Apple ఖాతా, గోప్యత
Apple ఖాతా మీ సమాచారాన్ని సంరక్షించడానికి డిజైన్ చేయబడింది, అలాగే మీరు ఏమి షేర్ చేయాలో ఎంచుకోవడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది.
![]()
- మీరు మీ Apple ఖాతాతో సైన్ ఇన్ చేసినప్పుడు, మీరు ఈ iPhoneలో iCloud, App Store, iMessage, ఇంకా Find My వంటి సర్వీస్‌లను ఎనేబల్ చేస్తారు.
- మీ కాంటాక్ట్‌లు, క్యాలెండర్‌లు, ఫోటోలు, డాక్యుమెంట్‌లు, ఆరోగ్యం, యాక్టివిటి, ఇంకా ఇతర యాప్ డేటాతో సహా నిర్దిష్ట డేటా మీ తరపున స్టోర్ చేయడానికి, అలాగే బ్యాకప్ చేయడానికి Appleకు పంపబడుతుంది.
- అదనంగా, మీకు మెరుగైన సర్వీస్, ఇంకా మద్దతును అందించడానికి మీ డివైజ్ మీ Apple ఖాతాతో అనుబంధించబడుతుంది.
మీ Apple ఖాతా, అలాగే అన్ని Apple సర్వీస్‌లు ప్రాథమికంగా మీ గోప్యతను సంరక్షించడానికి రూపొందించబడ్డాయి. మీ అనుభూతిని మెరుగుపరచడానికి మాకు కావాల్సిన డేటాను మాత్రమే సేకరించడానికి మేము చాలా కష్టపడతాము. మేము డేటాను సేకరిస్తున్నప్పుడు, మేము ఏం సేకరిస్తున్నాం అది మాకు ఎందుకు అవసరం అనేది మీకు తెలియాలి అని ముఖ్యంగా భావిస్తాం, దీనితో మీరు తెలివిగా నిర్ణయాలు తీసుకోవచ్చు.
Apple ఖాతా అనేది మీరు ఉపయోగించే వ్యక్తిగత ఖాతా, దీన్ని iCloud, App Store, ఇంకా ఇతర Apple ఆన్‌లైన్ స్టోర్‌లు, iMessage, FaceTime వంటి Apple సర్వీస్‌లను యాక్సెస్ చేయడానికి, అలాగే మీ అన్ని డివైజ్‌లను, వెబ్‌లో మీ కంటెంట్‌ను యాక్సెస్ చేయడానికి ఉపయోగించవచ్చు. మీ Apple ఖాతాలో మీరు సైన్ ఇన్ చేయడానికి ఉపయోగించే సమాచారం, అలాగే Apple సర్వీస్‌లలో మీరు ఉపయోగించే విశ్వసనీయ ఫోన్ నంబర్‌లు లేదా భద్రతా ప్రశ్నలు వంటి అన్ని కాంటాక్ట్, చెల్లింపు, ఇంకా సెక్యూరిటీ వివరాలు ఉంటాయి. మీ డివైజ్ వారంటీ స్థితిని ప్రదర్శించడానికి, మీరు డివైజ్‌ను యాక్టివేట్ చేసినప్పుడు సర్వీస్ ఆఫర్‌ల కోసం మీ అర్హతను చెక్ చేయడానికి సౌలభ్యంతో సహా మీకు మెరుగైన సర్వీస్‌ను, మద్దతును అందించడానికి Apple మీ డివైజ్ పేరు, క్రమ సంఖ్య, ఇంకా ఇతర హార్డ్‌వేర్ ఐడెంటిఫైయర్‌లను కలిగి ఉంటుంది. మీరు account.apple.comలోని మీ Apple ఖాతా పేజీలో మీ Apple ఖాతా సమాచారాన్ని ఎడిట్ చేయవచ్చు, అలాగే మీ డివైజ్‌లు, ఇంకా ఫోన్ నంబర్‌ల జాబితాను చూడవచ్చు.
మీరు మీ Apple ఖాతాతో సైన్ ఇన్ చేసినప్పుడు, మీరు ఈ iPhoneలో iCloud, App Store, iMessage, FaceTime, అలాగే Find My వంటి సర్వీస్‌లను ఎనేబల్ చేస్తారు. మీ అనుబంధిత ఫోన్ నంబర్‌తో సహా మీ Apple ఖాతా సమాచారం ఉపయోగించబడుతుంది, ఇది ఆ సర్వీస్‌లను నిర్వహించడానికి, అలాగే మెరుగుపరచడానికి ఉపయోగించబడే విశ్లేషణల సమాచారాన్ని రూపొందిస్తుంది. అదనంగా, మీరు ఎంచుకున్న ప్రొఫైల్ ఫోటో, మీ కాంటాక్ట్‌లు, క్యాలెండర్‌లు, ఫోటోలు, డాక్యుమెంట్‌లు, ఆరోగ్యం, యాక్టివిటి, Safari ట్యాబ్‌లు, ఇంకా ఇతర యాప్ డేటాతో సహా మీ డివైజ్ నుండి నిర్దిష్ట డేటా మీ తరపున స్టోర్ చేయడానికి, అలాగే బ్యాకప్ చేయడానికి Appleకు పంపబడుతుంది.
మీ డివైజ్ ఉన్న దేశం లేదా ప్రాంతం ఆధారంగా చట్టబద్ధంగా అవసరమైన నిర్దిష్ట ఫీచర్‌లు, సర్వీస్‌లకు మీ డివైజ్‌కు అర్హత ఉందో లేదో తెలుసుకోవడానికి Apple మీ Apple ఖాతాతో అనుబంధించబడిన సమాచారాన్ని సేకరిస్తుంది. మీరు ఇన్‌స్టాల్ చేసే యాప్‌ల గురించి, మీరు వాటిని ఎక్కడ నుండి ఇన్‌స్టాల్ చేసారు(ఉదాహరణకు, వెబ్‌సైట్ లేదా యాప్ మార్కెట్‌ప్లేస్) అనే దానితో పాటు, మీ Apple ఖాతాతో అనుబంధించబడిన అకౌంటింగ్, రిపోర్టింగ్, విశ్లేషణలు, అలాగే మోసం గుర్తింపు ప్రయోజనాల కోసం చట్టబద్ధంగా అవసరమైన ఈ ఫీచర్‌లు, సర్వీస్‌లను ఎనేబల్ చేయడానికి సంబంధించిన సమాచారాన్ని కూడా మేము సేకరిస్తాము. అదనంగా, నిర్దిష్ట సందర్భాలలో మీ గోప్యతా హక్కుల గురించి వయస్సుకు తగిన సమాచారాన్ని అందించడంతో పాటు మా బాధ్యతలకు కట్టుబడి ఉండటానికి మేము మీ Apple ఖాతాతో అనుబంధించబడిన వయస్సును ఉపయోగిస్తాము.
కొన్ని దేశాలు లేదా ప్రాంతాలలో, మీరు వయోజనులా కాదా అని నిర్ధారించడానికి, మీరు క్రెడిట్ కార్డ్ లేదా ప్రభుత్వం జారీ చేసిన ID వంటి అదనపు సమాచారాన్ని అందించాల్సి ఉంటుంది. ఇవి అవసరమయ్యే దేశం లేదా ప్రాంతంలో మీరు ఉన్నారా లేదా అని నిర్ధారించడానికి మేము ఖాతా సమాచారం, ఇంకా ఆన్-డివైజ్ టెక్నాలజీని ఉపయోగిస్తాము, కొన్ని సందర్భాల్లో మీ ఇంటర్నెట్ కనెక్షన్ IP అడ్రెస్‌ను ఉపయోగిస్తాము. మీరు App Storeలో యాప్‌లను డౌన్‌లోడ్ చేయడం, వెబ్ కంటెంట్ ఫిల్టర్‌లు, కమ్యూనికేషన్ భద్రత వంటి ఆన్‌లైన్ భద్రత ఫీచర్‌లను డిసేబల్ చేయడం, పిల్లల కోసం Apple ఖాతాను సృష్టించడం వంటి నిర్దిష్ట చర్యలను తీసుకునేలా మిమ్మల్ని అనుమతించడం కోసం చట్టబద్ధంగా అవసరమైనప్పుడు మేము అదనపు వయస్సు-ధృవీకరణ సమాచారాన్ని అభ్యర్థిస్తాము. మీరు ప్రభుత్వం జారీ చేసిన మీ ID ఇమేజ్‌ను సబ్మిట్ చేసినప్పుడు, మీరు వయోజనులని నిర్ధారించడానికి, మోసాన్ని నివారించడానికి Apple, దాని సర్వీస్ ప్రొవైడర్‌లు మీ ID ఇమేజ్‌ను, అలాగే మీ Apple ఖాతా సమాచారాన్ని ఉపయోగిస్తాయి. Apple సర్వీస్ ప్రొవైడర్‌లు అసెస్‌మెంట్‌ను పూర్తి చేయడానికి కొద్ది సమయం పాటు ఇమేజ్‌ను ఉంచుకుంటారు, ఆ తర్వాత ఇమేజ్ డిలీట్ చేయబడుతుంది. మీ Apple ఖాతాతో అనుబంధించబడిన తేదీ, పద్ధతి, దేశం లేదా ప్రాంతం గురించి వయస్సు నిర్ధారణ సమాచారాన్ని Apple స్టోర్ చేస్తుంది. మీరు ఒక IDని అందించినప్పుడు, మోస నివారణ, గుర్తింపు ప్రయోజనాల కోసం మేము ఆ డాక్యుమెంట్‌లోని నిర్దిష్ట సమాచారం నుండి వన్-వే హ్యాష్‌ను పరిమిత కాలం వరకు స్టోర్ చేస్తాము. మీరు కొనుగోళ్ళ కోసం లేదా వాలెట్‌లో డిజిటల్ ఆధారాలను ఉపయోగించడం వంటి ఇతర ప్రయోజనాల కోసం దాన్ని స్టోర్ చేయాలని ప్రత్యేకంగా ఎంచుకునే వరకు, మేము క్రెడిట్ కార్డ్ లేదా ID డాక్యుమెంట్‌ను స్టోర్ చేయము.
