Game Center & గోప్యత
Game Center మీ సమాచారాన్ని సంరక్షించేలా డిజైన్ చేయబడింది, మీరు ఏం షేర్ చేయాలో ఎంచుకోవడానికి వీలు కల్పిస్తుంది.
![]()
- లీడర్‌బోర్డ్‌లలో పాల్గొనడం; మల్టీప్లేయర్ గేమ్‌లలో పాల్గొనడం; స్నేహితులను కనుగొనడం, చూడటం మరియు వారితో ఛాలెంజ్‌లో పాల్గొనడం; మరియు విజయాలను ట్ర్యాక్ చేయడం వంటి గేమ్-సంబంధిత యాక్టివిటీలలో పాల్గొనడానికి Game Center మీకు వీలు కల్పిస్తుంది.
- Game Centerకు సైన్ ఇన్ చేసి మీరు Game Center-ఎనేబల్ చేయబడిన గేమ్‌లను ఆడినప్పుడు, Apple మీరు ఆడే గేమ్‌లు మరియు మీ గేమ్ యాక్టివిటి వంటి సమాచారాన్ని సేకరిస్తుంది. ఈ సమాచారం మీ అధిక స్కోర్‌లు, విజయాలు, ఛాలెంజ్‌లను ట్ర్యాక్ చేయడానికి, అలాగే మీ కోసం, ఇతరుల కోసం Game Centerను మెరుగుపరచడానికి ఉపయోగించబడుతుంది.
- Apple మీ Game Center స్నేహితులు, మీతో ఆడే ప్లేయర్‌లు, అలాగే మీరు ఆడుతున్న సమయ జాబితాను కూడా సేకరిస్తుంది. మల్టీప్లేయర్ గేమ్‌లలో సులభంగా రీఎంగేజ్ అవ్వడంలో మీకు సహాయపడటానికి, ఒకరికి సంబంధించిన అధిక స్కోర్‌లను మరొకరు త్వరగా చూడడానికి మరియు మీ కోసం, ఇతరుల కోసం Game Centerను మెరుగుపరచడానికి ఈ సమాచారం ఉపయోగించబడుతుంది.
- Game Center యూజర్‌లందరికీ మీ Game Center ముద్దు పేరు, అవతార్, స్కోర్‌లు మరియు Arcade సబ్‌స్క్రిప్షన్ స్థితి కనిపిస్తాయి. మీరు మీ Game Center స్నేహితులతో లేదా Game Center యూజర్‌లందరితో, మీరు ఆడిన గేమ్‌లు, విజయాల ప్రోగ్రెస్ వంటి ఇతర Game Center యాక్టివిటి సమాచారాన్ని షేర్ చేయడాన్ని కూడా ఎంచుకోవచ్చు. ఈ సమాచారం మీరు Game Centerలో, App Store, Apple Games, అలాగే Apple Arcade వంటి ఇతర Apple సర్వీస్‌లలో దీన్ని షేర్ చేసిన వారికి కనిపిస్తుంది. మీ Game Center స్నేహితులకు మీ పేరు కూడా కనిపించవచ్చు.
- మీకు స్నేహితులను సూచించడానికి, మీ కాంటాక్ట్‌లలో ఎవరైనా Game Center ముద్దు పేరును వారి కాంటాక్ట్ కార్డ్‌తో లింక్ చేస్తే, వారికి సంబంధించిన గుర్తించలేని సమాచారాన్ని Apple ఉపయోగిస్తుంది, కానీ ఈ సమాచారాన్ని స్టోర్ చేయదు. Game Center ఈ సిఫార్సుల విషయంలో సహాయం అందించడానికి డివైజ్‌లో ప్రాసెసింగ్‌ను ఉపయోగిస్తుంది.
