Apple News & గోప్యత
Apple News+తో పాటు Apple News మీ సమాచారాన్ని సంరక్షించేలా డిజైన్ చేయబడింది, అలాగే మీరు ఏమి షేర్ చేయాలో ఎంచుకోవడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది.
![]()
- News, స్టాక్స్‌లోని మీ పఠనం మరియు వినే యాక్టివిటి అనేవి News, స్టాక్స్ నిర్దిష్ట ఐడెంటిఫైయర్‌కు లింక్ చేయబడతాయి, అయితే మీ Apple ఖాతాతో అనుబంధించబడవు లేదా వేరే Apple సర్వీస్‌లతో లింక్ చేయబడవు.
- మీరు Apple Newsను ఎలా ఉపయోగిస్తారనే సమాచారాన్ని మీ వ్యక్తిగత ఆసక్తులకు తగ్గట్లుగా ఫీచర్లను అందించడానికి ఉపయోగిస్తాము. ఈ సమాచారం మీ Apple ఖాతాతో అనుబంధించబడదు.
- మీ ఖాతా, మీరు చదివే స్టోరీల అంశాలు, విభాగాలు అలాగే మీరు ఫాలో చేసే, సబ్‌స్క్రైబ్ చేసే ప్రచురణలు లేదంటే News, స్టాక్స్‌లో మీకు సంబంధించిన ప్రకటనలను నిర్ధారించడానికి నోటిఫికేషన్‌లను ఆన్ చేయడం గురించిన సమాచారాన్ని మేము ఉపయోగించవచ్చు. మేము App Storeలో ప్రకటనలను వ్యక్తిగతీకరించడానికి మీ సబ్‌స్క్రిప్షన్‌ల గురించిన సమాచారాన్ని కూడా ఉపయోగిస్తాము. ఈ ప్రకటన గురించి కింద వివరించిన విధంగా మీకు అవకాశాలు ఉంటాయి.
- మేము, Apple Newsలో ఉపయోగించిన యాక్టివ్ సబ్‌స్క్రిప్షన్‌ల కోసం మీ Apple ఖాతాను తనిఖీ చేస్తాము.
- మీరు ఛానెల్ కోసం నోటిఫికేషన్‌లను ఆన్ చేస్తే. మేము ఆ ఛానెల్‌ను మీ Apple ఖాతాతో అనుబంధిస్తాము.
మీ సమాచార గోప్యత మరియు భద్రతను సంరక్షించడమే Appleలో ప్రతి ఒక్కరికి ప్రాధాన్యం. మీ అనుభూతిని మెరుగుపరచడానికి మాకు కావాల్సిన డేటాను మాత్రమే సేకరించడానికి మేము చాలా కష్టపడతాము. మేము డేటాను సేకరిస్తున్నప్పుడు మేము ఏం సేకరిస్తున్నాం అది మాకు ఎందుకు అవసరం అనేది మీకు తెలియాలి అని ముఖ్యంగా భావిస్తాం, దీనితో మీరు తెలివిగా నిర్ణయాలు తీసుకోవచ్చు. Apple News లానే ప్రతి Apple ప్రోడక్ట్ మరియు సర్వీస్ ఈ సూత్రాలను దృష్టిలో ఉంచుకుని డిజైన్ చేయబడతాయి.
Apple Newsను అందిస్తోంది
మీరు చదివే, వినే కథలు వ్యక్తిగతమైనవని మేము అర్థం చేసుకుంటాము, అందుకే మేము వార్తలు, స్టాక్స్ యాప్‌లను డిజైన్ చేశాము, దానివలన మీ పఠనం, చదివే యాక్టివిటి అలాగే మీరు Apple Newsను ఎలా ఉపయోగిస్తారు అనేది మీ Apple ఖాతాతో అనుబంధించబడదు మరియు వేరే Apple సర్వీస్‌లతో లింక్ చేయబడదు. మేము సేకరించే డేటా News, అలాగే స్టాక్స్ యాప్‌ల నిర్దిష్ట ఐడెంటిఫైయర్‌తో అనుబంధించబడుతుంది.
మీరు Apple Newsను ఎలా ఉపయోగిస్తారనే దాని గురించి మీ వ్యక్తిగత ఆసక్తులకు తగ్గట్లుగా ఫీచర్లను అందించడానికి Apple సమాచారాన్ని సేకరిస్తుంది. ఉదాహరణకు, మీ ఫేవరేట్ ఛానెల్, అంశాల నుండి ఉత్తమ కథలను హైలైట్ చేసే వ్యక్తిగత న్యూస్‌ఫీడ్‌తో ‘ఈరోజు’ ఫీచర్ మీకు అందిస్తుంది. మీరు చదివే, వినే లేదా సేవ్ చేసే, షేర్ చేసే అంశాలు అలాగే మీరు ఫాలో చేసే అంశాలతో సహా Apple Newsతో మీ సంభాషణల గురించి సమాచారాన్ని సేకరించడం ద్వారా Apple ఈ ఫీచర్‌లను సాధ్యం చేస్తుంది.