iCloud, గోప్యత
iCloudకు సైన్ ఇన్ చేయడం
మీరు iCloudను ఉపయోగించినప్పుడు, మీరు మీ డివైజ్‌లో స్టోర్ చేసే నిర్దిష్ట డేటా Appleకు ఆటోమేటిక్‌గా పంపబడుతుంది, అలాగే స్టోర్ చేయబడుతుంది. ఇది మీ అన్ని iCloud-ఎనేబల్ చేసిన డివైజ్‌లు లేదా కంప్యూటర్‌లలో (“డివైజ్‌లు) ఆటోమేటిక్‌గా మీ డేటాను యాక్సెస్ చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. ఈ డేటాలో ఇవి ఉండవచ్చు:
- కాంటాక్ట్‌లు
- క్యాలెండర్‌లు
- రిమైండర్‌లు
- బుక్‌మార్క్‌లు
- Safari ట్యాబ్‌లు
- ఆరోగ్యం డేటా
- హోమ్ డేటా
- నోట్స్
- Freeform
- ఫోటోలు
- Apple Vision Pro యాప్
- డాక్యుమెంట్‌లు
- వాలెట్ డేటా
- కీచెయిన్, ఇంకా పాస్‌వర్డ్‌లు
- మీ డివైజ్‌లోని ఫోన్ నంబర్
- డివైజ్, ఇంకా ఖాతా సెట్టింగ్‌లు
- iCloudను ఉపయోగించే ఇతర Apple యాప్‌ల నుండి డేటా
- iCloudను ఉపయోగించే థర్డ్-పార్టీ యాప్‌ల నుండి డేటా
మీరు మీ డివైజ్‌లో డేటాను రీప్లేస్ చేయాల్సిన లేదా రీస్టోర్ చేయాల్సిన అవసరం ఉన్నట్లయితే, దాని ప్రస్తుత బ్యాకప్ మీ దగ్గర ఉందని నిర్ధారించుకోవడంలో సహాయపడటానికి iCloud బ్యాకప్ కూడా ఎనేబల్ చేయబడుతుంది.
మీరు ఏ సమయంలో అయినా మీ డివైజ్‌లోని సెట్టింగ్‌ల నుండి ఏ iCloud ఫీచర్‌లు ఎనేబల్ చేయబడతాయో, iCloudకు ఏ డేటాను పంపాలో సర్దుబాటు చేయవచ్చు.
iCloud డేటా సెక్యూరిటీ
iCloud మీ సమాచారాన్ని ట్రాన్సిట్‌లో ఉన్నప్పుడు ఎన్‌క్రిప్ట్ చేయడం, ఎన్‌క్రిప్ట్ చేసిన ఫార్మాట్‌లో iCloudలో స్టోర్ చేయడం, అలాగే ప్రామాణీకరణ కోసం సురక్షిత టోకెన్‌లను ఉపయోగించడం ద్వారా సంరక్షిస్తుంది. నిర్దిష్ట సమాచారం కోసం, Apple ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్‌ను ఉపయోగిస్తుంది. అంటే, డిజైన్ చేసిన దాని ఆధారంగా, మీరు మాత్రమే ఈ సమాచారాన్ని యాక్సెస్ చేయగలరు, అది కూడా మీరు iCloudకి సైన్ ఇన్ చేసిన డివైజ్‌లలో మాత్రమే వీలవుతుందని అర్థం. Appleతో సహా ఎవరూ కూడా ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్ట్ చేసిన సమాచారాన్ని యాక్సెస్ చేయలేరు. iCloud డేటా భద్రతపై మరింత సమాచారం కోసం, support.apple.com/102651 లింక్‌ను సందర్శించండి.
మీ డేటాను స్టోర్ చేసి, ప్రాసెస్ చేయడానికి Apple, అలాగే థర్డ్-పార్టీ డేటా సెంటర్‌లు రెండూ ఉపయోగించబడవచ్చు. థర్డ్-పార్టీ డేటా సెంటర్‌లో స్టోర్ చేయబడిన డేటాను ప్రాసెస్ చేస్తున్నప్పుడు, సురక్షిత సర్వర్‌లలో రన్ అవుతున్న Apple సాఫ్ట్‌వేర్ ద్వారా మాత్రమే ఎన్‌క్రిప్షన్ కీలు యాక్సెస్ చేయబడతాయి, అలాగే అవసరమైన మేరకు ప్రాసెసింగ్‌ను నిర్వహిస్తున్నప్పుడు మాత్రమే ఇది జరుగుతుంది.
iCloud కీచెయిన్
iCloud కీచైన్ మీ Safari వెబ్‌సైట్ యూజర్‌నేమ్‌లు, అలాగే పాస్‌వర్డ్‌లు, క్రెడిట్ కార్డ్ సమాచారం, ఇంకా Wi-Fi నెట్‌వర్క్ సమాచారాన్ని అప్‌డేట్ చేసి ఉంచుతుంది, అంతే కాకుండా మీ అన్ని డివైజ్‌లలో అందుబాటులో ఉంచుతుంది. ఇది మీరు Mail, కాంటాక్ట్‌లు, క్యాలెండర్, సందేశాలు, Facebook, X, LinkedIn, ఇంకా ఇతర ఇంటర్నెట్ ఖాతాల కోసం ఉపయోగించే ఖాతా సమాచారాన్ని స్టోర్ చేయగలదు, అలాగే ఈ సమాచారాన్ని మీ అన్ని డివైజ్‌లకు ఆటోమేటిక్‌గా జోడించగలదు.
iCloud కీచైన్ ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్‌ను ఉపయోగిస్తుంది, అలాగే మీరు మాత్రమే ఈ సమాచారాన్ని మీరు iCloudకు సైన్ ఇన్ చేసిన డివైజ్‌లలో మాత్రమే యాక్సెస్ చేయగలిగేలా రూపొందించబడింది. మీ iCloud కీచైన్ డేటాను Appleతో సహా ఎవరూ యాక్సెస్ చేయలేరు. మీరు ఎప్పుడైనా మీ iCloud సెట్టింగ్‌లలో iCloud కీచైన్‌ను ఆఫ్ చేయడానికి ఎంచుకోవచ్చు.
iCloud బ్యాకప్
మీరు iCloud బ్యాకప్‌ను ఉపయోగించినప్పుడు, మీ బ్యాకప్‌లో ఫోటోలు, వీడియోలు, సందేశాలు (iMessage, SMS, ఇంకా MMS), ఆరోగ్యం, అలాగే ఇతర యాప్ డేటా, లొకేషన్ సెట్టింగ్‌లు (మీరు సెటప్ చేసిన లొకేషన్-ఆధారిత రిమైండర్‌లు వంటివి), విజువల్ వాయిస్‌మెయిల్, డివైజ్ సెట్టింగ్‌లు, డివైజ్ లక్షణాలు, అలాగే మీ సెట్టింగ్స్ ఆధారంగా మీ iOS, iPadOS డివైజ్‌లో ఇతర డేటా ఉండవచ్చు.
బ్యాకప్‌ల విభాగంలో మీ iOS లేదా iPadOS డివైజ్‌ను ఎంచుకొని, ఆపై మీరు బ్యాకప్‌ను నిలిపివేయాలనుకుంటున్న యాప్‌లను ఆఫ్ చేయడానికి ట్యాప్ చేయడం కోసం, మీరు సెట్టింగ్స్ > [మీ పేరు] > iCloud > స్టోరేజ్ > ‘బ్యాకప్‌లు’కు వెళ్ళడం ద్వారా నిర్దిష్ట యాప్ కోసం మీ యాప్ డేటాను బ్యాకప్ చేయనీయకుండా iCloudను ఆపివేయవచ్చు.