మీ సమాచార గోప్యత మరియు భద్రతను సంరక్షించడమే Appleలో ప్రతి ఒక్కరికి ప్రాధాన్యత. మీ అనుభూతిని మెరుగుపరచడానికి మేము ఎంతో కృషి చేస్తాము, అందుకోసం అవసరమైన డేటాను మాత్రమే సేకరిస్తాము, మేము డేటాను సేకరిస్తున్నప్పుడు మేము ఏమి సేకరిస్తున్నాము, ఎందుకు సేకరిస్తున్నాము అనేది మీకు తెలియాలని భావిస్తాము, తద్వారా మీరు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవచ్చు. ప్రతి Apple ప్రోడక్ట్ మరియు సర్వీస్ లాగానే Game Center కూడా ఈ సూత్రాలను దృష్టిలో ఉంచుకుని డిజైన్ చేయబడింది.
Game Centerను అందించడం మరియు మెరుగుపరచడం
Game Centerకు ఆన్‌బోర్డ్ అయిన తర్వాత, లీడర్‌బోర్డ్‌లలో పాల్గొనడం; మల్టీప్లేయర్ గేమ్‌లలో పాల్గొనడం; స్నేహితులను కనుగొనడం, చూడటం ఇంకా వారితో ఛాలెంజ్‌లో పాల్గొనడం; అలాగే విజయాలను ట్ర్యాక్ చేయడం వంటి గేమ్ సంబంధిత యాక్టివిటీలలో ఎంగేజ్ అవ్వడానికి అది మీకు వీలు కల్పిస్తుంది. మీరు Game Centerను ఉపయోగిస్తున్నప్పుడు, మీరు ఆడే గేమ్‌లు, మీరు వాటిని ఆడిన సమయం అలాగే మీరు ఎవరితో ఆడారు; మీ స్కోర్లు, విజయాలు; మీరు పంపించే, స్వీకరించే ఛాలెంజ్‌లకు సంబంధించిన సమాచారాన్ని Apple సేకరిస్తుంది. Apple మీ Game Center స్నేహితులు, మీతో ఆడే ప్లేయర్‌లు, అలాగే మీరు ఆడుతున్న సమయ జాబితాను కూడా సేకరిస్తుంది, తద్వారా మీరు మల్టీప్లేయర్ గేమ్‌లలో సులభంగా మళ్లీ కనెక్ట్ అవ్వవచ్చు ఇంకా ఒకరి అధిక స్కోర్‌లను త్వరగా చూడవచ్చు. ఈ సమాచారం మీ Apple ఖాతాతో అనుబంధించబడింది.
Game Center ఫీచర్‌లతో ఇంటరాక్షన్‌కు సంబంధించిన సమాచారాన్ని కూడా Apple సేకరిస్తుంది, ఇందులో మీరు చూసేవి, క్లిక్ చేసేవి, మీరు గేమ్ కంట్రోలర్‌ను ఉపయోగిస్తున్నారా లేదా, అలాగే కంట్రోలర్ వివరాలు, ఇంకా మీ ఫ్రెండ్ రిక్వెస్ట్‌లు వంటి సెట్టింగ్‌ల నుండి మీరు యాక్సెస్ చేసే ఫీచర్‌లు ఉంటాయి. మీరు Game Centerకు సైన్ ఇన్ చేసి, కంట్రోల్ సెంటర్ ద్వారా గేమ్ ఓవర్‌లే మరియు గేమ్ కంట్రోల్‌లను యాక్సెస్ చేసినప్పుడు, ఓవర్‌లే మరియు కంట్రోల్‌లతో మీ ఇంటరాక్షన్‌లను Apple సేకరిస్తుంది. ఈ సమాచారం మీ Apple ఖాతాతో అనుబంధించబడని ర్యాండమ్ ఐడెంటిఫైయర్‌లో స్టోర్ చేయబడుతుంది. మీ iOS, iPadOS లేదా visionOS డివైజ్‌లో ఈ ఐడెంటిఫైయర్‌ను రీసెట్ చేయడానికి, సెట్టింగ్స్ > Game Center > ‘ఐడెంటిఫైయర్‌ను రీసెట్ చేయండి’కి వెళ్ళండి. Macలో, సిస్టమ్ సెట్టింగ్స్ > Game Center > ‘ఐడెంటిఫైయర్‌ను రీసెట్ చేయండి’కి వెళ్ళండి.
