Apple Music స్నేహితులు, గోప్యత
‘Apple Music స్నేహితులు’ మీ సమాచారాన్ని సంరక్షించడానికి డిజైన్ చేయబడింది, అలాగే మీరు ఏమి షేర్ చేయాలో ఎంచుకోవడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది.
![]()
- మీరు ప్రొఫైల్‌ను సృష్టించినప్పుడు, కొంత సమాచారం ఎల్లప్పుడూ పబ్లిక్‌గా ఉంటుంది, కాని మీరు మీ యాక్టివిటీని ఎవరు ఫాలో కావచ్చు అనేది నియంత్రించవచ్చు.
- Apple Music కాలానుగుణంగా మీ డివైజ్‌లో కాంటాక్ట్స్‌ను చెక్ చేసి కొత్త స్నేహితులను సిఫార్సు చేస్తుంది. ఇది Apple Music మీ కాంటాక్ట్స్ గురించి తెలుసుకోలేని విధంగా జరుగుతుంది.
- మీరు Apple ఖాతా కాంటాక్ట్ సమాచారం ఉన్న వ్యక్తులు మిమ్మల్ని సిఫార్సు చేసిన స్నేహితులుగా చూడాలా వద్దా అనేది నియంత్రించవచ్చు.
మీ సమాచార గోప్యత మరియు భద్రతను సంరక్షించడమే Appleలో ప్రతి ఒక్కరికి ప్రాధాన్యత. మీ అనుభూతిని మెరుగుపరచడానికి మాత్రమే అవసరమైన డేటాను సేకరించడానికి మేము చాలా కష్టపడతాము, మేము డేటాను సేకరిస్తున్నప్పుడు మేము ఏం సేకరిస్తున్నాం అది మాకు ఎందుకు అవసరం అనేది మీకు తెలియాలి అని ముఖ్యంగా భావిస్తాం, దీనితో మీరు తెలివిగా నిర్ణయాలు తీసుకోవచ్చు. Apple Music లానే ప్రతి Apple ప్రోడక్ట్ మరియు సర్వీస్ ఈ సూత్రాలను దృష్టిలో ఉంచుకుని డిజైన్ చేయబడతాయి.
మీరు ఇతర వ్యక్తులతో Apple Music ఉపయోగించి కనెక్ట్ లేదా షేర్ చేయాలి అనుకుంటే, మీరు యూజర్ హ్యాండిల్ (ఉదాహరణకు @johnappleseed), డిస్‌ప్లే పేరు అలాగే కావాలనుకుంటే ప్రొఫైల్ ఫోటో మరియు ఇతర సమాచారాన్ని అందించడం ద్వారా వ్యక్తిగత ప్రొఫైల్‌ను సృష్టించుకోవచ్చు. Apple ఈ సమాచారాన్ని మీ ఖాతాతో స్టోర్ చేస్తుంది దీనితో మీరు మీ డివైజ్‌లలో దేనితోనైనా యాక్సెస్ చేయవచ్చు. మీరు Apple Musicలో పోస్ట్ చేసిన కంటెంట్ అలాగే మీరు షేర్ చేసిన యాక్టివిటీతో పాటు మీ యూజర్ హ్యాండిల్, డిస్‌ప్లే పేరు మరియు ప్రొఫైల్ ఫోటో కనిపిస్తాయి. కంటెంట్‌ను షేర్ చేయడం అలాగే పోస్ట్ చేయడం ప్రస్తుతం పిల్లల కోసం Apple ఖాతాకు ఉద్దేశించబడలేదు లేదా అందుబాటులో లేదు.
మీరు అందించిన సమాచారాన్ని ఉపయోగించి ఇతర వ్యక్తులు కూడా మీ Apple Music ప్రొఫైల్‌ను కనుగొనవచ్చు.
మీరు వినే యాక్టివిటి అలాగే ప్లేలిస్ట్‌ల లాంటి మీ ప్రొఫైల్ కంటెంట్‌లను, మీరు ఎంచుకున్న వారికే అందుబాటులో ఉండేలా చేయవచ్చు. అయినప్పటికీ, హ్యాండిల్, డిస్‌ప్లే పేరు, ఫోటో, మీ ఫాలోవర్‌లు అలాగే మీరు ఎవరిని ఫాలో అవుతున్నారు అనే ప్రొఫైల్ సమాచారం ఎల్లప్పుడూ అందరికీ కనిపిస్తుంది.