మీరు iCloud బ్యాకప్‌ని పూర్తిగా iCloud సెట్టింగ్స్ నుండి ఆఫ్ చేయవచ్చు, అలాగే మీ కంప్యూటర్‌కు మీ iOS లేదా iPadOS డివైజ్‌ను బ్యాకప్ చేయడానికి Finder (macOS Catalina 10.15 లేదా తదుపరి వెర్షన్) లేదా iTunes (macOS Mojave 10.14 లేదా అంతకంటే ముందు వెర్షన్)ను ఉపయోగించవచ్చు. iCloud నుండి మీ బ్యాకప్ డేటాను పూర్తిగా తొలగించడానికి, iCloud బ్యాకప్‌ను ఆఫ్ చేయడానికి ముందు మీరు మీ వ్యక్తిగత బ్యాకప్‌లను డిలీట్ చేయవచ్చు. లేదంటే, బ్యాకప్ డేటా స్టోరేజ్ 180 రోజుల వరకు అలాగే కొనసాగించబడుతుంది.
iCloudతో డేటాను షేర్ చేయడం
మీరు నోట్స్, Pages, Numbers, Keynote, Freeform, ఇంకా కొన్ని థర్డ్ పార్టీ యాప్‌లలో ఫైల్‌లను పబ్లిక్‌గా లేదా ప్రైవేట్‌గా షేర్ చేయడానికి iCloudను ఉపయోగిస్తే, Apple షేర్ చేయబడిన ఫైల్‌ను స్టోర్ చేసి, దానికి యాక్సెస్‌ను కలిగి ఉంటుంది. మీ ఖాతాతో అనుబంధించబడిన మీ (వర్తించినట్లయితే) మొదటి, అలాగే చివరి పేరు, మీ డివైజ్‌లోని ఫోన్ నంబర్, అలాగే ఫైల్ పేరు, మీరు షేర్ చేసేది ప్రైవేట్ లేదా పబ్లిక్ అనే దానితో సంబంధం లేకుండా షేర్ చేసిన లింక్‌కు యాక్సెస్ ఉన్న ఎవరికైనా అందుబాటులో ఉంటుంది. ప్రైవేట్‌గా షేర్ చేసిన ఆహ్వానాన్ని పంపని, అలాగే అంగీకరించని ఎవరికైనా ప్రైవేట్‌గా షేర్ చేసిన పార్టిసిపెంట్‌ల గుర్తింపులు అందుబాటులో ఉంచబడవు.
మీరు షేర్ చేయబడిన లైబ్రరీని సృష్టించినా లేదా అందులో చేరినా, పార్టిసిపెంట్‌లు అందరూ iCloud ద్వారా షేర్ చేయబడిన లైబ్రరీలో ఫోటోలను, వీడియోలను జోడించవచ్చు, ఎడిట్ చేయవచ్చు లేదా తొలగించవచ్చు. మాన్యువల్‌గా లేదా ఆటోమేటిక్ షేరింగ్‌తో షేర్ చేయబడిన లైబ్రరీకి కంటెంట్‌ను జోడించడానికి పలు మార్గాలు ఉన్నాయి. మీరు మీ iOS లేదా iPadOS డివైజ్‌లో సెట్టింగ్స్ > ఫోటోలు > షేర్ చేయబడిన లైబ్రరీ > కెమెరా నుండి షేర్ చేయడం ద్వారా కంటెంట్‌ను ఎలా షేర్ చేయాలనుకుంటున్నారో నియంత్రించవచ్చు.
iCloud, ఇంకా యాప్‌లు
కొన్ని యాప్‌లు మీరు యాప్‌కి అందించే డేటా, అలాగే కంటెంట్‌ను స్టోర్ చేయడానికి iCloudను ఉపయోగిస్తాయి, కాబట్టి మీరు మీ iCloud-ఎనేబల్ చేసిన అన్ని డివైజ్‌లలో డేటాను యాక్సెస్ చేయవచ్చు. యాప్ మీ డేటాలో కొంత లేదా మొత్తం డేటాను iCloudలో స్టోర్ చేయడానికి ఎంచుకోవచ్చు. థర్డ్-పార్టీ యాప్‌లు మిమ్మల్ని వెతకమని రిక్వెస్ట్ చేయవచ్చు, తద్వారా ఆ యాప్‌లోని ఇతర యూజర్‌లకు Apple ఖాతా ద్వారా శోధించినప్పుడు మీ మొదటి, అలాగే చివరి పేరు కనిపిస్తుంది.
మీరు iCloudకు దాని యాక్సెస్‌ను ఆఫ్ చేయడం ద్వారా iCloudలో డేటాను స్టోర్ చేయకుండా యాప్‌ను ఆపవచ్చు. అలా చేయడానికి, సెట్టింగ్స్ > [మీ పేరు] > iCloudకు వెళ్ళి, జాబితాలో చూపబడిన యాప్‌లను ఆఫ్ చేయడానికి ట్యాప్ చేయండి.
iCloud అవసరమయ్యే Apple సర్వీస్‌లు
Apple Pay, యాక్టివిటి షేరింగ్, హోమ్, Handoff, యూనివర్సల్ క్లిప్‌బోర్డ్, అలాగే Apple Watchతో అన్‌లాక్ వంటి Apple సర్వీస్‌లను ఉపయోగించడానికి, మీరు తప్పనిసరిగా మీ డివైజ్‌లో iCloudకు సైన్ ఇన్ చేసి ఉండాలి. హోమ్ యాప్‌లో సురక్షిత కెమెరా రికార్డింగ్‌ను సెటప్ చేయడానికి, అలాగే ఉపయోగించడానికి మీ అర్హతను ధృవీకరించడానికి Apple మీ iCloud ప్లాన్‌ను ఉపయోగిస్తుంది. Apple మీ కెమెరా రికార్డింగ్‌లకు సంబంధించిన కంటెంట్‌ను యాక్సెస్ చేయలేదు. మీరు అన్ని iCloud ఫీచర్‌లను ఉపయోగించాల్సిన అవసరం లేదు, మీ డివైజ్‌లోని iCloud సెట్టింగ్‌లలో మీరు ఉపయోగించకూడదనుకునే ఏవైనా iCloud ఫీచర్‌లను ఆఫ్ చేయవచ్చు.
iCloud నుండి సైన్ ఔట్ చేయడం
మీరు మీ iOS, iPadOS డివైజ్‌లో, అలాగే ఏదైనా పెయిర్ చేసిన Apple Watchలో iCloudను ఉపయోగించడం ఆపివేయాలనుకుంటే, మీరు సెట్టింగ్స్ > [మీ పేరు]కు వెళ్లి సైన్ ఔట్‌ను ట్యాప్ చేయడం ద్వారా iCloud నుండి సైన్ ఔట్ చేయవచ్చు. మీ Macలో iCloudను ఉపయోగించడం ఆపివేయడానికి, సిస్టమ్ సెట్టింగ్స్ > [మీ పేరు]కు వెళ్లి, సైన్ ఔట్‌ను క్లిక్ చేయండి. మీ Apple ఖాతా పాస్‌వర్డ్ అవసరం కావచ్చు.
మీతో కమ్యూనికేట్ చేయడం
Apple Oneతో పాటు iCloud, ఇతర Apple ప్రోడక్ట్‌లు, సర్వీస్‌లు, మీకు ఆసక్తి కలిగించే ఆఫర్‌ల గురించి మీకు కమ్యూనికేషన్‌లను పంపడానికి Apple మీ ఖాతా గురించిన సమాచారాన్ని అంటే మీ స్వంత Apple ప్రోడక్ట్‌లు, మీరు డౌన్‌లోడ్ చేసిన Apple యాప్‌లు, మీ ఖాతాతో రిజిస్టర్ చేయబడిన డివైజ్‌లు, ఇంకా Apple సర్వీస్‌లకు మీ సబ్‌స్క్రిప్షన్‌లు, అదేవిధంగా మీరు విద్యార్థి అని ధృవీకరించబడ్డారా లేదా అనే వివరాలను ఉపయోగించవచ్చు. మీ డివైజ్ సీరియల్ నంబర్‌ను సర్వీస్ ఆఫర్‌లకు సంబంధించిన అర్హతను చెక్ చేయడానికి ఉపయోగించవచ్చు. మీరు ఫ్యామిలీ షేరింగ్ గ్రూప్‌లో ఉంటే, Apple మీకు ప్రోడక్ట్‌లు, సర్వీస్‌లు, ఫ్యామిలీ షేరింగ్ ద్వారా మీకు అందుబాటులో ఉన్న ఆఫర్ల గురించి కమ్యూనికేషన్‌లను పంపవచ్చు. మీరు Apple One సబ్‌స్క్రిప్షన్‌ను కొనుగోలు చేస్తే, మీరు సబ్‌స్క్రైబ్ చేసుకున్న ప్రతి సర్వీస్ ఫీచర్‌ల గురించి మేము ఇమెయిల్‌లను, అలాగే పుష్ నోటిఫికేషన్‌లను పంపవచ్చు. మీ Apple ఖాతాతో అనుబంధించబడిన మా Apple One కమ్యూనికేషన్‌లతో చేసే మీ ఇంటరాక్షన్‌ల గురించిన సమాచారాన్ని, ఈ సంభాషణలను, మా సర్వీస్‌లను మెరుగుపరచడంలో Apple సేకరిస్తుంది.
ఇమెయిల్ మార్కెటింగ్
మీరు ఇమెయిల్ మార్కెటింగ్‌కు సమ్మతిస్తే, మీరు ఇమెయిల్ ద్వారా కమ్యూనికేషన్‌లను అందుకోవచ్చు. మీరు మీ account.apple.com లింక్‌కు వెళ్ళి లేదంటే మీ iOS లేదా iPadOS డివైజ్‌లో సెట్టింగ్స్ > [మీ పేరు] > ‘వ్యక్తిగత సమాచారం’కు వెళ్ళి, మీ ఇమెయిల్ ప్రాధాన్యతలను మార్చవచ్చు, అలాగే ఈ ఇమెయిల్‌లను అందుకోకుండా ఆపివేయవచ్చు.