ఈ విభాగంలో వివరించిన సమాచారం, మీ కోసం అలాగే ఇతరుల కోసం, Game Center, ఇంకా Game Centerను ఉపయోగించే ఇతర Apple సర్వీస్‌లను మెరుగుపరచడానికి, అలాగే ఆప్టిమైజ్ చేయడానికి ఉపయోగించబడవచ్చు.
ఇతర ప్లేయర్‌లతో, స్నేహితులతో ఆడటం
గ్లోబల్ లీడర్‌బోర్డ్‌లతో గేమ్‌లను ఆడే Game Center యూజర్‌లందరికీ మీ Game Center ముద్దు పేరు, అవతార్, స్కోర్‌లు మరియు Arcade సబ్‌స్క్రిప్షన్ స్థితి కనిపిస్తాయి. మీరు మీ Game Center స్నేహితులతో లేదా Game Center యూజర్‌లందరితో ఇతర Game Center యాక్టివిటి సమాచారాన్ని షేర్ చేయడాన్ని కూడా ఎంచుకోవచ్చు. మీరు ఆడిన గేమ్‌లు మరియు మీ విజయాల ప్రోగ్రెస్‌తో సహా ఈ సమాచారం, Game Center, అలాగే App Store and Apple Arcade వంటి ఇతర Apple సర్వీస్‌లలో మీరు దీనిని షేర్ చేసే వారికి కనిపిస్తుంది. పిల్లలకు సంబంధించిన Game Center యాక్టివిటీ సమాచారం వారి Game Center స్నేహితులతో మాత్రమే షేర్ చేయబడుతుంది. మీరు మీ iOS, iPadOS లేదా visionOS డివైజ్‌లో సెట్టింగ్స్ > Game Center > యాక్టివిటి షేరింగ్‌కు, అలాగే Macలో సిస్టమ్ సెట్టింగ్స్ > Game Center > యాక్టివిటి షేరింగ్‌కు వెళ్ళడం ద్వారా మీ యాక్టివిటి షేరింగ్ స్థితిని చూడవచ్చు మరియు మార్చవచ్చు.
మీ Game Center ముద్దుపేరు మీ కాంటాక్ట్ కార్డ్‌తో లింక్ చేయబడినప్పుడు, Game Center మీ Apple ఖాతాతో అనుబంధించబడిన ఇమెయిల్ అడ్రెస్‌ను మరియు ఫోన్ నంబర్‌ను ఉపయోగిస్తుంది. ఇది మీ Game Center స్నేహితులు తమ ‘కాంటాక్ట్‌లు’ యాప్‌లో మీ కోసం సేవ్ చేసుకున్న పేరు ఆధారంగా మిమ్మల్ని మరింత సులభంగా కనుగొనడానికి వీలు కల్పిస్తుంది. మీరు మీ iOS, iPadOS లేదా visionOS డివైజ్‌లో సెట్టింగ్స్ > Game Center > ‘మిమ్మల్ని వెతకడానికి మీ స్నేహితులకు సహాయం చేయండి’కి, అలాగే Macలో సిస్టమ్ సెట్టింగ్స్ > Game Center > ‘మిమ్మల్ని వెతకడానికి మీ స్నేహితులకు సహాయం చేయండి’కి వెళ్ళడం ద్వారా ఈ సెట్టింగ్‌ను నియంత్రించవచ్చు.