Apple Newsలో సిఫార్సులు అనేవి మీ డివైజ్‌లో స్టోర్ చేయబడిన సమాచారాన్ని ఆధారం చేసుకుని రూపొందించబడతాయి. మీ iOS డివైజ్‌లో మీరు చదివే, వినే చరిత్రను క్లియర్ చేయడానికి, ‘ఫాలో చేస్తున్నవి > చరిత్ర’కు వెళ్ళి, క్లియర్ చేయండిపై ట్యాప్ చేయండి. మీ iPadOS డివైజ్‌లో, చరిత్రకు వెళ్ళి, క్లియర్ చేయండి ట్యాప్ చేయండి. Macలో, News > ‘చరిత్రను క్లియర్ చేయండి’కి వెళ్ళి, చరిత్రను క్లియర్ చేయండి’ని క్లిక్ చేయండి. దీని వలన News, స్టాక్స్ కోసం ఉపయోగించబడిన ఐడెంటిఫైయర్ రీసెట్ చేయబడుతుంది. మీరు సెట్టింగ్స్ > యాప్‌లు > News వెళ్ళి, ఆపై రీసెట్ ఐడెంటిఫైయర్‌ను ఆన్ చేయడానికి ట్యాప్ చేయడం ద్వారా iOS, iPadOS లేదా visionOS డివైజ్‌లో మీ చదివే, వినే చరిత్రను క్లియర్ చేయకుండానే ఐడెంటిఫైయర్‌ను రీసెట్ చేయవచ్చు. Macలో, Newsను తెరిచి ఆపై వార్తలు > ‘చరిత్రను క్లియర్ చేయండి’కి వెళ్ళి, ఐడెంటిఫైయర్‌ను రీసెట్ చేయండి.
Apple Newsలోని ఛానెల్ కోసం మీరు నోటిఫికేషన్ ఆన్ చేస్తే, ఛానెల్ నుండి మీకోసం ముఖ్యమైన కథనాలు, అలాగే సరికొత్త సంచికల గురించి మీకు తెలియజేయడానికి మేము ఆ సమాచారాన్ని స్టోర్ చేస్తాము, అలాగే అలాంటి సమాచారాన్ని మీ Apple ఖాతాతో అనుబంధిస్తాము. (సరికొత్త సంచికల నోటిఫికేషన్‌లు Apple News+ సబ్‌స్క్రైబర్‌ల కోసమే అలాగే iOS, iPadOS డివైజ్‌లలో మాత్రమే అందుబాటులో ఉన్నాయి.) మీరు లైవ్ యాక్టివిటితో ఇవెంట్‌ను ఫాలో చేస్తున్నప్పుడు, ఆ ఇవెంట్ వ్యవధి గురించి అప్‌డేట్‌లను మీకు పంపడానికి మేము ఆ ఇవెంట్‌ను మీ Apple ఖాతాతో అనుబంధిస్తాము.
మీరు సబ్‌స్క్రిప్షన్‌లతో సహా Apple News, సమాచారంలో శోధనను ఉపయోగించినప్పుడు, మీకు సంబంధిత శోధన ఫలితాలను అందించడానికి అలాగే శోధనను మెరుగుపరచడానికి మీ శోధన క్వెరీతో ఆ సమాచారం Appleకు పంపబడుతుంది. ఈ సమాచారం మీ Apple ఖాతాతో అనుబంధించబడదు.
మీరు మీ లొకేషన్‌ను యాక్సెస్ చేసేలా Apple Newsకు అనుమతిస్తే, స్థానిక వార్తలు, వాతావరణం, శోధన ఫలితాలు అలాగే అడ్వర్టయిజింగ్ వంటి స్థానిక సంబంధిత సమాచారాన్ని అందించడానికి మీ సుమారు లొకేషన్ ఉపయోగించబడుతుంది. అదనంగా, మీ లొకేషన్ అలాగే Apple Newsలో మీ యాక్టివిటి ఆధారంగా మీకు ఛానల్‌లు, అంశాలు సూచించబడవచ్చు. మీరు స్థానిక సంబంధిత సమాచారాన్ని కనుగొనడానికి లొకేషన్ లేదా జిప్ కోడ్‌ను మాన్యువల్‌గా కూడా నమోదు చేయవచ్చు. ఈ సమాచారం మీ Apple ఖాతాతో అనుబంధించబడదు.