నోటిఫికేషన్‌లు
మీరు ఈ కమ్యూనికేషన్‌లను నోటిఫికేషన్‌ల ద్వారా కూడా అందుకోవచ్చు. మీ iOS లేదా iPadOS డివైజ్‌లో, నోటిఫికేషన్ మీ ప్రాధాన్యతలను అప్‌డేట్ చేయడానికి లేదా నోటిఫికేషన్‌లను నిలిపివేయడానికి, సెట్టింగ్స్ > నోటిఫికేషన్‌లకు వెళ్ళండి.
ఫ్యామిలీ షేరింగ్
ఫ్యామిలీ షేరింగ్‌లో మీరు, ఇంకా మీ ఫ్యామిలీ గ్రూప్ సబ్‌స్క్రిప్షన్‌లు, కొనుగోళ్లు, అలాగే లొకేషన్‌లను షేర్ చేసుకోవచ్చు. కుటుంబ నిర్వాహకులు ఫ్యామిలీ గ్రూప్‌లోని పిల్లలు, ఇంకా టీనేజర్‌ల కోసం ‘కొనుగోలు చేయడానికి అనుమతి అడగండి’, అలాగే ‘స్క్రీన్ టైమ్’ వంటి తల్లిదండ్రుల కంట్రోల్‌లను సెటప్ చేయవచ్చు. మీ ఫ్యామిలీ గ్రూప్‌లోని సభ్యులు Apple TV వంటి నిర్దిష్ట Apple డివైజ్‌లకు సైన్ ఇన్ చేసినట్లయితే, డివైజ్ అనేది వారి Apple ఖాతా పేరు, అలాగే ప్రొఫైల్ ఫోటోను డిస్‌ప్లే చేయడం ద్వారా మీ కుటుంబంలోని ఇతర సభ్యులను జోడించమని సూచించవచ్చు. ఫ్యామిలీ షేరింగ్ గురించి మరింత సమాచారం కోసం, www.apple.com/in/legal/privacy/data/en/family-sharing లింక్‌ను సందర్శించండి.
tvOS, ఇంకా థర్డ్-పార్టీ TVలలోని Apple TV యాప్ ప్రొఫైల్‌లు
మీరు tvOSలో, అలాగే కొన్ని నిర్దిష్ట థర్డ్-పార్టీ TVలలోని Apple TV యాప్‌లో పిల్లల ప్రొఫైల్‌లతో సహా మీ Apple ఖాతాకు అనుబంధించబడే ప్రొఫైల్‌లను సృష్టించవచ్చు. ఈ ప్రొఫైల్‌లను ఆ ప్లాట్‌ఫారమ్‌లలోని Apple TV యాప్‌లో ఉపయోగించవచ్చు, అలాగే Apple TV యాప్‌లో వ్యక్తిగతీకరించిన అనుభవాలను అనుమతించవచ్చు. ప్రొఫైల్‌లు అనుబంధించబడే Apple ఖాతానే నిర్వహణ ప్రొఫైల్‌గా పరిగణించబడుతుంది. మీ Apple ఖాతాతో అనుబంధించబడే ప్రొఫైల్‌ను సృష్టించడానికి, మీకు తప్పనిసరిగా కనీసం 18 సంవత్సరాల వయస్సు ఉండాలి. మీరు ప్రొఫైల్‌కు పేరు, ఇమేజ్‌ను ఎంచుకుంటారు, అలాగే ప్రొఫైల్ పిల్లల కోసం ఉద్దేశించబడిందా లేదా అనే విషయాన్ని నిర్దేశిస్తారు. మీరు ప్రొఫైల్ సెటప్ సమయంలో, అలాగే సెట్టింగ్స్‌లో ఎప్పుడైనా మీ Apple ఖాతాతో కొనుగోలు చేయగల, అద్దెకు తీసుకోగల ప్రొఫైల్ సామర్థ్యాన్ని నియంత్రించవచ్చు. మీరు Apple TV యాప్ కోసం కంటెంట్ పరిమితులను కూడా సెటప్ చేయవచ్చు. tvOSలో, సెట్టింగ్స్ > యాప్‌లు > TV > కంటెంట్ పరిమితులకు వెళ్ళి, ప్రొఫైల్‌ను ఎంచుకుని, దశలను అనుసరించండి.
మీరు ఎంచుకునే కంటెంట్ రేటింగ్‌లకు లోబడి, Apple నుండి కొనుగోలు చేసిన లేదా అద్దెకు తీసుకున్న కంటెంట్, అలాగే మీ Apple TV సబ్‌స్క్రిప్షన్, Apple TV ఛానెల్‌లను ప్రొఫైల్ ద్వారా యాక్సెస్ చేయవచ్చు, చూడవచ్చు. ప్రొఫైల్ మీ కనెక్ట్ చేయబడిన థర్డ్-పార్టీ వీడియో యాప్‌లను కూడా యాక్సెస్ చేయగలదు, కానీ కంటెంట్ పరిమితులు Apple TV యాప్‌కు మాత్రమే వర్తిస్తాయి.
ప్రొఫైల్‌ల గురించి Apple సేకరించి, స్టోర్ చేసే సమాచారం అనేది నిర్వహణ ప్రొఫైల్‌కు చెందిన Apple ఖాతాకు అనుబంధించబడి ఉంటుంది. ఇందులో ఉదాహరణకు, ప్రొఫైల్‌లో ఏమి చూస్తున్నారు, ఎప్పుడు చూస్తున్నారు, ఏ డివైజ్ నుండి చూస్తున్నారు, అలాగే కంటెంట్‌లో ప్రొఫైల్ ప్రోగ్రెస్ వంటి వాటి గురించి వివరణాత్మక ప్లేబ్యాక్ యాక్టివిటి ఉంటుంది. ఆ సమాచారాన్ని Apple TV యాప్ ఎలా సేకరించి, ఆపై ఉపయోగిస్తుందనే దాని గురించి మరింత తెలుసుకోవడానికి, www.apple.com/legal/privacy/data/en/apple-tv-app లింక్‌కు వెళ్ళండి.
పిల్లల ప్రొఫైల్‌ల కోసం, ఆ ప్రొఫైల్ వినియోగదారులకు Apple TV యాప్‌లో వయస్సుకు తగిన అనుభవాన్ని అందించడానికి మేము పిల్లల ప్రొఫైల్‌కు సంబంధించిన స్థిరమైన ఐడెంటిఫైయర్‌ను సేకరిస్తాము. ఆ ప్రొఫైల్ వినియోగదారుకు Apple TV యాప్‌ను అందించడం, ప్రొఫైల్‌ల ఫీచర్‌ను, Apple TV యాప్‌ను మెరుగుపరచడం, ఇంకా మోసం, భద్రతా ప్రయోజనాల కోసం మేము ఐడెంటిఫైయర్‌ను, పిల్లల ప్రొఫైల్ యాక్టివిటి డేటాను (శోధన, వీక్షణ చరిత్ర వంటివి) ఉపయోగిస్తాము. సంబంధం లేని ప్రయోజనాల కోసం గుర్తింపు, ఇంకా అనుబంధిత సమాచారం ఉపయోగించబడదని లేదా బహిర్గతం చేయబడదని నిర్ధారించడానికి Apple తగిన చర్యలు తీసుకుంటుంది.
నిర్వాహణ ప్రొఫైల్ నుండి ఆమోదం పొందిన తర్వాత సెట్టింగ్స్‌లో ప్రొఫైల్‌ను Apple ఖాతాకు అప్‌గ్రేడ్ చేయవచ్చు. tvOSలో, సెట్టింగ్స్ > ‘ప్రొఫైల్‌లు, ఖాతాలు’కు వెళ్ళి, ప్రొఫైల్‌ను ఎంచుకుని, ‘Apple ఖాతాకు అప్‌గ్రేడ్ చేయండి’ని ఎంచుకుని, ఆపై దశలను అనుసరించండి. ప్రొఫైల్ అప్‌గ్రేడ్ చేయబడినప్పుడు, ఆ ప్రొఫైల్‌తో చూసిన వాటి గురించిన సమాచారం, అలాగే వీక్షణ చరిత్రకు సంబంధించిన వివరాలు కొత్త Apple ఖాతాకు బదిలీ చేయబడతాయి, ఇకపై నిర్వహణ ప్రొఫైల్‌తో అనుబంధించబడవు. అయితే, ప్రొఫైల్ అప్‌గ్రేడ్ చేయబడినప్పుడు, కొనుగోళ్ళు, సబ్‌స్క్రిప్షన్‌లు, అద్దెలు వంటివి నిర్వహణ ప్రొఫైల్‌తోనే అనుబంధించబడి ఉంటాయి, కానీ అవి ప్రొఫైల్‌లోని కొత్త Apple ఖాతాకు బదిలీ చేయబడవు లేదా అనుబంధించబడవు. సెట్టింగ్స్‌లో నిర్వహణ ప్రొఫైల్ ద్వారా ప్రొఫైల్‌ను ఎప్పుడైనా డిలీట్ చేయవచ్చు. tvOSలో, సెట్టింగ్స్ > ‘ప్రొఫైల్‌లు, ఖాతాలు’కు వెళ్ళి, ప్రొఫైల్‌ను ఎంచుకుని, ‘ప్రొఫైల్ డిలీట్ చేయండి’ని ఎంచుకోండి. ప్రొఫైల్ డిలీట్ చేయబడిన తర్వాత, నిర్వహణ ప్రొఫైల్‌కు సంబంధించిన Apple ఖాతాకు ఆ ప్రొఫైల్, దాని వీక్షణ చరిత్ర ఇకపై అందుబాటులో ఉండవు.