మీరు మల్టీప్లేయర్ ఫంక్షనాలిటీకి మద్దతు ఉన్న గేమ్‌ను ఆడుతున్నప్పుడు, ఒకే Wi-Fi నెట్‌వర్క్ లేదా లోకల్ ఏరియా నెట్‌వర్క్‌లో అదే గేమ్‌ను యాక్సెస్ చేస్తున్న లేదా Bluetooth పరిధిలో ఉన్న ఇతర Game Center యూజర్‌లు మీరు సమీపంలో ఉన్నారని తెలుసుకోగలరు, అలాగే మీ ముద్దుపేరును, అవతార్‌ను చూడగలుగుతారు. మీరు మీ iOS, iPadOS లేదా visionOS డివైజ్‌లో సెట్టింగ్స్ > Game Center, ఆపై ‘సమీపంలోని ప్లేయర్‌లను ఆఫ్ చేయండి’పై ట్యాప్ చేయడం ద్వారా ఈ ఫీచర్‌ను డిసేబల్ చేయవచ్చు. Macలో, సిస్టమ్ సెట్టింగ్స్ > Game Centerకు వెళ్ళి, ఆపై “సమీపంలోని ప్లేయర్‌లు”ను క్లిక్ చేసి ఆఫ్ చేయండి. tvOSలో, సెట్టింగ్స్ > ప్రొఫైల్‌లు, ఖాతాలు > [యూజర్ నేమ్] > Game Centerకు వెళ్ళి, ‘సమీపంలోని ప్లేయర్‌లు’ను ఆఫ్ చేయండి.
మీ కాంటాక్ట్‌లలో ఎవరైతే వారి Game Center ముద్దుపేరును వారి కాంటాక్ట్ కార్డ్‌తో లింక్ చేయడాన్ని ఎంచుకుంటారో ఆ కాంటాక్ట్‌ల గురించి గుర్తించలేని సమాచారాన్ని Apple అందుకుంటుంది. Game Center ప్లాట్‌ఫామ్‌లలో మీకు చూపబడే స్నేహితుల సిఫార్సులను మెరుగుపరచడానికి ఈ సమాచారం ఉపయోగించబడుతుంది, కానీ Apple ఈ సమాచారాన్ని స్టోర్ చేయదు. Game Center ఈ సిఫార్సుల విషయంలో సహాయం అందించడానికి డివైజ్‌లో ప్రాసెసింగ్‌ను ఉపయోగిస్తుంది.
మీకు iOS 10ని వాడటం మొదలు పెట్టడానికి కంటే ముందే స్నేహితుల సంబంధాలు ఉంటే, వారికి మీ అసలు పేరుకు యాక్సెస్ కలిగి ఉంటారు. మీరు iOS 10ను వాడటం మొదలు పెట్టినప్పటి నుండి ఏర్పడిన ఏదైనా స్నేహితుల సంబంధాలలో, మీ స్నేహితులకు మీ మారుపేరు మాత్రమే కనిపిస్తుంది. iOS 10కి ముందు వెర్షన్‌లలో కూడా, పిల్లల ఖాతాలలో నిజమైన పేర్లు స్నేహితులకు కనిపించవు.