మీరు Apple Musicలో ప్రొఫైల్‌ను సృష్టిస్తే, మేము మీరు స్నేహితులుగా కనెక్ట్ కావాలనుకునే ఇతర Apple Music సబ్‌స్క్రైబర్‌లను సిఫార్సు చేస్తాము. సిఫార్సు చేయడానికి స్నేహితులను చెక్ చేస్తున్నప్పుడు Apple మీ కాంటాక్ట్‌ల నుండి సమాచారాన్ని తెలుసుకోదు లేదా స్టోర్ చేయదు. మీ కాంటాక్ట్స్‌లోని ఫోన్ నంబర్‌లు అలాగే ఇమెయిల్ అడ్రెస్‌ల కుదించిన మరియు ఎన్‌క్రిప్ట్ చేసిన హ్యాష్‌లు మాత్రమే Appleకు పంపబడతాయి, ఆ తర్వాత మీ డివైజ్‌లో స్థానికంగా సిఫార్సులను నిర్ధారించడానికి Apple Music సబ్‌స్క్రైబర్‌లను సరిపోల్చుతుంది. Apple Music భవిష్యత్‌లో కొత్త స్నేహితులను సిఫార్సు చేయడానికి కాలానుగుణంగా మీ కాంటాక్స్ట్‌ను చెక్ చేస్తుంది; మీరు Apple Musicలో ఖాతా సెట్టింగ్స్‌లో కాంటాక్ట్స్‌ను డిసేబల్ చేయడం ద్వారా దీనిని నిర్వహించవచ్చు. మీరు ఇతరుల కాంటాక్ట్స్‌లో మీ గురించి ఉండే Apple ఖాతా కాంటాక్ట్స్ సమాచారం ఆధారంగా గుర్తించబడవద్దు అనుకుంటే, మీరు దీన్ని ఖాతా సెట్టింగ్స్‌లో ‘Apple ఖాతా ద్వారా గుర్తించడం ఆమోదించండి’ని డిసేబల్ చేసి మార్చవచ్చు.
మీ ప్రొఫైల్‌లో మీ ద్వారా అందించబడిన సమాచారాన్ని మీరు ఎప్పుడైనా అప్‌డేట్ చేయవచ్చు లేదా తొలగించవచ్చు. మీరు ఆన్‌లైన్‌లో షేర్ చేస్తున్నప్పుడు, మీరు ఏం పబ్లిక్‌గా పెడుతున్నారనేది జాగ్రత్తగా ఆలోచించాలి. మీరు Apple Music నుండి ఇతర వెబ్‌సైట్‌లు లేదా సోషల్ నెట్‌వర్క్‌లకు షేర్ చేసినప్పుడు, మీరు షేర్ చేసినది ఏదైనా ఆయా ఇతర సర్వీస్‌ల గోప్యత పాలసీలకు లోబడి ఉంటుంది.
వ్యక్తిగత డేటాను ప్రాసెస్ చేయడానికి వర్తించే చట్టపరమైన ఆధారం
మేము Appleతో మీ కాంటాక్ట్‌ల పనితీరు, తప్పనిసరిగా అందించాల్సిన సర్వీస్‌లు అలాగే చట్టపరమైన బాధ్యతలను పాటించడం కోసం సాధారణంగా Apple Music స్నేహితులలో మీ వ్యక్తిగత డేటాను ప్రాసెస్ చేస్తాము. సమ్మతి తగిన చట్టపరమైన ఆధారం అయినప్పుడు, మేము వర్తించే స్థానిక చట్టానికి అనుగుణంగా దానిని కోరుతాము.
వర్తించే చట్టాలకు తగినట్లుగా స్థానిక, Apple Music స్నేహితులకు అందించడానికి, మీరు కనెక్ట్ కావాలి అనుకునే ఇతర Apple Music సబ్‌స్క్రైబర్‌లను సూచించడంతో పాటు, చట్టపరమైన మా అవసరాల కోసం తప్పనిసరిగా వ్యక్తిగత డేటాను ప్రాసెస్ చేస్తాము.
ఉపయోగించే డేటాలో ఇవి ఉంటాయి:
- మీ Apple Music స్నేహితుల ప్రొఫైల్‌ల సమాచారం అలాగే Apple ఖాతా సంప్రదింపు సమాచారం
- మీరు పోస్ట్, షేర్ చేసిన కంటెంట్, మీరు ఎవరిని ఫాలో అవుతున్నారు, మిమ్మల్ని ఎవరు ఫాలో అవుతున్నారు
- మీ కాంటాక్ట్స్ గురించిన సమాచారం
- మీరు కనెక్ట్ కావాలి అనుకునే Apple Music సబ్‌స్క్రైబర్‌లు
అన్ని వేళలా Apple సేకరించిన సమాచారం, Apple గోప్యతా విధానానికి అనుగుణంగా ఉపయోగించబడుతుంది, దీని గురించి www.apple.com/in/privacy ద్వారా తెలుసుకోండి
2025-12-12