మీరు సెట్టింగ్స్ > గోప్యత, భద్రత > ‘లొకేషన్ సర్వీస్‌లు’కు వెళ్ళి ‘News’ ట్యాప్ చేసి ఆపై ‘ఎప్పటికీ వద్దు’ ఎంచుకోవడం ద్వారా లొకేషన్-ఆధారిత కార్యాచరణను ఏ సమయంలోనైనా మీ iOS, iPadOS డివైజ్‌లో ఆపివేయవచ్చు. Macలో, సిస్టమ్ సెట్టింగ్స్ > గోప్యత, భద్రత > గోప్యత > లొకేషన్ సర్వీస్‌లకు వెళ్ళి, ఆపై ‘News’ ఎంపికను తీసివేయండి.
మీరు ఉపయోగించే యాప్‌ల నుంచి తీసుకున్న సమాచారం, ఆన్-డివైజ్ ప్రాసెసింగ్, ఇంకా మీరు Safariతో సందర్శించే వెబ్‌సైట్‌లు ఆధారంగా Siri మీకు నచ్చే కథలు, ఛానెల్‌లు అలాగే అంశాలను సూచిస్తుంది. ఈ సమాచారం Appleకు పంపబడదు. మీరు దీన్ని ఏ సమయంలోనైనా మీ iOS లేదా iPadOS డివైజ్‌లో సెట్టింగ్స్ > యాప్‌లు > News > Siri & శోధనకు వెళ్లి, ‘యాప్‌లో చూపించండి’ని ఆఫ్ చేయండి ట్యాప్ చేయడం ద్వారా డిసేబల్ చేయవచ్చు. మీ visionOS డివైజ్‌లో, సెట్టింగ్స్ > యాప్స్ > Newsకు వెళ్ళి, ఆపై ‘యాప్‌లో చూపించండి’ని ఆఫ్ చేయడానికి ట్యాప్ చేయండి. Macలో, సిస్టమ్ సెట్టింగ్స్ > Siri & Spotlightకు వెళ్ళి, Siri సూచనలు & గోప్యతను క్లిక్ చేసి, News క్లిక్ చేయండి, ఆపై ‘యాప్‌లో Siri సూచనలు చూపండి’ ఎంపికను తీసివేయండి.
మీ సౌకర్యం కోసం, Apple News మీ డివైజ్‌లన్నింటిలో అనుభూతి అంశాలను అప్‌డేట్‌గా ఉంచడానికి iCloudను ఉపయోగిస్తుంది. ఉదాహరణకు, మీరు అనుసరించే ఛానెల్‌లు, అంశాలు, మీరు పఠన, విన్న చరిత్ర, మీ పఠన, విన్న ప్రాధాన్యతలు, అలాగే మీ వంటకాల రేటింగ్‌లు, నోట్స్‌ను గుర్తుంచుకోవడానికి Apple News, iCloudను ఉపయోగిస్తుంది, తద్వారా మీరు మీ ఏ డివైజ్ నుండి అయినా ఒకే రకమైన Apple News అనుభవాన్ని ఆస్వాదించవచ్చు. మీ పఠనం, వినే చరిత్ర అనేది మూడు నెలల వరకు స్టోర్ చేయబడుతుంది. మీరు ఛానెల్ లేదా అంశాన్ని అన్‌ఫాలో చేస్తే, మీ సేవ్ చేసిన స్టోరీ నుండి స్టోరీ తొలగించబడుతుంది, లేదా పఠనం చరిత్ర నుండి స్టోరీని డిలీట్ చేయబడుతుంది, ఆ సమాచారం తక్షణమే Apple’ సర్వర్‌ల నుండి డిలీట్ చేయబడుతుంది. మీరు Apple News కోసం iCloudను ఆఫ్ చేయడం ద్వారా ఏ సమయంలోనైనా ఈ సామర్థ్యాన్ని డిసేబల్ చేయవచ్చు. మీ iOS, iPadOS లేదా visionOS డివైజ్‌లో అలా చేయడానికి సెట్టింగ్స్ > [మీ పేరు] > iCloudకు వెళ్ళి, ఆపై News ఆఫ్ చేయడానికి ట్యాప్ చేయండి. Macలో, సిస్టమ్ సెట్టింగ్స్ > [మీ పేరు] > iCloudకు వెళ్ళి, News ఎంపికను తీసివేయండి. మీరు ఈ ఫీచర్‌ను డిసేబల్ చేస్తే, మీరు ఫాలో చేసే ఛానెల్‌లు, అంశాలు, మీ పఠనం, వినే చరిత్ర అలాగే మీ పఠనం, వినే చరిత్ర ప్రాధాన్యతలు iCloud Backup ఎనేబల్ చేయబడితే iCloudకు బ్యాకప్ చేయబడతాయి.