iMessage, FaceTime, ఇంకా iCloud
మీరు మీ iPhoneలో మీ Apple ఖాతాతో సైన్ ఇన్ చేసినప్పుడు, మీరు iMessage, FaceTime, iCloud, అలాగే ఇతర Apple సర్వీస్‌లకు ఆటోమేటిక్‌గా సైన్ ఇన్ చేయబడతారు. మీ డివైజ్‌లోని ఫోన్ నంబర్ కూడా ధృవీకరించబడుతుంది, అలాగే మీ Apple ఖాతాతో అనుబంధించబడుతుంది. మీ Apple ఖాతా లేదా ఫోన్ నంబర్ మీరు సంప్రదించే, లేదా డేటా షేర్ చేసే వ్యక్తులకు కనిపిస్తుంది, ఇతర వ్యక్తులు మీ ఖాతాలోని మీ Apple ఖాతా, ఇమెయిల్ అడ్రెస్‌లు లేదా ఫోన్ నంబర్‌లను ఉపయోగించి మిమ్మల్ని సంప్రదించవచ్చు. సెట్టింగ్స్ > [మీ పేరు] > వ్యక్తిగత సమాచారానికి వెళ్ళడం ద్వారా వ్యక్తులు మిమ్మల్ని ఎలా సంప్రదించాలో మీరు ఎంచుకోవచ్చు. మీరు సెట్టింగ్స్ > సందేశాలు, ఇంకా iMessage అలాగే FaceTime & గోప్యత గురించి ట్యాప్ చేయడం ద్వారా iMessage అలాగే FaceTime, ఇంకా గోప్యత గురించి మరింత తెలుసుకోవచ్చు.
iTunes, App Store, అలాగే సంగీతం
మీరు మీ iPhoneలో మీ Apple ఖాతాతో సైన్ ఇన్ చేసినప్పుడు, మీరు iTunes Store, App Store, అలాగే Apple Musicకి ఆటోమేటిక్‌గా సైన్ ఇన్ చేయబడతారు, తద్వారా మీరు కొనుగోళ్లు చేయవచ్చు లేదా Apple Musicని త్వరగా, అలాగే సులభంగా ఉపయోగించడం ప్రారంభించవచ్చు. మీరు ఎంచుకునే ఏవైనా కొనుగోళ్లు మా సిస్టమ్‌లలో రికార్డ్ చేయబడతాయి, కాబట్టి మీరు వాటిని ఎప్పుడైనా మళ్ళీ డౌన్‌లోడ్ చేయవచ్చు. మీరు Apple Musicను ఉపయోగిస్తుంటే, మీరు వినే చరిత్ర అలాగే ఉంచబడుతుంది, అలాగే ఆది వ్యక్తిగతీకరించిన సిఫార్సులను అందించడంలో సహాయపడటానికి ఉపయోగించబడుతుంది. మీరు Apple Music సెట్టింగ్స్ నుండి మీ వినే చరిత్రను షేర్ చేయకుండా ఉండటానికి ఎంచుకోవచ్చు.
iTunes Match మీ ప్రాంతంలో అందుబాటులో ఉంటే, అలాగే మీరు iTunes Matchను ఉపయోగిస్తే, iCloud మీ iTunes లైబ్రరీలోని మీడియా గురించి సమాచారాన్ని సేకరిస్తుంది, అలాగే iTunes Storeలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న పాటలకు మీడియాను మ్యాచ్ చేస్తుంది లేదా సరిపోలని పాటలను అప్‌లోడ్ చేస్తుంది, ఆ తర్వాత ఆ పాటలు మీ అర్హత ఉన్న డివైజ్‌ల ద్వారా యాక్సెస్ చేయబడుతుంది.
ఆటోమేటిక్ సైన్ ఇన్
మీ అనుమతితో, Apple మీరు మీ Apple ఖాతాతో సైన్ ఇన్ చేయబడిన ఏదైనా iPhone, iPad లేదా Apple TVలో కొన్ని భాగస్వామ్య థర్డ్ పార్టీ యాప్‌లలో ఆటోమేటిక్‌గా మిమ్మల్ని సైన్ ఇన్ చేయగలదు. మీ అన్ని డివైజ్‌లలో సైన్ ఇన్‌ను ఎనేబల్ చేయడానికి మీ Apple ఖాతాతో అనుబంధించబడిన భాగస్వామ్య యాప్ అందించే సైన్ ఇన్ టోకెన్‌ను Apple స్టోర్ చేస్తుంది. మీరు మీ Apple ఖాతా సెట్టింగ్స్‌లో, పాల్గొనే ప్రతి యాప్‌కి సంబంధించి ఈ ఆటోమేటిక్ సైన్ ఇన్ సామర్థ్యాన్ని నిర్వహించవచ్చు. మీ iOS లేదా iPadOS డివైజ్‌లో, సెట్టింగ్స్ > [మీ పేరు] > మీడియా, కొనుగోళ్ళు > ‘కనెక్ట్ చేయబడిన ఖాతాలు’కి వెళ్ళండి.
పార్ట్‌నర్‌ల ద్వారా Apple సబ్‌స్క్రిప్షన్‌లు
మీ మొబైల్ నెట్‌వర్క్ ప్రొవైడర్ లేదా మరో Apple పార్ట్‌నర్, Apple సర్వీస్‌లకు (అంటే Apple One, Apple Music లేదా Apple TV వంటివి) సబ్‌స్క్రిప్షన్‌లు, అలాగే ఉచిత ట్రయల్‌లను అందిస్తే, ఉచిత ట్రయల్ లేదా సబ్‌స్క్రిప్షన్‌ను గుర్తించడానికి, సైన్ ఇన్ చేసేటప్పుడు మీ ఖాతాను ధృవీకరించడానికి, అలాగే మీ Apple సబ్‌స్క్రిప్షన్ లేదా ఉచిత ట్రయల్‌ను మీ Apple ఖాతాకు అందించడానికి పార్ట్‌నర్ షేర్ చేసిన మీ ఫోన్ నంబర్ లేదా ప్రత్యేక ఖాతా ఐడెంటిఫైయర్ లేదా కొన్ని సందర్భాలలో Apple డివైజ్ సీరియల్ నంబర్‌ను Apple ఉపయోగిస్తుంది. మీరు మీ ఉచిత ట్రయల్ లేదా సబ్‌స్క్రిప్షన్‌ను యాక్టివేట్ చేశారని మొబైల్ నెట్‌వర్క్ ప్రొవైడర్ లేదా పార్ట్‌నర్‌కు తెలియజేయడానికి మేము ఫోన్ నంబర్ లేదా ప్రత్యేక ఖాతా ఐడెంటిఫైయర్‌ను కూడా ఉపయోగిస్తాము.
చెల్లింపు పద్ధతులు, గిఫ్ట్ కార్డ్‌లు, Apple ఖాతా బ్యాలెన్స్‌కు నిధులను జోడించడం
App Store, iTunes, సంగీతం, ఇంకా మరిన్నింటి నుండి కొనుగోళ్ళు చేయడానికి, మీరు తప్పనిసరిగా మీ Apple ఖాతాకు చెల్లుబాటు అయ్యే చెల్లింపు పద్ధతిని జోడించాలి. iOSలో చెల్లింపు పద్ధతిని జోడించడానికి, ‘సెట్టింగ్స్ > [మీ పేరు] > చెల్లింపు & షిప్పింగ్’కు వెళ్లి, చెల్లింపు పద్ధతిని జోడించండిపై ట్యాప్ చేసి, సంబంధిత చెల్లింపు వివరాలను జోడించండి. మీరు సమాచారాన్ని మాన్యువల్‌గా నమోదు చేయడం ద్వారా లేదా మీ చెల్లింపు కార్డ్ ఫోటోను తీయడం ద్వారా చెల్లింపు వివరాలను జోడించవచ్చు. మీరు మీ చెల్లింపు కార్డ్ ఫోటోను తీయడం ద్వారా చెల్లింపు వివరాలను జోడించడానికి ఎంచుకుంటే, మీ డివైజ్ అవసరమైన ఫీల్డ్‌లను పూరించడానికి ఫోటో నుండి సంబంధిత సమాచారాన్ని సేకరిస్తుంది; Apple ఇమేజ్‌ను చూడదు లేదా స్టోర్ చేయదు. మీరు కొత్త చెల్లింపు కార్డ్‌ను జోడించేటప్పుడు, ఆ చెల్లింపు కార్డ్ మరో Apple ఖాతాతో అనుబంధించబడిందో లేదో అని Apple చెక్ చేస్తుంది. ఆ సందర్భంలో, Apple ఆ చెల్లింపు కార్డ్‌ను ఫైల్‌లో కలిగి ఉన్న Apple ఖాతా యజమానికి ఆ కార్డ్ కొత్త Apple ఖాతాకు జోడించబడిందని తెలియజేయవచ్చు. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా మీ వ్యక్తిగత సమాచారం, మీ Apple ఖాతా వివరాలు షేర్ చేయబడవు. మీరు వయోజనులుగా నిర్ధారించాల్సిన దేశం లేదా ప్రాంతంలో మీరు ఉంటే, అలాగే ఈ వయో నిర్ధారణ అవసరాన్ని పూర్తి చేసే చెల్లింపు పద్ధతిని మీరు ఇప్పుడు జోడించినా లేదా గతంలో జోడించినా, మీ Apple ఖాతాను వయోజనుల ఖాతాగా గుర్తించడానికి మేము ఆ చెల్లింపు పద్ధతిని ఉపయోగిస్తాము.
