డివైజ్ విశ్లేషణలు, గోప్యత
విశ్లేషణలు మీ సమాచారాన్ని సంరక్షించడానికి డిజైన్ చేయబడింది, అలాగే మీరు ఏమి షేర్ చేయాలో ఎంచుకోవడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది.
iOS డివైజ్ విశ్లేషణలు
iPhone విశ్లేషణలలో హార్డ్‌వేర్, ఆపరేటింగ్ సిస్టమ్ స్పెసిఫికేషన్‌లు, పనితీరు గణాంకాలు, అలాగే మీరు మీ డివైజ్‌లు, అప్లికేషన్‌లను ఎలా ఉపయోగిస్తారు అనే వివరాలు కూడా ఉండవచ్చు. ఈ సమాచారం Appleకు దాని ప్రోడక్ట్‌లు, సర్వీస్‌లను మెరుగుపరచడానికి, డెవలప్ చేయడానికి ఉపయోగించబడుతుంది. సేకరించిన సమాచారంలో మీ వ్యక్తిగత వివరాలు ఉండవు. వ్యక్తిగత డేటా అస్సలు లాగ్ చేయబడదు, డిఫరెన్షియల్ గోప్యత వంటి గోప్యతను సంరక్షించే సాంకేతికతలకు లోబడి ఉంటుంది లేదా Appleకు పంపబడే ముందు రిపోర్ట్‌ల నుండి వ్యక్తిగత సమాచారం తొలగించబడుతుంది. మీరు iOS డివైజ్‌లో సెట్టింగ్స్ > గోప్యత & భద్రత > విశ్లేషణలు, మెరుగుదలకు వెళ్ళి, విశ్లేషణ డేటాను ట్యాప్ చేయడం ద్వారా ఈ సమాచారాన్ని రివ్యూ చేయవచ్చు.
మీరు ఈ సమాచారాన్ని Appleకు అందించడానికి అంగీకరించి, మీ లొకేషన్ సర్వీస్‌లు ఆన్‌లో ఉన్నట్లయితే, పనితీరు సమస్యలను (ఉదాహరణకు నిర్దిష్ట లొకేషన్‌లో మొబైల్ లేదా Wi-Fi సిగ్నల్ సరిగా ఉందా లేదా అనేది) విశ్లేషించడంలో Appleకు సహాయం చేయడానికి మీ డివైజ్‌ల లొకేషన్ కూడా పంపబడవచ్చు. ఈ విశ్లేషణల లొకేషన్ డేటాలో కాల్ ముగిసిన లొకేషన్ లేదా లావాదేవీ విఫలమైన స్టోర్ లొకేషన్ లాంటి లొకేషన్‌లు ఉండవచ్చు. మీరు విశ్లేషణల కోసం లొకేషన్ సర్వీస్‌లను ఎప్పుడైనా డిసేబల్ చేయవచ్చు. ఇందుకోసం, సెట్టింగ్స్ > గోప్యత, భద్రత > లొకేషన్ సర్వీస్‌లు > సిస్టమ్ సర్వీస్‌లకు వెళ్లి ‘iPhone విశ్లేషణలను ఆఫ్ చేయండి’పై ట్యాప్ చేయండి.
మీరు ఒకే iCloud ఖాతాను ఉపయోగిస్తున్న వివిధ డివైజ్‌ల నుంచి Appleకు విశ్లేషణల సమాచారం పంపడానికి అంగీకరిస్తే, మేము ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్‌ను ఉపయోగించడం ద్వారా ఆ డివైజ్‌లలో Apple యాప్‌ల గురించిన కొంత డేటాను అనుసంధానించవచ్చు. మేము దీనిని Apple మిమ్మల్ని గుర్తించలేని విధంగా అమలు చేస్తాము.
మీరు మొత్తంగా డివైజ్ విశ్లేషణలను షేర్ చేయడం డిసేబల్ చేయడాన్ని కూడా ఎంచుకోవచ్చు. సిస్టమ్ సెట్టింగ్స్ > గోప్యత, భద్రత > విశ్లేషణలు, మెరుగుదలలకు వెళ్లి, iPhone విశ్లేషణలను షేర్ చేయడాన్ని ఆఫ్ చేయండి. మీ వద్ద iPhoneతో పెయిర్ అయిన Apple Watch ఉంటే, ‘iPhone & వాచ్ విశ్లేషణలను షేర్ చేయండి’ని ఆఫ్ చేయండి.
ఈ ఫీచర్‌లను ఉపయోగించడం ద్వారా మీరు పైన తెలిపిన విధంగా Apple మరియు దాని అనుబంధ సంస్థలు, అలాగే ఏజెంట్‌లు ఈ సమాచార పంపిణీ, సేకరణ, నిర్వహణ, ప్రాసెసింగ్ మరియు వినియోగానికి అంగీకరిస్తున్నారు మరియు సమ్మతిస్తున్నారు.
అన్ని వేళలా Apple సేకరించిన సమాచారం, www.apple.com/in/privacy లింక్‌లో ఉన్న Apple గోప్యత పాలసీకి అనుగుణంగా ఉపయోగించబడుతుంది.
2025-12-12