సబ్‌స్క్రిప్షన్‌లు
మీరు Apple News+కు సబ్‌స్క్రైబ్ చేస్తే, వివిధ ప్రచురణల నుండి సబ్‌స్క్రిప్షన్ కంటెంట్‌ను మీరు యాక్సెస్ చేయగలుగుతారు. ప్రత్యామ్నాయంగా, వివిధ మార్గాల్లో ప్రత్యేక ప్రచురణల నుండి మీరు సబ్‌స్క్రిప్షన్ కంటెంట్‌ను యాక్సెస్ చేయగలుగుతారు.
మొదటగా, మీరు App Store నుండి Apple Newsలో ఉపయోగించగలిగే ఏవైనా యాక్టివ్ సబ్‌స్క్రిప్షన్‌లను కలిగి ఉంటే Apple News అనేది మీ Apple ఖాతాను చెక్ చేస్తుంది. అప్పుడు, Apple News ఆటోమేటిక్‌గా మీ సబ్‌స్క్రిప్షన్‌లను అన్‌లాక్ చేసి, ప్రచురణలు పెయిడ్ స్టోరీలకు యాక్సెస్‌ను అందిస్తుంది. రెండవదిగా, News యాప్‌లో నేరుగా మీ వ్యక్తిగత ప్రచురణకు సబ్‌స్క్రిప్షన్‌ను కొనుగోలు చేయవచ్చు, ఈ సందర్భంలో మీరు ప్రచురణతో మీ వ్యక్తిగత సమాచారాన్ని షేర్ చేయడం ఎంచుకోవచ్చు. మూడవదిగా, గతంలో మీరు ప్రచురణ నుండి నేరుగా సబ్‌స్క్రిప్షన్‌ను కొనుగోలు చేస్తే (ఉదాహరణకు, ప్రచురణ వెబ్‌సైట్‌లో), మీ సబ్‌స్క్రిప్షన్ ఖాతాతో Apple Newsలోకి సైన్ ఇన్ చేయడానికి ప్రచురణకర్త మిమ్మల్ని అనుమతించవచ్చు. తర్వాత ప్రచురణ మీ సబ్‌స్క్రిప్షన్‌ను ధృవీకరించి, Apple Newsలో వారి సబ్‌స్క్రిప్షన్ కంటెంట్‌కు యాక్సెస్‌ను మంజూరు చేస్తుంది.
Apple News+ ప్రచురణలో భాగంగా మీకు వ్యక్తిగత సబ్‌స్క్రిప్షన్ ఉంటే, మీకు Apple News+ సబ్‌స్క్రిప్షన్ లేకపోయినప్పటికీ ఆ ప్రచురణ నుండి పెయిడ్ కంటెంట్‌ను మీరు యాక్సెస్ చేయగలుగుతారు.
కొన్ని దేశాలలో, ఎంచుకున్న స్టోరీల ఆడియో వెర్షన్‌ను అలాగే Apple News సంపాదకుల ద్వారా హోస్ట్ చేయబడిన రోజు మొత్తంలో టాప్ స్టోరీల క్లుప్తమైన సారాంశాన్ని వివరించే ఆడియోను మీరు వినవచ్చు. iPhone, iPod touch అలాగే CarPlayలో ఆడియో అందుబాటులో ఉంది. పూర్తి ఆడియో స్టోరీలు Apple News+ సబ్‌స్క్రైబర్‌లకు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. సబ్‌స్క్రైబర్‌లు కాని వారు చిన్న ప్రివ్యూను వినవచ్చు. క్లుప్తమైన ఆడియో, సబ్‌స్క్రైబర్‌లకు అలాగే సబ్‌స్క్రైబర్‌లు కాని వారికి అందుబాటులో ఉంది.
స్టోరీల ఆడియో వెర్షన్‌లు అలాగే క్లుప్తమైనవి డిజిటల్ కంటెంట్ యాక్సెస్ కంట్రోల్ మరియు ఎన్‌క్రిప్షన్ కోసం Apple FairPlay స్ట్రీమింగ్ డిజిటల్ హక్కుల నిర్వహణ (DRM) ఫ్రేమ్‌వర్క్ ద్వారా సంరక్షించబడతాయి. మీ డివైజ్ రిక్వెస్ట్ చేసే ‘కీ’ల నుండి మీరు వినే చరిత్రను Apple సంగ్రహించదని నిర్ధారించడానికి Apple News బహుళ ఫైల్‌ల అంతటా డిక్రిప్షన్ ‘కీ’లను షేర్ చేస్తుంది.
Apple Podcasts
Apple News ఆడియో కంటెంట్ Apple Podcastsలో అందుబాటులో ఉంది. మీరు అలాంటి కంటెంట్‌ను Apple Podcastsలో వింటే, మీరు వినే యాక్టివిటి www.apple.com/in/legal/privacy/data/en/apple-podcasts వద్ద Apple Podcasts & గోప్యత నియమాలకు లోబడి ఉంటుంది. ఉదాహరణకు, డివైజ్‌ల అంతటా సింక్ చేయడానికి మీరు వినే పాడ్‌కాస్ట్ ఎపిసోడ్‌ల ప్లే పొజిషన్ Appleకు తెలుస్తుంది.