Apple మీ కొనుగోళ్ళను నిర్వహించడానికి, చట్టానికి అనుగుణంగా మోసాన్ని నిరోధించడానికి ఖాతా నంబర్, గడువు తేదీతో సహా మీరు అందించే చెల్లింపు పద్ధతి వివరాలను సేకరించి, స్టోర్ చేసి, బదిలీ చేస్తుంది. Apple లేదా మా చెల్లింపు భాగస్వాములు (ఉదాహరణకు, చెల్లింపులను ప్రాసెస్ చేసే బ్యాంక్‌లు లేదా ఇతర సంస్థలు) చట్టపరంగా అవసరమైన చోట, మీ లావాదేవీని ప్రాసెస్ చేయడానికి, ఇంకా చట్టానికి లోబడి ఉండటానికి ప్రభుత్వం జారీ చేసిన వ్యక్తిగత గుర్తింపు వంటి అదనపు వ్యక్తిగత సమాచారాన్ని కూడా సేకరించవచ్చు, నిల్వ చేయవచ్చు, అలాగే బదిలీ చేయవచ్చు. మీరు Appleకు బిల్లింగ్, అలాగే షిప్పింగ్ చిరునామాను కూడా అందించవచ్చు, ఇది మార్కెటింగ్, ఇంకా విశ్లేషణల ప్రయోజనాల కోసం, చట్టానికి అనుగుణంగా మోసాన్ని నిరోధించడానికి ఉపయోగించవచ్చు.
మీరు చెల్లింపు కార్డ్‌ను ఉపయోగించినప్పుడు, భవిష్యత్ కొనుగోళ్ళు, రిపీట్ అయ్యే లావాదేవీలు లేదా మీరు ఆథరైజ్ చేసిన ఇతర అవసరాల కోసం Apple మీ కార్డ్ నంబర్, బిల్లింగ్ సమాచారాన్ని సేవ్ చేయవచ్చు, అలాగే ఆటోమేటిక్‌గా అప్‌డేట్ చేయవచ్చు. Apple ఈ సమాచారాన్ని మీ ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్ లేదా చెల్లింపు నెట్‌వర్క్ నుంచి పొందవచ్చు అలాగే దీన్ని మోసాలను నివారించడానికి, ధృవీకరణ కోసం ఉపయోగించవచ్చు.
మీరు Apple Payను ఎనేబల్ చేసి ఉంటే, Apple Pay చెల్లింపు పద్ధతులు ఏవైనా Apple Pay చెల్లింపు పద్ధతులు ఫైల్‌లో మీ Apple ఖాతాకు చెల్లింపు పద్ధతిగా జోడించబడతాయో లేదో కూడా చెక్ చేస్తుంది, అలాగే వాలెట్‌లో కనుగొనబడిన చెల్లింపు పద్ధతులను కింద డిస్‌ప్లే చేస్తుంది. మీరు మీ Apple ఖాతాతో లావాదేవీని నిర్వహించినప్పుడు, Apple Pay కోసం ఫైల్‌లో ఏవైనా Apple ఖాతా చెల్లింపు పద్ధతులు అర్హత పొందాయా అని కూడా Apple చెక్ చేస్తుంది. అలా జరిగితే, మీ చెల్లింపు సమాచారాన్ని భద్రపరచడంలో సహాయపడటానికి, Apple ఆ చెల్లింపు పద్ధతి కోసం Apple Payను ఎనేబల్ చేయవచ్చు. మీరు సెట్టింగ్స్ > [మీ పేరు] > చెల్లింపు & షిప్పింగ్‌కు వెళ్ళడం ద్వారా ఏ సమయంలోనైనా మీ చెల్లింపు పద్ధతులను మార్చవచ్చు.
మీరు మీ Apple ఖాతాతో అనుబంధించబడిన చెల్లింపు పద్ధతిని ఉపయోగించి Apple Gift Cardను కొనుగోలు చేయవచ్చు, అలాగే Appleకి గ్రహీత ఇమెయిల్ అడ్రెస్, మీ పేరు మరియు గిఫ్ట్ కార్డ్ మొత్తాన్ని అందించడం గిఫ్ట్ కార్డ్‌ను వారితో ద్వారా షేర్ చేయవచ్చు. మీరు కావాలనుకుంటే ఏదైనా సందేశాన్ని కూడా నమోదు చేయవచ్చు. గిఫ్ట్ కార్డ్ విక్రయాలు, రీడీమ్ ప్రయోజనాల కోసం, చట్టానికి అనుగుణంగా ఉండటానికి, అలాగే మోసాన్ని నిరోధించడానికి Apple స్వీకర్త సమాచారాన్ని ఉపయోగిస్తుంది.
మీరు మీ Apple ఖాతా బ్యాలెన్స్‌కు గిఫ్ట్ కార్డ్ విలువను వర్తింపజేయడం ద్వారా Apple Gift Cardను కూడా రిడీమ్ చేయవచ్చు. మీరు Apple Gift Cardను రిడీమ్ చేసినప్పుడు, గిఫ్ట్ కార్డ్ సమాచారం మీ Apple ఖాతా బ్యాలెన్స్‌తో అనుబంధించవచ్చు, అలాగే చట్టానికి అనుగుణంగా ఉండటానికి, మోసాన్ని నిరోధించడానికి Apple ద్వారా ఉపయోగించబడవచ్చు. మీరు రిడీమ్ చేసిన గిఫ్ట్ కార్డ్‌ల సంఖ్య వంటి మీ గిఫ్ట్ కార్డ్ రిడెంప్షన్ గురించిన నిర్దిష్ట సమాచారం, మీ రిడీమ్ అనుభూతిని, అలాగే Apple నుండి మీకు కమ్యూనికేషన్‌లను వ్యక్తిగతీకరించడానికి కూడా ఉపయోగించవచ్చు. మీరు iTunes Storeకు వెళ్లి, కిందికి స్క్రోల్ చేసి, Apple ఖాతా > Apple ఖాతాను చూడండిని ట్యాప్ చేసి, వ్యక్తిగతీకరించిన సిఫార్సులను ఆఫ్ చేయడానికి ట్యాప్ చేయడం ద్వారా వ్యక్తిగతీకరణ కోసం గిఫ్ట్ కార్డ్ సమాచారాన్ని ఉపయోగించడాన్ని నిలిపివేయవచ్చు.
ఫైల్‌లోని మీ చెల్లింపు పద్ధతిని ఉపయోగించి మీరు నేరుగా మీ Apple ఖాతా బ్యాలెన్స్‌కు నిధులను జోడించవచ్చు. మీరు మీ Apple ఖాతా బ్యాలెన్స్‌కు నిధులను జోడించినప్పుడు, రిపీట్ అయ్యే నిధుల పెరుగుదలల కోసం ఆటోమేటిక్ మొత్తాన్ని లేదా క్రమ వ్యవధిని సెట్ చేసే ఎంపిక మీకు ఉండవచ్చు. మీరు ఆటోమేటిక్ ఫండ్స్ పెరుగుదలను సెటప్ చేసినప్పుడు, మీరు మీ పరికరంలో Apple నుండి లేదా మీ బ్యాలెన్స్ లేదా రిపీట్ అయ్యే ఫండ్స్ పెరుగుదలకు సంబంధించిన ఇమెయిల్ ద్వారా కమ్యూనికేషన్‌లను అందుకుంటారు (ఉదాహరణకు మీరు ఎన్‌రోల్ చేసుకున్న తర్వాత నిర్ధారణ నోటీసులు, రసీదులు, ఇంకా రిమైండర్‌లు). మీరు మీ Apple ఖాతా సెట్టింగ్‌లలో ఎప్పుడైనా ఆటోమేటిక్ నిధుల పెరుగుదలలను అప్‌డేట్ చేయవచ్చు లేదా ఆపివేయవచ్చు.
మీరు గిఫ్ట్ కార్డ్‌ను రీడీమ్ చేసిన తర్వాత లేదా మీ Apple ఖాతా బ్యాలెన్స్‌కు నిధులను జోడించిన తర్వాత, మీ అప్‌డేట్ చేయబడిన Apple ఖాతా బ్యాలెన్స్ వాలెట్‌లో కనిపిస్తుంది, తద్వారా మీరు Apple Store కొనుగోళ్ల కోసం మీ Apple ఖాతా బ్యాలెన్స్‌ను సులభంగా ఉపయోగించవచ్చు.
