FaceTime & గోప్యత
FaceTime మీ సమాచారాన్ని సంరక్షించేలా డిజైన్ చేయబడింది, అలాగే మీరు ఏమి షేర్ చేయాలో ఎంచుకోవడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది.
![]()
- FaceTime ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్ట్ చేయబడింది. మీరు సంప్రదించిన వ్యక్తులకు, మీరు ఉపయోగించిన ఫోన్ నంబర్ లేదా ఇమెయిల్ అడ్రెస్ కనిపిస్తుంది, మీరు పేరు లేదా ఫోటోను షేర్ చేయడానికి ఎంచుకోవచ్చు.
- Apple, మీరు FaceTime కాల్ చేయడానికి ప్రయత్నించారా లేదా అనేటటువంటి FaceTime వినియోగానికి సంబంధించిన పరిమిత సమాచారాన్ని 30 రోజుల వరకు అలాగే ఉంచుతుంది.
- FaceTime కొన్ని ప్రాంతాల్లోని వెబ్ యూజర్లను వెబ్ ద్వారా FaceTime కాల్స్‌లో జాయిన్ కావడానికి అనుమతిస్తుంది.
FaceTime అనేది Apple సర్వీస్ దానితో ఎవరైతే iOS, iPadOS లేదా visionOS డివైజ్ లేదా Macను ఉపయోగిస్తున్నారో వారికి వీడియో లేదా ఆడియో కాల్స్ చేయడానికి ఉపయోగపడుతుంది, ఆడియో కాల్స్‌ను Apple Watchలో లేదా వెబ్ ద్వారా చేయవచ్చు. ఈ కాల్స్ మీ మొబైల్ సర్వీస్ నిమిషాలతో లెక్కించబడవు.
మేము FaceTimeను ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్‌ను ఉపయోగించేలా డిజైన్ చేసాము. మేము ఎప్పుడు కూడా FaceTime కాల్స్ కంటెంట్‌ను స్టోర్ చేయము.
మీరు Apple ఖాతాను ఉపయోగించి లేదా కేవలం ఫోన్ నంబర్‌తో FaceTimeకు సైన్ ఇన్ చేయవచ్చు. మీరు మీ డివైజ్‌లో Apple ఖాతాలోకి సైన్ ఇన్ చేస్తే, ఆటోమేటిక్‌గా FaceTimeకు సైన్ ఇన్ చేయబడతారు. మీ Apple ఖాతా లేదా ఫోన్ నంబర్ మీరు కనెక్ట్ అయ్యే వ్యక్తులకు కనిపిస్తుంది, ఇతర వ్యక్తులు మీ ఖాతాలోని మీ Apple ఖాతా, ఇమెయిల్ అడ్రెస్‌లు లేదా ఫోన్ నంబర్‌లను ఉపయోగించి మీకు కాల్ చేయవచ్చు. మీరు ఏ ఫోన్ నంబర్‌లు లేదా ఇమెయిల్ అడ్రెస్‌లను FaceTime కాల్స్ కోసం ఉపయోగించాలి అనేది FaceTime సెట్టింగ్స్‌లో ఎంచుకోవచ్చు. మీరు account.apple.com లింక్ ద్వారా Apple ఖాతా పేజీ నుండి అదనపు సంప్రదింపు సమాచారాన్ని జోడించవచ్చు, అలాగే ధృవీకరించవచ్చు.
SharePlay మిమ్మల్ని Apple లేదా థర్డ్-పార్టీ యాప్‌లలో FaceTime కాల్స్ అనుభూతిని షేర్ చేయడానికి అనుమతిస్తుంది. SharePlayలో ఎక్స్‌ఛేంజ్ చేయబడిన సమాచారం ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్ట్ చేయబడుతుంది. App డెవలపర్‌లకు, వారి యాప్‌లను మీరు ఎలా ఉపయోగిస్తున్నారనే సమాచారానికి యాక్సెస్ ఉండవచ్చు.
FaceTime లింక్‌లు యూజర్లను తర్వాతికి కాల్ సెటప్ చేయడానికి, Windows లేదా Androidలో పార్టిసిపెంట్‌లను వెబ్ ద్వారా జాయిన్ కావడానికి అనుమతిస్తుంది. వెబ్ యూజర్లు తమ గుర్తింపును తెలపడానికి వారి పేరును అందించాలి, FaceTime కాల్‌కు యాక్సెస్‌ను రిక్వెస్ట్ చేయాలి. కాల్ ఉన్న ప్రామాణీక యూజర్ ఎవరైనా, వెబ్ యూజర్ కాల్‌లో జాయిన్ అయిన మొదటి 30 సెకన్లలోపు వారిని తొలగించవచ్చు.