Game Center
మీరు Game Centerలో సైన్ ఇన్ చేసిన తర్వాత, స్కోర్‌లు, పరిష్కార సమయాలు అలాగే వేరే విజయాలు చేర్చబడిన మీ పజిల్ యాక్టివిటీని Apple అందుకుంటుంది. మీరు దీన్ని ఏ సమయంలోనైనా మీ iOS, iPadOS లేదా visionOS డివైజ్‌లో సెట్టింగ్స్ > యాప్‌లు >News > News+ పజిల్‌లకు వెళ్ళి, ‘Game Center’ని ఆఫ్ చేయండి ట్యాప్ చేయడం ద్వారా డిసేబల్ చేయవచ్చు. Macలో, News > సెట్టింగ్‌లకు వెళ్ళి, ఆపై Game Center ఎంపికను తీసివేయడానికి క్లిక్ చేయండి. మీరు www.apple.com/in/legal/privacy/data/en/game-center లింక్‌కు వెళ్ళి, Game Center, గోప్యత గురించి మరింత తెలుసుకోవచ్చు.
Apple Newsను మెరుగుపరుస్తోంది
మీ Apple News వినియోగం గురించి మీ Apple ఖాతాతో సంబంధం లేని సమాచారాన్ని కూడా Apple సేకరిస్తుంది. ఇందులో మీరు ఉపయోగించే ఫీచర్‌లు, మీరు చదివే లేదా చూసే స్టోరీలు, లైవ్ యాక్టివిటీలతో మీ ఇంటరాక్షన్‌లు, అలాగే లోడ్ సమయాలు, నోటిఫికేషన్ డెలివరీ, ఎర్రర్‌లు, క్రాష్‌ల గురించిన సమాచారం వంటి యాప్ పనితీరు గురించిన సమాచారం ఉంటుంది. ఇందులో మీ డివైజ్ రకం, మీ ఆపరేటింగ్ సిస్టమ్ వెర్షన్ వంటి మీ డివైజ్ గురించిన సమాచారం కూడా ఉంటుంది. మేము ఈ సమాచారాన్ని మీకు, ఇంకా ఇతరులకు Apple Newsను మెరుగుపరచడానికి, ఆప్టిమైజ్ చేయడానికి ఉపయోగిస్తాము.
మీతో కమ్యూనికేట్ చేయడం
Apple మీకు Apple News+, ఇతర Apple ప్రోడక్ట్‌లు, సర్వీస్‌లు అలాగే Apple Oneతో పాటు మీకు ఆసక్తికరంగా అనిపించే ఆఫర్ల కమ్యూనికేషన్‌లను పంపడానికి మీ వద్ద ఉన్న Apple ప్రోడక్ట్‌లు, Apple సర్వీస్‌లకు మీ సబ్‌స్క్రిప్షన్‌లు, మీరు డౌన్‌లోడ్ చేసిన Apple యాప్‌లు, సమాచారాన్ని ఉపయోగించవచ్చు. మీ డివైజ్ సీరియల్ నంబర్ లేదా మీ Apple News+ సబ్‌స్క్రిప్షన్ గురించిన వివరాలు, Apple ఆఫర్‌ల అర్హతను చెక్ చేయడానికి ఉపయోగించబడవచ్చు. మీరు ఫ్యామిలీ షేరింగ్ గ్రూప్‌లో ఉంటే, Apple మీకు ప్రోడక్ట్‌లు, సర్వీస్‌లు, ఫ్యామిలీ షేరింగ్ ద్వారా మీకు అందుబాటులో ఉన్న ఆఫర్ల గురించి కమ్యూనికేషన్‌లను పంపవచ్చు. మీరు Apple One సబ్‌స్క్రిప్షన్‌ను కొనుగోలు చేస్తే, మీరు సబ్‌స్క్రైబ్ చేసుకున్న ప్రతి సర్వీస్ ఫీచర్ల గురించి మేము ఇమెయిల్‌లు మరియు Push నోటిఫికేషన్‌లను పంపవచ్చు. Apple కొత్త ఫీచర్లు, కంటెంట్ మరియు Apple Newsలో అందుబాటులో ఉన్న ఆఫర్ల గురించి Apple Newsలో మీ యాక్టివిటి గురించిన సమాచారాన్ని కూడా ఉపయోగించవచ్చు. మీరు account.apple.com లింక్‌కు వెళ్ళి, మీ ఇమెయిల్ ప్రాధాన్యతలను మార్చవచ్చు, అలాగే ఈ ఇమెయిల్‌లను అందుకోకుండా ఆపివేయవచ్చు. మీ iOS, iPadOS లేదా visionOS డివైజ్‌లో నోటిఫికేషన్ ప్రాధాన్యతలను అప్‌డేట్ చేయడానికి సెట్టింగ్స్ > నోటిఫికేషన్‌లు > Newsకు వెళ్ళండి. Macలో, News తెరిచి, ఫైల్ > ‘నోటిఫికేషన్‌లు, ఇమెయిల్‌ను నిర్వహించండి’కి వెళ్ళండి. Apple, నోటిఫికేషన్‌లతో పాటు మా కమ్యూనికేష్‌లతో మీ ఇంటరాక్షన్‌ల గురించిన సమాచారాన్ని మా సర్వీస్‌లను మెరుగుపరచడానికి ఉపయోగిస్తుంది.
