బ్రౌజర్ ఎంపిక స్క్రీన్, గోప్యత

మీ డివైజ్‌లో లేని బ్రౌజర్ యాప్‌ను మీరు ఎంచుకున్నట్లయితే, ఆ యాప్ App Store నుండి డౌన్‌లోడ్ చేయబడి, మీ Apple ఖాతాకు అనుసంధానం చేయబడుతుంది.
 

బ్రౌజర్ ఎంపిక స్క్రీన్, మీకు నచ్చిన వెబ్ బ్రౌజర్ యాప్‌ను డిఫాల్ట్‌గా సెట్ చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది.


Privacy Icon

  • మీరు Appleకు విశ్లేషణలను షేర్ చేసినప్పుడు, అనుభవాన్ని మెరుగుపరచడానికి అలాగే సమ్మతి ప్రయోజనాల కోసం బ్రౌజర్ ఎంపిక ప్రక్రియతో మీ ఇంటరాక్షన్ల గురించిన సమాచారాన్ని Apple సేకరిస్తుంది. ఈ సమాచారం మీకు సంబంధించినది కాదు.
  • మీ డివైజ్‌లో లేని బ్రౌజర్ యాప్‌ను మీరు ఎంచుకున్నట్లయితే, అది App Store నుండి డౌన్‌లోడ్ చేయబడి మీ డిఫాల్ట్ బ్రౌజర్‌గా సెట్ చేయబడుతుంది.
  • Apple, బ్రౌజర్ యాప్‌ డౌన్‌లోడ్‌ను మీ Apple ఖాతాకు అనుసంధానం చేస్తుంది.

మీరు వెబ్‌సైట్ లింక్‌లను ఓపెన్ చేయడానికి ఉపయోగించే డిఫాల్ట్ బ్రౌజర్ యాప్‌ని ఎంచుకునే అవకాశం మీకు ఉంది.

మీరు Apple, యాప్ డెవలపర్‌లకు విశ్లేషణలను షేర్ చేసిన్నప్పుడు, మీరు ట్యాప్ చేసి వీక్షించిన వాటిని అలాగే ఎంపిక పేజీలో బ్రౌజర్‌ల స్థానంతో సహా మీ బ్రౌజర్ ఎంపిక ఇంటరాక్షన్‌ల గురించిన మొత్తం సమాచారాన్ని Apple సేకరిస్తుంది. Apple ఈ డేటాను సేకరిస్తున్నప్పుడు మీ గోప్యతను కాపాడుతుంది అలాగే డేటాతో మిమ్మల్ని అనుసంధానించదు. ఈ డేటా బ్రౌజర్ ఎంపిక అనుభవాన్ని మెరుగుపరచడానికి, Apple రిపోర్టింగ్ అలాగే సమ్మతి ప్రయోజనాల కోసం ఉపయోగించబడుతుంది. మీరు మీ విశ్లేషణలు షేరింగ్ ప్రాధాన్యతలను ఎప్పుడైనా మార్చుకోవచ్చు. మీ iOS లేదా iPadOS లో దీనిని చేయడానికి, సెట్టింగ్స్ > గోప్యత & సెక్యూరిటీ> ‘విశ్లేషణలు & మెరుగుదలలు’లో షేర్ [డివైజ్] విశ్లేషణలు ఆఫ్ చేయబడుతుంది.

మీ డివైజ్‌లో లేని బ్రౌజర్ యాప్‌ను మీరు ఎంచుకున్నట్లయితే, ఆ యాప్ ఆటోమేటిక్‌గా యాప్ స్టోర్ నుండి డౌన్‌లోడ్ చేయబడి, మీ డిఫాల్ట్ బ్రౌజర్‌గా సెట్ చేయబడుతుంది. ఈ డౌన్‌లోడ్‌లో భాగంగా, మీ Apple ఖాతాతో అనుసంధానం చేయబడిన మీ డివైజ్ హార్డ్‌వేర్ ID, IP అడ్రెస్ వంటి వాటిని Apple రికార్డ్ చేస్తుంది. మీరు App Store ఉపయోగించినప్పుడు, మీ డిఫాల్ట్ బ్రౌజర్ యాప్ డౌన్‌లోడ్‌తో సహా, మీ అన్ని డౌన్‌లోడ్‌ల గురించిన సమాచారం www.apple.com/in/legal/privacy/data/en/app-store లో యాప్ స్టోర్ & గోప్యతలో వివరించిన విధంగా ఉపయోగించబడుతుంది.

మీరు డిఫాల్ట్ బ్రౌజర్‌ను ఎప్పుడైనా మార్చుకోవచ్చు. ఇలా చేయడానికి, సెట్టింగ్స్‌లో ఉన్న యాప్స్‌కి వెళ్లి, మీరు డిఫాల్ట్ బ్రౌజర్‌గా సెట్ చేయాలనుకున్న యాప్ పై ట్యాప్ చేసి, ఆపై డిఫాల్ట్ బ్రౌజర్ యాప్‌ను ఎంచుకోండి. మీరు డిఫాల్ట్‌గా సెట్ చేయాలనుకుంటున్న యాప్‌ని ఎంచుకోండి. మీరు ఎంచుకున్న దానిని డిఫాల్ట్‌గా సెట్ చేయడానికి, యాప్ పక్కన ఒక చెక్‌మార్క్ ఉంటుంది.

అన్ని వేళలా Apple సేకరించిన సమాచారం, www.apple.com/in/privacy లింక్‌లో ఉన్న Apple గోప్యతా విధానానికి అనుగుణంగా ఉపయోగించబడుతుంది.

2025-12-12