FaceTime ఆడియో, ఫోన్ కాల్స్ కోసం, మీ కాంటాక్ట్ పోస్టర్ మీ ఇన్‌కమింగ్ కాల్ స్క్రీన్‌లో కనిపిస్తుంది. మీరు ఆటోమేటిక్‌గా మీ కాంటాక్ట్స్‌తో మాత్రమే కాంటాక్ట్ పోస్టర్‌ను షేర్ చేయడానికి లేదా ప్రతి సారి షేర్ చేయడానికి ప్రాంప్ట్ చేయడానికి ఎంచుకోవచ్చు, షేర్ చేసిన డేటా వారి డివైజ్‌లోనే స్టోర్ చేయబడుతుంది. మీరు గ్రూప్ FaceTime ఆడియో లేదా ఫోన్ సంభాషణలో ఎక్కువ మంది వ్యక్తులతో కాంటాక్ట్ పోస్టర్‌ను షేర్ చేస్తే, సంభాషణల్లో ఉన్న వ్యక్తులందరికీ మీ కాంటాక్ట్ పోస్టర్ పంపబడుతుంది. మీరు ఏ సమయంలోనైనా మీ కాంటాక్ట్ పోస్టర్‌ను అప్‌డేట్ చేయవచ్చు. మీరు ఆటోమేటిక్‌గా షేర్ చేస్తే, తదుపరిసారి మీరు FaceTime ఆడియో లేదా ఫోన్ కాల్ చేసినప్పుడు ఆప్‌డేట్‌లు పంపబడతాయి. మీరు మీ కాంటాక్ట్ పోస్టర్‌ను షేర్ చేసి తర్వాత షేరింగ్‌ను ఆపివేస్తే, ఇంతకు ముందే మీ కాంటాక్ట్ పోస్టర్‌ను అందుకున్న ఇతరులతో మీ సమాచారం వారి డివైజ్‌లో అలాగే ఉండవచ్చు. మీరు కాల్స్ కోసం ఎంచుకున్న కాంటాక్ట్ పోస్టర్ Appleకు పంపబడుతుంది, Apple సర్వర్‌లలో Apple చూడలేని విధంగా ఎన్‌క్రిప్షన్‌తో స్టోర్ చేయబడుతుంది.
మీ visionOS డివైజ్‌లో FaceTime కాల్స్ కోసం మీ Persona కాల్‌లో ఉన్న వ్యక్తులందరికీ సురక్షితంగా పంపబడుతుంది, కాబట్టి దీనితో వారు మీ Personaను చూడగలరు. కాల్ పూర్తయిన తర్వాత, కాల్‌లోని ఇతర పార్టిసిపెంట్‌ల డివైజ్‌లలో 30 రోజుల వరకు మీ Persona ఎన్‌క్రిప్ట్ చేయబడి, అలాగే స్టోర్ చేయబడవచ్చు. ఇతర కాల్ పార్టిసిపెంట్‌లు మీ Personaను వారు మీతో కాల్‌లో ఉన్నప్పుడు మాత్రమే యాక్సెస్ చేయగలరు.
Apple, మీ FaceTime వినియోగానికి సంబంధించిన సమాచారాన్ని Apple ప్రోడక్ట్‌లు, సర్వీస్‌లను ఆపరేట్ చేయడానికి, మెరుగుపరచడానికి రికార్డ్, స్టోర్ చేయవచ్చు
- Apple, మిమ్మల్ని గుర్తించలేని విధంగా సర్వీస్‌ల వినియోగ సమాచారాన్ని రికార్డ్, స్టోర్ చేయవచ్చు.
- Apple, ఎవరు కాల్‌కు ఆహ్వానించారు, మీ డివైజ్ నెట్‌వర్క్ కాన్ఫిగరేషన్ లాంటి FaceTime కాల్స్ గురించిన సమాచారాన్ని రికార్డ్, స్టోర్ చేయవచ్చు అలాగే ఈ సమాచారాన్ని 30 రోజుల వరకు స్టోర్ చేయవచ్చు. Apple, మీరు కాల్స్‌కు సమాధానం ఇచ్చారా లేదా అనేది తెలుసుకోదు, మీ కాల్స్ కంటెంట్‌ను యాక్సెస్ చేయదు.
- Apple, మీరు లేదా ఇంకెవరైనా స్పామ్ లేదా జంక్ FaceTime కాల్స్‌ను రిపోర్ట్ చేస్తే, ఆ సమాచారాన్ని Apple పంపడానికి స్టోర్ చేయబడవచ్చు.
- మీ డివైజ్‌లోని కొన్ని యాప్‌లు (FaceTimeతో పాటు), ఇతర వ్యక్తులు FaceTime ద్వారా సంప్రదించవచ్చా అనేది నిర్ణయించడానికి Apple సర్వర్‌లతో కమ్యూనికేట్ చేయవచ్చు. ఇలా జరిగినప్పుడు, Apple మీ ఖాతాతో అనుబంధించిన ఈ ఫోన్ నంబర్‌లు, ఇమెయిల్ అడ్రెస్‌లను 30 రోజుల వరకు స్టోర్ చేయవచ్చు.
ఈ ఫీచర్‌లను ఉపయోగించడం ద్వారా మీరు పైన తెలిపిన విధంగా Apple మరియు దాని అనుబంధ సంస్థలు, అలాగే ఏజెంట్‌లు ఈ సమాచార పంపిణీ, సేకరణ, నిర్వహణ, ప్రాసెసింగ్ మరియు వినియోగానికి అంగీకరిస్తున్నారు మరియు సమ్మతిస్తున్నారు.
అన్ని వేళలా Apple సేకరించిన సమాచారం, Apple గోప్యతా విధానానికి అనుగుణంగా ఉపయోగించబడుతుంది, దీని గురించి www.apple.com/in/privacy ద్వారా తెలుసుకోండి
2025-12-12