ప్రకటన
అగ్రశ్రేణి ప్రచురకర్తల నుండి మీకు అద్భుతమైన కంటెంట్‌ను డెలివర్ చేయడానికి, Apple News ప్రకటన మద్దతు ఇస్తుంది. వ్యక్తిగతీకరించిన ప్రకటనల సెట్టింగ్ ఆన్ చేయబడితే, Apple అడ్వర్టయిజింగ్ ప్లాట్‌ఫారమ్ మీ ఖాతా, మీరు చదివే స్టోరీల అంశాలు అలాగే విభాగాలు మరియు మీరు ఫాలో, సబ్‌స్క్రైబ్ చేసే ప్రచురణలు, లేదా మీకు సంబంధించిన ప్రకటనలను అందించడానికి ఆన్ చేసిన నోటిఫికేషన్‌ల గురించిన సమాచారాన్ని ఉపయోగిస్తుంది. మేము App Storeలో ప్రకటనలను వ్యక్తిగతీకరించడానికి మీ సబ్‌స్క్రిప్షన్‌ల గురించిన సమాచారాన్ని కూడా ఉపయోగిస్తాము. వ్యక్తిగతీకరించిన ప్రకటనలను ఆఫ్ చేయడం వలన, సంబంధిత ప్రకటనలను కోసం Apple ఈ సమాచారాన్ని ఉపయోగించడం నిరోధించబడుతుంది. ఇది మీకు వచ్చే ప్రకటనల సంఖ్యను తగ్గించదు, కానీ ప్రకటనలు మీకు అంతగా సంబంధించినవి ఉండకపోవచ్చు. మీ iOS, iPadOS లేదా visionOS డివైజ్‌లో, సెట్టింగ్స్ > గోప్యత, భద్రత > Apple అడ్వర్టయిజింగ్‌కు వెళ్ళి, వ్యక్తిగతీకరించిన ప్రకటనలను ఆఫ్ చేయడానికి ట్యాప్ చేయడం ద్వారా మీరు వ్యక్తిగతీకరించిన ప్రకటనలను డిసేబల్ చేయవచ్చు. Macలో సిస్టమ్ సెట్టింగ్స్ > గోప్యత, భద్రత > Apple అడ్వర్టయిజింగ్‌కు వెళ్లి, వ్యక్తిగతీకరించిన ప్రకటనలను ఎంపిక నుంచి తీసివేయండి. మీరు Apple Newsలో చదివే, వినే స్టోరీలు మీరు News లేదా స్టాక్స్ యాప్‌లలో ఉన్నప్పుడు అడ్వర్టయిజ్‌మెంట్‌లను పంపడానికి మాత్రమే ఉపయోగించబడతాయి.
థర్డ్ పార్టీలకు డిస్‌క్లోజర్
మేము మీ వ్యక్తిగత డేటాను థర్డ్ పార్టీలతో షేర్ చేయము. మా ప్రోడక్ట్‌లు, సర్వీస్‌లకు అందించడానికి, మా కస్టమర్‌లకు Apple మార్కెట్ సహాయం చేయడానికి అలాగే Apple Newsలో Apple తరపున ప్రకటనలను చూపేందుకు విక్రయించడానికి మేము వ్యక్తిగతం కాని నిర్దిష్ట డేటాను వ్యూహత్మక పార్ట్‌నర్‌లకు అందుబాటులో ఉంచడానికి మేము బాధ్యత వహిస్తాము. ఉదాహరణకు, ప్రచురకర్తలకు చెల్లించడానికి Apple News మీ వినియోగం గురించిన వ్యక్తిగతం కాని డేటాను Apple ఉపయోగించవచ్చు అలాగే యూజర్‌లు చదివే విధానాన్ని లేదా వారి కంటెంట్‌ను అర్థం చేసుకోవడంలో వారికి సహాయపడటానికి Apple News ప్రచురకర్తలతో సమగ్ర రిపోర్ట్ షేర్ చేయవచ్చు. సమూహపరచినటువంటి రిపోర్ట్‌లలో యూజర్ డెమోగ్రఫిక్‌లు, వయస్సు అలాగే లింగత్వం (మీ పేరు అలాగే మీ Apple ఖాతాలో అభివాదం వంటి సమాచారం నుండి సంగ్రహించబడినవి) వంటివి చేర్చబడవచ్చు. సమాచారం ప్రాసెసింగ్, కస్టమర్ సర్వీస్‌ను అందించడం, మా ప్రోడక్ట్‌లు, సర్వీస్‌లలో మీ ఆసక్తులను అంచనా వేయడం మరియు మా తరపున కస్టమర్ పరిశోధన లేదా సంతృప్తికర సర్వేలను నిర్వహించడం వంటి సర్వీస్‌లను అందించే సర్వీస్ ప్రొవైడర్‌లతో కూడా సమాచారాన్ని Apple షేర్ చేయవచ్చు. ఈ కంపెనీలు మీ సమాచారాన్ని సంరక్షించడానికి బాధ్యత వహిస్తాయి అలాగే Apple ఆపరేట్ చేసే ప్రదేశాలను గుర్తించవచ్చు.