Game Center మరియు Apple Games
Game Center అనేది Apple Games యాప్ అనుభవంలో ఒక కీలక భాగం. Apple Games యాప్‌ను ఉపయోగించడానికి, మీరు తప్పనిసరిగా Game Centerలో సైన్ ఇన్ చేయాలి. మీరు గేమ్స్ యాప్‌ను ఉపయోగించనప్పటికీ మీ ముద్దుపేరు, అవతార్, మీ Game Center యాక్టివిటీ ఉన్న మీ Game Center ప్రొఫైల్‌ను మీరు షేర్ చేయాలని నిర్ణయించుకుంటే, అది Apple Games యాప్‌లో అందుబాటులో ఉంటుంది. మీరు Apple Games యాప్‌ను ఉపయోగించినప్పుడు, ‘Game Center అందించడం, మెరుగుపరచడం’ మరియు ‘ఇతర ప్లేయర్‌లతో, స్నేహితులతో ఆడటం’ విభాగాలలో వివరించినట్లుగా మీ గేమింగ్ యాక్టివిటి, స్నేహితులు, ఛాలెంజ్‌లు మరియు విజయాల గురించిన సమాచారం, Apple Games యాప్ ద్వారా Apple Gamesలో మీ అనుభవాన్ని శక్తివంతం చేయడం, వ్యక్తిగతీకరించడం కోసం, గేమ్‌లను, స్నేహితులను కనుగొనడంలో మీకు సహాయపడేలా Game Center మరియు Apple Gamesను ఆప్టిమైజ్ చేసి, మెరుగుపరచడానికి, అలాగే కమ్యూనికేషన్‌లను మీకు పంపడానికి సహాయపడుతుంది. Apple Games గురించి మరింత సమాచారం కోసం, www.apple.com/legal/privacy/data/en/apple-games లింక్‌కు వెళ్ళండి.
మీతో కమ్యూనికేట్ చేయడం
Apple మీకు Game Center, ఇతర Apple ప్రోడక్ట్‌లు, సర్వీస్‌లు అలాగే Apple Oneతో పాటు మీకు ఆసక్తికరంగా అనిపించే ఆఫర్ల కమ్యూనికేషన్‌లను పంపడానికి మీ వద్ద ఉన్న Apple ప్రోడక్ట్‌లు, Apple సర్వీస్‌లకు మీ సబ్‌స్క్రిప్షన్‌ల సమాచారాన్ని ఉపయోగించవచ్చు. Game Centerలో అందుబాటులో ఉన్న కొత్త ఫీచర్‌లు, కంటెంట్ మరియు ఆఫర్‌ల గురించి ఇమెయిల్‌లు, నోటిఫికేషన్‌లను పంపడానికి Game Centerలోని మీ యాక్టివిటీకి సంబంధించిన సమాచారాన్ని కూడా ఉపయోగించవచ్చు. మీరు account.apple.com లింక్ ద్వారా మీ ఇమెయిల్ ప్రాధాన్యతలను మార్చవచ్చు, అలాగే ఈ ఇమెయిల్‌లను అందుకోకుండా ఆపివేయవచ్చు. మీ iOS, iPadOS లేదా visionOS డివైజ్‌లో మీ నోటిఫికేషన్ ప్రాధాన్యతలను అప్‌డేట్ చేయడానికి సెట్టింగ్స్ > నోటిఫికేషన్‌లు > ‘Game Center’కు వెళ్ళండి. Macలో, ‘సిస్టమ్ సెట్టింగ్స్ > నోటిఫికేషన్‌లు > Game Centerకు వెళ్ళండి. Apple, నోటిఫికేషన్‌లతో పాటు మా కమ్యూనికేష్‌లతో మీ ఇంటరాక్షన్‌ల గురించిన సమాచారాన్ని మా సర్వీస్‌లను మెరుగుపరచడానికి ఉపయోగిస్తుంది.