చెల్లింపు పద్ధతులు, గిఫ్ట్ కార్డ్‌లు, అలాగే మీ Apple ఖాతా బ్యాలెన్స్‌కు నిధులను జోడించడంలో మీ అనుభవాన్ని మెరుగుపరచడానికి, Apple మీ Apple ఖాతా చెల్లింపు సెట్టింగ్స్‌తో మీ క్లిక్‌లు, ట్యాప్‌లతో సహా మీ ఇంటరాక్షన్‌ల గురించి నిర్దిష్ట డేటాను సేకరించవచ్చు.
సబ్‌స్క్రిప్షన్ నిర్వహణ
మీరు మీ Apple ఖాతా సెట్టింగ్స్‌లో Appleకు చెందిన ఇన్-యాప్ కొనుగోలు సిస్టమ్ ద్వారా కొనుగోలు చేసిన Apple సర్వీస్‌లు, థర్డ్-పార్టీ సర్వీస్‌లకు మీ సబ్‌స్క్రిప్షన్‌లను చూడవచ్చు, అలాగే నిర్వహించవచ్చు. మీ iOS డివైజ్‌లో, సెట్టింగ్స్ > [మీ పేరు] > సబ్‌స్క్రిప్షన్‌లకు వెళ్ళండి. యాక్టివ్‌గా ఉన్న లేదా ఇటీవలి యాక్టివ్ సబ్‌స్క్రిప్షన్‌కు చెందిన వివరాలను చూడటానికి, నిర్వహించడానికి, అలాగే రద్దు చేయడానికి, సబ్‌స్క్రిప్షన్‌ను ట్యాప్ చేయండి. మీరు iCloud ఫ్యామిలీలో ఉన్నట్లయితే, మీ కుటుంబంతో మీ రెన్యువల్ రసీదు ప్రాధాన్యతలను, అలాగే మీ సబ్‌స్క్రిప్షన్ షేరింగ్‌ను కూడా నిర్వహించవచ్చు. మీరు మీ Apple ఖాతా ద్వారా మీ సబ్‌స్క్రిప్షన్‌ను వీక్షించినప్పుడు, నిర్వహించినప్పుడు, డెవలపర్ నుండి Apple మీకు ప్రదర్శించాలని వారు కోరుకునే ఏదైనా సందేశం లేదా ఆఫర్‌లను అభ్యర్థించడానికి, మీరు సబ్‌స్క్రిప్షన్‌ను కొనుగోలు చేసినప్పుడు డెవలపర్‌లకు అందించిన రసీదు సమాచారాన్ని Apple ఉపయోగిస్తుంది. డెవలపర్‌ల తరపున మేము ప్రదర్శించే సందేశాల కంటెంట్‌ను Apple స్టోర్ చేయదు లేదా తన స్వంత ప్రయోజనాల కోసం ఉపయోగించదు, కానీ సందేశాల కోసం చేసిన అభ్యర్థన మీరు మీ సబ్‌స్క్రిప్షన్‌ను నిర్వహిస్తున్నారని డెవలపర్‌కు సూచించవచ్చు, అలాగే సందేశం చూపబడిందా లేదా, ఏ రకమైన సందేశం చూపబడింది అనే సమాచారాన్ని Apple సేకరించవచ్చు. సబ్‌స్క్రిప్షన్ నిర్వహణలో మీ అనుభవాన్ని మెరుగుపరచడానికి, Apple ఖాతా సబ్‌స్క్రిప్షన్ సెట్టింగ్‌లలో మీరు చూడటం, క్లిక్ చేయడం, అలాగే ట్యాప్ చేయడం వంటి వాటితో సహా మీ ఇంటరాక్షన్‌లకు సంబంధించిన డేటాను Apple సేకరించవచ్చు.
స్కూల్, అలాగే వ్యాపార సంస్థలు
మీరు మీ Apple ఖాతాతో అనుబంధించిన ఇమెయిల్ అడ్రెస్, Apple School Manager లేదా Apple Business Manager సంస్థ ద్వారా నియంత్రించబడే డొమైన్‌ను ఉపయోగిస్తుంటే, Apple డొమైన్‌ను నియంత్రిస్తుందని ధృవీకరించిన తర్వాత మీ ఇమెయిల్ అడ్రెస్‌ను సంస్థతో షేర్ చేయవచ్చు. మీ ఖాతాను ఆఫీస్ లేదా స్కూల్ ఖాతాకు బదిలీ చేయడానికి మిమ్మల్ని అనుమతించడం ద్వారా లేదా మీ ఇమెయిల్ అడ్రెస్‌ను తిరిగి క్లెయిమ్ చేయడం ద్వారా మీ ఇమెయిల్ అడ్రెస్‌ను మీ Apple ఖాతాతో అనుబంధించకుండా సంస్థ నిరోధించవచ్చు. మీరు మీ ఖాతాను బదిలీ చేయాలని ఎంచుకుంటే, మీ అర్హతను నిర్ధారించడానికి Apple మీ సబ్‌స్క్రిప్షన్‌లు, కొనుగోళ్లు, చెల్లింపు పద్ధతులు, అలాగే మిగిలిన బ్యాలెన్స్‌లు, ఇంకా మీ ఖాతా ఫ్యామిలీ షేరింగ్ గ్రూప్‌లో భాగమా కాదా లాంటి పలు ఖాతా లక్షణాలను చెక్ చేయవచ్చు. మీ ఖాతాకు అర్హత ఉన్నట్లయితే, మీరు మీ Apple ఖాతాను సంస్థ నిర్వహించే ఆఫీస్ లేదా స్కూల్ ఖాతాకు బదిలీ చేయడానికి ఎంచుకోవచ్చు, ఇది ఖాతాతో అనుబంధించబడిన మొత్తం డేటాను యాక్సెస్ చేయడానికి సంస్థను అనుమతిస్తుంది. మీ ఖాతాకు అర్హత లేకుంటే లేదా మీరు దీనిని ఎంచుకోకూడదనుకుంటే, మీరు మీ Apple ఖాతాతో అనుబంధించబడిన ఇమెయిల్ అడ్రెస్‌ను అప్‌డేట్ చేయాలి. ఖాతా లక్షణాల పూర్తి జాబితాతో సహా మీ ఖాతాను బదిలీ చేయడం, అలాగే మీ ఇమెయిల్ అడ్రెస్‌ను అప్‌డేట్ చేయడం గురించి మరింత సమాచారం కోసం, support.apple.com/102159 లింక్‌ను సందర్శించండి.
వినియోగ డేటా
సర్వీస్ క్వాలిటీని అందించడానికి, అలాగే మెరుగుపరచడానికి మేము మీ iCloud వినియోగంపై డేటాను కూడా సేకరిస్తాము. కస్టమర్‌కు సమస్యలు తలెత్తితే వాటిని పరిష్కరించడంలో సహాయపడటానికి, ఈ డేటాలో కొంత భాగం మీ Apple ఖాతాతో అనుబంధించబడి ఉండవచ్చు. మీరు సర్వీస్‌ను యాక్సెస్ చేస్తున్న నగరం, అలాగే దేశాన్ని గుర్తించడానికి మేము మీ IP అడ్రెస్‌ను ఉపయోగించవచ్చు, కానీ మేము దానిని స్టోర్ చేయము.