మీరు Apple Newsలో వ్యక్తిగత ప్రచురణకు సబ్‌స్క్రిప్షన్‌ను కొనుగోలు చేసినప్పుడు, మీకు అలాగే పబ్లిషర్‌కు ప్రత్యేకంగా ఉండేలా Apple సబ్‌స్క్రైబర్ IDని సృష్టిస్తుంది. మీరు కొనుగోలు చేసిన సబ్‌స్క్రిప్షన్ అలాగే మీ దేశం లేదా నివాస ప్రాంతం గురించిన సమాచారం కలిగి ఉన్న రిపోర్ట్‌లను ప్రచురకర్తలకు అందించడానికి మేము సబ్‌స్క్రైబర్ IDని ఉపయోగిస్తాము, దాని వలన పబ్లిషర్‌లు వారి సబ్‌స్క్రిప్షన్‌ల పనితీరును అర్థం చేసుకోగలుగుతారు. మీరు నిర్దిష్ట పబ్లిషర్‌తో మీ అన్ని సబ్‌స్క్రిప్షన్‌లను రద్దు చేసి, మళ్ళీ సబ్‌స్క్రైబ్ చేయకపోతే, సబ్‌స్క్రైబర్ ID 180 రోజుల తర్వాత రీసెట్ చేయబడుతుంది.
వేరే వెబ్‌సైట్‌లు లేదా సోషల్ నెట్‌వర్క్‌లతో Apple News కంటెంట్‌ను షేర్ చేయడానికి Apple News కూడా మిమ్మల్ని అనుమతిస్తుంది. మీరు Apple News కంటెంట్‌ను వెబ్‌సైట్‌లు లేదా సోషల్ నెట్‌వర్క్‌ల వంటి వేరే ప్రదేశాలకు షేర్ చేసినప్పుడు, ఆ సమాచారం ఆ వెబ్‌సైట్‌ల లేదా సోషల్ నెట్‌వర్క్ గోప్యతా పాలసీల ద్వారా నిర్వహించబడతాయి. మీరు ఈ సమాచారాన్ని థర్డ్ పార్టీలతో షేర్ చేయకూడదనుకుంటే, Apple News కంటెంట్‌ను థర్డ్ పార్టీ వెబ్‌సైట్‌లు లేదా సోషల్ నెట్‌వర్క్‌లకు షేర్ చేయవద్దు.
మేము ఏదైనా ఉద్దేశ్యం కోసం వ్యక్తిగతం కాని డేటాను సేకరించి, ఉపయోగించి, అలాగే బహిర్గతం చేయవచ్చు. ఉదాహరణకు, మేము సర్వీస్‌ను మెరుగుపరచడానికి వేరే Apple News యూజర్‌లతో మీ వ్యక్తిగతం కాని డేటాను సమగ్ర పరచవచ్చు.
మోసాలు, హానికర యాక్టివిటీని నిరోధించడం
మేము, మీరు కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు మీ డివైజ్‌లో ట్రస్ట్ స్కోర్‌ను, మీరు మీ డివైజ్‌ను ఎలా ఉపయోగిస్తున్నారు అనే సమాచారాన్ని ఉపయోగించి, సుమారు ఎన్ని కాల్స్, ఇమెయిల్‌లు మీరు పంపారు, అందుకున్నారు అనే దానితో సహా కంప్యూట్ చేయవచ్చు. Apple మీ డివైజ్‌లోని అంతర్లీన విలువలను తెలుసుకోవడానికి వీలు లేకుండా సబ్మిషన్ రూపొందించబడింది. స్కోర్ మా సర్వర్‌లలో నిర్ణీత సమయం వరకు స్టోర్ చేసి ఉంటుంది. Apple News+ సబ్‌స్క్రిప్షన్ రెన్యువల్‌లను ప్రాసెస్ మేము, చేయడానికి, చెల్లింపు పార్ట్‌నర్ అనుమతి ఇవ్వడానికి ముందుగానే మీ సబ్‌స్క్రిప్షన్‌కు కొనసాగుతున్న యాక్సెస్‌ను అందించాలా వద్దా అని నిర్ణయించడానికి Appleతో మీ చారిత్రక వ్యాపార సంబంధం గురించిన సమాచారాన్ని కూడా ఉపయోగించవచ్చు.