థర్డ్ పార్టీ డెవలపర్‌లు
మీరు Game Centerకు సైన్ ఇన్ చేసినప్పుడు, మీరు ఆడే గేమ్‌ల డెవలపర్‌లు మీ ముద్దుపేరు, అవతార్ మరియు ఇతర ప్రత్యేకమైన Game Center ఐడెంటిఫైయర్‌లతో సహా మీ గురించిన సమాచారాన్ని రిక్వెస్ట్ చేయవచ్చు. మీ స్నేహితులు మరియు మీరు ఇటీవల ఆడిన ప్లేయర్‌లతో సహా సంబంధిత ఆటగాళ్ల జాబితాను కూడా డెవలపర్ రిక్వెస్ట్ చేయవచ్చు, ఇందులో ముద్దుపేర్లు మరియు అవతార్‌లు ఉంటాయి. మిమ్మల్ని స్నేహితులతో కనెక్ట్ చేయడానికి యాప్‌ను అనుమతించాలని మీరు ఎంచుకుంటే, వారు ఈ గేమ్‌ను ఆడే మీ స్నేహితుల జాబితాను కూడా యాక్సెస్ చేయగలరు. ఈ యాప్‌ను వారి స్నేహితులతో కనెక్ట్ అవ్వడాన్ని అనుమతించిన స్నేహితులు మాత్రమే యాప్‌కి మీ స్నేహితులుగా కనిపిస్తారు. మిమ్మల్ని మీ స్నేహితులతో కనెక్ట్ చేయడానికి ఏ యాప్‌లను అనుమతించకూడదని అనుకుంటే, ఆ ఎంపికను ఎప్పుడైనా మార్చవచ్చు. ఈ పనిని మీ iOS, iPadOS, లేదా visionOS డివైజ్‌లో చేయడానికి, సెట్టింగ్స్ > Game Centerకు వెళ్ళి, ‘స్నేహితుల జాబితాను షేర్ చేయండి’ను ఆఫ్ చేయడానికి ట్యాప్ చేయండి. Macలో, సిస్టమ్ సెట్టింగ్స్ > Game Centerకు వెళ్ళి, ‘స్నేహితుల జాబితాను షేర్ చేయండి’ను క్లిక్ చేసి ఆఫ్ చేయండి. ఇది యాప్‌లు మీ Game Center స్నేహితులతో కనెక్ట్ అవ్వడానికి అభ్యర్థించడాన్ని నివారిస్తుంది అలాగే గతంలో అనుమతించిన యాప్‌లకు మీ స్నేహితుల జాబితాను షేర్ చేయడాన్ని ఆపివేస్తుంది. మీరు థర్డ్ పార్టీ యాప్‌ని ఉపయోగించినప్పుడు, వారు మీ డేటాను ఎలా సేకరిస్తారో మరియు ఎలా ఉపయోగిస్తున్నారో అర్థం చేసుకోవడానికి డెవలపర్ నిబంధనలు, గోప్యతా విధానాలు మరియు ప్రాక్టీసులను మీరు సమీక్షించాలి.
Game Centerలో పిల్లలు
Game Centerను ఉపయోగించే మీ ఫ్యామిలీలోని పిల్లల కోసం, మీరు నిర్దిష్ట యాప్‌లలో వారు వెచ్చించే సమయాన్ని పరిమితం చేయడానికి, స్క్రీన్ టైమ్‌లో కంటెంట్ & గోప్యతా పరిమితులను ఉపయోగించవచ్చు మరియు మల్టీప్లేయర్ ఫంక్షనాలిటీ, స్నేహితులను జోడించే సామర్థ్యం, అదే గేమ్ ఆడే స్నేహితులతో కనెక్ట్ అయ్యే సామర్థ్యంతో సహా మీ పిల్లల డివైజ్‌లో Game Center ఫీచర్‌లను బ్లాక్ చేయవచ్చు. మీ iOS, iPadOS లేదా visionOS డివైజ్‌లో ఇలా చేయడానికి, సెట్టింగ్స్ > స్క్రీన్ టైమ్ > కంటెంట్ & గోప్యతా పరిమితులు > App Store, మీడియా, వెబ్, ఇంకా గేమ్స్‌కి వెళ్ళి, ఆపై Game Center విభాగానికి వెళ్ళండి. Macలో, సిస్టమ్ సెట్టింగ్స్ > స్క్రీన్ టైమ్ > కంటెంట్ & గోప్యతకు వెళ్ళండి. tvOSలో, సెట్టింగ్స్ > సాధారణం > ‘పరిమితులు’కు వెళ్ళండి. అదనంగా, Game Centerలో ఇతర ప్లేయర్‌తో కమ్యూనికేట్ చేస్తున్నప్పుడు, పిల్లలు యూజర్ ఇన్‌పుట్ చేసిన టెక్స్ట్‌ను పంపలేరు లేదా స్వీకరించలేరు. వారు ప్రీసెట్ సందేశాలను పంపడం మరియు స్వీకరించడం మాత్రమే చేయగలరు. పిల్లల కోసం గేమ్‌లో వాయిస్ చాట్ డిసేబల్ చేయబడింది.