ఖాతా భద్రత
మీ డేటాను సురక్షితంగా ఉంచడానికి Apple అత్యుత్తమ భద్రతా సాంకేతికతలను ఉపయోగిస్తుంది. Apple ఖాతా, Apple భద్రతా ఫీచర్‌లు, Apple ఖాతా రికవరీ ప్రాసెస్‌ల భద్రత, విశ్వసనీయతను మెరుగుపరచడానికి, అలాగే నిర్ధారించడానికి Apple మీ Apple ఖాతాతో అనుబంధించబడే నిర్దిష్ట పరిమిత సమాచారాన్ని సేకరిస్తుంది, అందులో ఇవి ఉండవచ్చు:
- Apple ఖాతాతో సైన్ ఇన్ చేస్తున్నప్పుడు, మీరు ఇప్పటికే కలిగి ఉన్న మరో డివైజ్‌ను దగ్గరగా ఉంచి కొత్త డివైజ్‌ను సెటప్ చేస్తున్నప్పుడు, డివైజ్‌లను తొలగిస్తున్నప్పుడు, మీ Apple ఖాతా సెట్టింగ్‌లను అప్‌డేట్ చేస్తున్నప్పుడు, మీ డేటాను యాక్సెస్ చేయడానికి లేదా రికవర్ చేయడానికి మీ ఖాతాలోకి ప్రామాణీకరిస్తున్నప్పుడు మీరు ఎన్నిసార్లు సఫలమయ్యారు లేదా సమస్యలను ఎదుర్కొన్నారు అనే వాటిని లెక్కించే ఇవెంట్‌లు
- మీరు Apple ఖాతాకు సంబంధించిన రికవరీ కాంటాక్ట్‌లు, రికవరీ కీలు లేదా అలాంటి భద్రత, రికవరీ వివరాలను సృష్టించి, ఉపయోగించినప్పుడు వాటి పనితీరును, విశ్వసనీయతను నమోదు చేసే ఇవెంట్‌లు. మీ రికవరీ కాంటాక్ట్‌లు లేదా రికవరీ కీలను Apple తెలుసుకోలేదు లేదా యాక్సెస్ చేయలేదు
- మీ డేటాకు యాక్సెస్‌ను తిరిగి పొందడానికి మీ డివైజ్ పాస్‌కోడ్ లేదా పాస్‌వర్డ్‌ను ఉపయోగించినప్పుడు వాటి పనితీరు, విశ్వసనీయతను నమోదు చేసే ఇవెంట్‌లు. Appleకు మీ డివైజ్ పాస్‌కోడ్ లేదా పాస్‌వర్డ్‌లు తెలియవు లేదా యాక్సెస్ ఉండదు
- విఫలమైన ఖాతా, డేటా రికవరీ ప్రభావాన్ని గుర్తించడం కోసం మీ ఖాతా నుండి డివైజ్‌లను తీసివేయడం లేదా మీ iCloud డేటాను రీసెట్ చేసి, డిలీట్ చేయడం వంటి ప్రాసెస్‌లకు సంబంధించిన ఇవెంట్‌లు
వ్యక్తిగత డేటాను ప్రాసెస్ చేయడానికి వర్తించే చట్టపరమైన ఆధారం
మేము సాధారణంగా Appleతో మీ ఒప్పందానికి సంబంధించిన పనితీరు కోసం, సర్వీస్‌ను అందించడానికి, అలాగే మా చట్టపరమైన బాధ్యతలకు అనుగుణంగా మీ Apple ఖాతా, అలాగే పైన పేర్కొన్న అనుబంధిత సమాచారాన్ని ప్రాసెస్ చేస్తాము. సమ్మతి అనేది తగిన చట్టపరమైన ఆధారం అయినప్పుడు, మేము వర్తించే స్థానిక చట్టానికి అనుగుణంగా దానిని కోరుతాము.
వర్తించే చట్టాలు అందించినప్పుడు, మేము మా అలాగే థర్డ్ పార్టీల చట్టపరమైన అవసరాల కోసం కింది విభాగాల వ్యక్తిగత డేటాను ప్రాసెస్ చేస్తాము, వీటితో కూడిన సమాచారంతో పాటుగా:
- మీ Apple ఖాతాలో మీరు సైన్ ఇన్ చేయడానికి ఉపయోగించే సమాచారం, అలాగే Apple సర్వీస్‌లలో మీరు ఉపయోగించే విశ్వసనీయ ఫోన్ నంబర్‌లు లేదా భద్రతా ప్రశ్నలు వంటి అన్ని కాంటాక్ట్, చెల్లింపు, ఇంకా సెక్యూరిటీ వివరాలు ఉంటాయి
- మీరు ఇన్‌స్టాల్ చేసే యాప్‌లు, ఇందులో అవి ఎక్కడ ఇన్‌స్టాల్ చేస్తారు అనేది కూడా ఉంటుంది (ఉదాహరణకు, వెబ్‌సైట్ లేదా యాప్ మార్కెట్ ప్లేస్)
- మీ డివైజ్ ఉన్న దేశం లేదా ప్రాంతం ఆధారంగా చట్టబద్ధంగా అవసరమైన నిర్దిష్ట సర్వీస్‌లు, ఫీచర్‌లకు అర్హత ఉందా లేదా అనేది
- మీ డివైజ్ పేరు, క్రమ సంఖ్య, ఇతర హార్డ్‌వేర్ ఐడెంటిఫైయర్‌లతో సహా మీ డివైజ్‌ల వివరాలు ఉంటాయి
- iCloud, iTunes Store, App Store, Apple Music, Apple One వంటి వివిధ Apple సర్వీస్‌లను మీరు ఉపయోగించడం, అలాగే సబ్‌స్క్రిప్షన్‌లు
- ఖాతా నంబర్‌లు, గడువు తేదీలు, బిల్లింగ్, షిప్పింగ్ చిరునామాలు, అలాగే గిఫ్ట్ కార్డ్ రిడెంప్షన్ సమాచారంతో సహా చెల్లింపు వివరాలు
ఈ చట్టపరమైన అవసరాలలో ఇక్కడ పేర్కొన్న అంశాలు ఉంటాయి:
- మీకు, అలాగే ఇతరులకు అకౌంటింగ్, రిపోర్టింగ్, అలాగే విశ్లేషణలు ప్రయోజనాల కోసం ఉత్తమమైన సర్వీస్‌లు, ఇంకా మద్దతును అందించడం
- చట్టబద్ధంగా అవసరమైన ఫీచర్‌లు, సర్వీస్‌ల లభ్యతను నిర్ణయించడం, అలాగే ప్రారంభించడం
- మీకు ఆసక్తి కలిగించే ఇమెయిల్, అలాగే Push నోటిఫికేషన్‌ల ద్వారా మీకు ఆఫర్‌లను పంపడానికి మీ డేటాను ఉపయోగించడం
- ఆఫర్‌ల కోసం అర్హతను చెక్ చేయడం
- మోసాలు, హానికర యాక్టివిటీని నిరోధించడం
రిటెన్షన్
మీరు సబ్‌స్క్రిప్షన్ వంటి కొనుగోలు చేసే చోట, ఫైనాన్షియల్ రిపోర్ట్‌లకు సంబంధించి వర్తించే చట్టాల ద్వారా పేర్కొన్న వ్యవధిలో మీ కొనుగోలుతో అనుబంధించబడిన వ్యక్తిగత డేటాను మేము అలాగే ఉంచుతాము, ఇది ప్రాంతాల వారీగా మారుతుంది. చాలా మంది కస్టమర్‌ల కోసం, 10 సంవత్సరాల రిటెన్షన్ వ్యవధి అవసరం, కానీ చైనా లాంటి ప్రాంతాలలో వ్యవధి 30 సంవత్సరాలు ఉండవచ్చు. మా వద్ద iCloud-సంబంధిత సర్వీస్‌లతో మీ ఇంటరాక్షన్‌ల రికార్డ్ కూడా ఉండవచ్చు. ఈ రికార్డ్‌లు సాధారణంగా 30 రోజుల పాటు స్టోర్ చేయబడతాయి, అయితే వాటిని ఎక్కువ కాలం పాటు స్టోర్ చేయడానికి చట్టం లేదా చట్టపరమైన ప్రక్రియ అవసరమైతే మినహా, సమగ్ర రూపంలో మూడు సంవత్సరాల వరకు స్టోర్ చేయబడతాయి.
మీరు మీ Apple ఖాతాను డిలీట్ చేస్తే, పైన వివరించిన వాటితో సహా, ఖాతా భద్రతకు సంబంధించి చట్టబద్ధమైన ఆసక్తుల కోసం అవసరమైనంత కాలం పాటు చట్టపరమైన బాధ్యతలకు కట్టుబడి ఉండటానికి మేము తొలగించబడిన ఖాతాకు సంబంధించిన రికార్డ్‌ను స్టోర్ చేస్తాము. మీరు తర్వాత కొత్త ఖాతాను సృష్టించడానికి ఎంచుకుంటే, మమ్మల్ని తొలగించమని మీరు రిక్వెస్ట్ చేసిన ఖాతాతో అనుబంధించబడని ఇమెయిల్ అడ్రెస్‌ను మీరు ఉపయోగించాల్సి ఉంటుంది. మీరు మీ ఖాతాను సృష్టించడానికి ఫోన్ నంబర్‌ను ఉపయోగించినట్లయితే, అదే కారణాల వల్ల వేరే ఖాతాను సృష్టించడానికి అది ఉపయోగించబడదు. మీరు ఖాతాను సృష్టించడానికి ఖాతాలోని ప్రాథమిక ఇమెయిల్ అడ్రెస్ లేదా ఫోన్ నంబర్‌ను ఉపయోగించినట్లయితే, దాన్ని మీరు తొలగించలేరు. మేము కోర్టు సెటిల్‌మెంట్ లేదా ఇతర సమానమైన తప్పనిసరి ప్రక్రియకు అనుగుణంగా సమాచారాన్ని స్టోర్ చేయాల్సి రావచ్చు.
మేము ఖాతాను తొలగించే సమయంలో, మీ ఖాతాతో అనుబంధించబడిన మొత్తం వ్యక్తిగత డేటాను తొలగించడానికి మేము వీలైనంత కృషి చేస్తాము. మేము మీ వ్యక్తిగత డేటాను తొలగిస్తే, మేము మీ గురించిన నిర్దిష్ట వ్యక్తిగత డేటాను శాశ్వతంగా తిరిగి పొందలేము, అలాగే నిర్దిష్ట వ్యక్తిగత డేటాను కూడా గుర్తుపట్టకుండా చేస్తాము.
అన్ని వేళలా Apple సేకరించిన సమాచారం, Apple గోప్యతా విధానానికి అనుగుణంగా ఉపయోగించబడుతుంది, దీని గురించి www.apple.com/in/privacy ద్వారా తెలుసుకోండి.
2026-05-11