వ్యక్తిగత డేటాను ప్రాసెస్ చేయడానికి వర్తించే చట్టపరమైన ఆధారం
మేము Appleతో మీ కాంటాక్ట్‌ల పనితీరు, తప్పనిసరిగా అందించాల్సిన సర్వీస్‌లు అలాగే చట్టపరమైన బాధ్యతలను పాటించడం కోసం సాధారణంగా మీ వ్యక్తిగత డేటాను Apple Newsలో ప్రాసెస్ చేస్తాము. సమ్మతి అనేది తగిన చట్టపరమైన ఆధారం అయినప్పుడు, మేము వర్తించే స్థానిక చట్టానికి అనుగుణంగా దానిని కోరుతాము.
వర్తించే స్థానిక చట్టాలు అందించినప్పుడు, మేము మా అలాగే థర్డ్ పార్టీల చట్టపరమైన అవసరాల కోసం కింది విభాగాల వ్యక్తిగత డేటాను ప్రాసెస్ చేస్తాము, ఇందులో భాగంగా:
- మీకు అందుబాటులో ఉన్న కంటెంట్‌ను ప్రదర్శించడం కోసం
- ఆఫర్ల కోసం అర్హతను చెక్ చేయండి, మీ కోసం, ఇతరుల కోసం సర్వీస్‌ను ఆప్జిమైజ్ చేయడం, మెరుగుపరచడం అలాగే Apple News మరియు Apple ప్రోడక్ట్‌లకు సంబంధించిన వేరేవి, సర్వీస్‌లు, Apple Oneతో సహా మీకు ఆసక్తిగా ఉండే ఆఫర్ల గురించి కమ్యూనికేషన్‌లను పంపిస్తుంది
- మోసాలు, హానికర యాక్టివిటీని నివారించడం
ఉపయోగించే డేటాలో ఇవి ఉంటాయి:
- మీ డివైజ్ అలాగే ఖాతా, ప్రచురణలు అలాగే Apple సర్వీస్‌ల సబ్‌స్క్రిప్షన్‌లు, మీరు సొంతం చేసుకున్న Apple ప్రోడక్ట్‌లు, మీరు డౌన్‌లోడ్ చేసే Apple యాప్‌లు అలాగే మీరు ఫ్యామిలీ షేరింగ్ గ్రూప్‌లో ఉన్నారా లేదా అనే దాని గురించి వివరాలు
- మీరు ఎనేబల్ చేసిన నోటిఫికేషన్‌ల కోసం ఛానెల్‌లు
- డివైజ్ ట్రస్ట్ స్కోర్
రిటెన్షన్
మేము వ్యాపార అవసరత, ఒప్పంద బాధ్యత లేదా చట్టపరమైన అవసరతను చాలాకాలం కలిగి ఉన్నప్పుడు మేము Apple Newsకు సంబంధించిన వ్యక్తిగత డేటాను మాత్రమే అలాగే ఉంచుతాము. మీ స్టోర్ చేసిన కార్డ్ వివరాలు కాకుండా మీ కొనుగోలు చరిత్ర లాంటి కొంత సమాచారం, మీరు మీ ఖాతాను మూసివేసిన లేదా Apple News+ నుంచి అన్‌సబ్‌స్క్రైబ్ చేసినా బిజినెస్ రికార్డ్‌లుగా అలాగే స్టోర్ చేసి ఉంచడం జరుగుతుంది. డేటాను అలాగే ఉంచాల్సిన వ్యవధులను పరిశీలిస్తున్నప్పుడు, మేము ముందుగా సేకరించిన వ్యక్తిగత డేటాను అలాగే ఉంచడం అవసరమా అనేది జాగ్రత్తగా పరిశీలిస్తాము, అవసరమైతే, వ్యక్తిగత డేటాను అత్యంత తక్కువ సమయానికి చట్టంలో అనుమతించినట్లుగా ఉంచడానికి పని చేస్తాము.
అన్ని వేళలా, Apple సేకరించిన సమాచారం www.apple.com/in/privacy లింక్‌లో ఉన్న Apple గోప్యతా విధానానికి అనుగుణంగా ఉపయోగించబడుతుంది.
2026-03-30