా ఉంటుంది. చాలా మంది కస్టమర్‌ల విషయంలో, 10 సంవత్సరాల రిటెన్షన్ వ్యవధి అవసరం, కానీ చైనా లాంటి ప్రాంతాలలో వ్యవధి 30 సంవత్సరాలు ఉండవచ్చు. మేము మీ కొనుగోళ్ళు, అలాగే కంటెంట్ డౌన్‌లోడ్‌లను రికార్డ్‌ను కూడా, కనీసం మా అప్లికేషన్ నిబంధనలతో కంటెంట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవడానికి మీకు అనుమతి ఉంటూ, మాతో మీకు ఖాతా ఉన్నంత వరకు అలాగే స్టోర్ చేసి ఉంచుతాము. మేము బ్రౌజింగ్ యాక్టివిటి అలాగే శోధనల లాంటి ఇతర సమాచారాన్ని కొద్దిపాటి కాల వ్యవధి వరకు అలాగే స్టోర్ చేసి ఉంచుతాము. ఎంచుకున్న డేటా వ్యవధి, డేటా స్టోరేజ్ విషయంలో కోసం వర్తించే చట్టపరమైన అధరాలు, నిర్దిష్ట వ్యాపార వినియోగ కేస్‌లను పరిగణలోకి తీసుకుంటుంది. అయినప్పటికీ, స్టోర్ చేసిన కార్డ్ వివరాల కాకుండా కొనుగోళ్ల లాంటి కొంత సమాచారం, మీరు మీ ఖాతాను మూసివేసిన లేదా App Store ఉపయోగించడం ఆపివేసిన తర్వాత కూడా వ్యాపార రికార్డ్‌గా అలాగే పెట్టుకోబడుతుంది.

మీరు చెల్లింపు కార్డ్‌ను ఉపయోగించినప్పుడు, Apple భవిష్యత్ కొనుగోళ్లు, రిపీట్ అయ్యే లావాదేవీలు లేదా మీరు ఆథరైజ్ చేసిన ఇతర అవసరాల కోసం మీ కార్డ్ నంబర్, బిల్లింగ్ సమాచారాన్ని అలాగే పెట్టుకోవచ్చు ఇంకా ఆటోమేటిక్‌గా అప్‌డేట్ చేయవచ్చు. Apple ఈ సమాచారాన్ని మీ ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్ లేదా చెల్లింపు నెట్‌వర్క్ నుంచి పొందవచ్చు అలాగే దీన్ని మోసాలను నివారించడానికి, ధృవీకరణ కోసం ఉపయోగించవచ్చు.

మోసాలు మరియు హానికర యాక్టివిటీని నిరోధించడం

మేము, మోసాలు, App Storeలో, ఇంకా ఇతర Apple ఆన్‌లైన్ స్టోర్‌లు అలాగే Apple యాప్‌లు, సర్వీస్‌లలో ఇతర హానికరమైన యాక్టివిటీని నివారించడానికి వ్యక్తిగత డేటాను కూడా సేకరిస్తాము. ఈ సమాచారంలో, డివైజ్ రకం అలాగే సాఫ్ట్‌వేర్ వెర్షన్, లొకేషన్ సమాచారం (అందుబాటులో ఉంటే, సుమారుగా భౌగోళిక ప్రాంతానికి ఇంటర్నెట్ కనెక్షన్ ద్వారా సరిపోయే IP అడ్రెస్), డౌన్‌లోడ్ మరియు కొనుగోళ్ల చరిత్ర, శోధనలు అలాగే స్టోర్‌లతో ఇతర ఇంటరాక్షన్‌ల లాంటి డివైజ్ సమాచారం కూడా ఉంటుంది.

మీరు కొనుగోలును మొదలు పెట్టినప్పుడు లేదా సబ్‌స్క్రిప్షన్‌ను ఆటో-రెన్యూకు సెట్ చేసినప్పుడు, మీ రిక్వెస్ట్‌ను ప్రాసెస్ చేయడానికి, ప్రామాణీకరణకు ముందే ప్రోడక్ట్ లేదా సర్వీస్‌ను ముందస్తుగా అందించాలా వద్దా అని నిర్ణయించడానికి Appleతో మీ చారిత్రక వ్యాపార సంబంధం గురించిన సమాచారాన్ని Apple ఉపయోగించవచ్చు.

మేము, మీరు కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు మీ డివైజ్‌లో ట్రస్ట్ స్కోర్‌ను కూడా, మీరు మీ డివైజ్‌ను ఎలా ఉపయోగిస్తున్నారు అనే సమాచారాన్ని ఉపయోగించి, సుమారు ఎన్ని కాల్స్, ఇమెయిల్‌లు మీరు పంపారు, అందుకున్నారు అనే దానితో సహా కంప్యూట్ చేయవచ్చు. సబ్మిషన్ ఇలా డిజైన్ చేయబడింది కాబట్టి Apple మీ డివైజ్ మూలాధార విలువలను తెలుసుకోలేదు. స్కోర్‌లు మా సర్వర్‌లలో నిర్ణీత సమయం వరకు స్టోర్ చేసి ఉంటాయి.

అన్ని వేళలా Apple సేకరించిన సమాచారం, Apple గోప్యతా విధానానికి అనుగుణంగా ఉపయోగించబడుతుంది, దీని గురించి www.apple.com/in/privacy ద్వారా తెలుసుకోండి.

2026-03-30