వ్యక్తిగత డేటాను ప్రాసెస్ చేయడానికి వర్తించే చట్టపరమైన ఆధారం
మేము మా చట్టబద్ధమైన ఆసక్తుల ప్రయోజనాలకు అనుగుణంగా, మీ సమ్మతితో మాత్రమే Game Centerలో మీ వ్యక్తిగత డేటాను ప్రాసెస్ చేస్తాము. వర్తించే స్థానిక చట్టాలకు అనుగుణంగా, మేము చట్టపరమైన ప్రయోజనాల కోసం కింది విభాగాల వ్యక్తిగత డేటాను ప్రాసెస్ చేస్తాము:
- మీరు ఆడే గేమ్‌లు, మీ గేమ్ యాక్టివిటీతో సహా మీ Game Center వినియోగం
- మీ ముద్దుపేరు, అవతార్, Arcade సబ్‌స్క్రిప్షన్ స్థితి, స్కోర్‌లు, అలాగే ఇతర యాక్టివిటి సంబంధిత సమాచారం
- మీ Game Center స్నేహితులు, మీరు ఎవరితో అయితే ఆడతారో ఆ ప్లేయర్‌లు, అలాగే మీరు కలిసి ఆడుతున్నప్పుడు
ఈ చట్టపరమైన అవసరాలు ఇందులో ఉంటాయి:
- మీ కోసం, ఇతరుల కోసం Game Centerను, అలాగే Game Centerను ఉపయోగించే ఇతర Apple సర్వీస్‌లను ఆప్జిమైజ్ చేయడం, మెరుగుపరచడం
- Game Center, ఇతర Apple ప్రోడక్ట్‌లు, సర్వీస్‌లు, అలాగే మీకు ఆసక్తిగా ఉండే ఆఫర్ల గురించి కమ్యూనికేషన్‌లు పంపిస్తుంది
- మోసాలు, హానికర యాక్టివిటీని నిరోధించడం
రిటెన్షన్
మీరు మీ Game Center ఖాతాతో అనుబంధించబడిన Apple ఖాతాను నిర్వహిస్తున్నంత కాలం మీ గురించి సేకరించిన సమాచారాన్ని Game Center అలాగే స్టోర్ చేసి ఉంచుతుంది.
మోసాలు, హానికర యాక్టివిటీని నిరోధించడం
మేము Game Center, Apple యాప్‌లు అలాగే సర్వీస్‌లలో మోసాన్ని, ఇతర హానికర యాక్టివిటీలను నివారించడానికి వ్యక్తిగత డేటాను సేకరిస్తాము. ఇందులో డివైజ్ రకం, సాఫ్ట్‌వేర్ వెర్షన్, లొకేషన్ సమాచారం (అందుబాటులో ఉంటే, సుమారు భౌగోళిక ప్రాంతానికి ఇంటర్నెట్ కనెక్షన్ ద్వారా సరిపోయే IP అడ్రెస్), డౌన్‌లోడ్, కొనుగోళ్ల చరిత్ర, అలాగే Game Center, ఇతర యాప్‌లు, సర్వీస్‌లతో ఇతర ఇంటరాక్షన్‌ల వంటి డివైజ్ సమాచారం కూడా ఉంటుంది.
అన్ని వేళలా Apple సేకరించిన సమాచారం, Apple గోప్యతా విధానానికి అనుగుణంగా ఉపయోగించబడుతుంది, దీని గురించి www.apple.com/in/privacy ద్వారా తెలుసుకోండి.
2026-03-30