EV రూటింగ్ మెరుగుదల, గోప్యత

EV రూటింగ్‌ను మెరుగుపరచండి మీ సమాచారాన్ని సంరక్షించడానికి డిజైన్ చేయబడింది, అలాగే మీరు ఏమి షేర్ చేయాలో ఎంచుకోవడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది.


మీరు EV రూటింగ్‌ను మెరుగుపరచండిని ఎనేబల్ చేయడానికి ఎంచుకుంటే, Apple కింద పేర్కొన్న సమాచారాన్ని సేకరించవచ్చు:

  • బ్యాటరీ ఛార్జ్ స్టాప్ మీ రూట్‌కు జోడించబడినప్పుడు
  • మీ రూట్‌లో ఏదైనా భాగంలో బ్యాటరీ పూర్తిగా అయిపోతే
  • మీ బ్యాటరీలో మిగిలిన శాతం
  • మీ వాహనం ప్రస్తుత బ్యాటరీ సామర్థ్యం, గరిష్ట బ్యాటరీ సామర్థ్యం
  • మీ రూట్‌లో ఇచ్చిన బ్యాటరీ ఛార్జ్ స్టాప్‌లో మీ వాహనం ఛార్జ్ కావడానికి ఎంత సమయం పడుతుంది
  • మిగిలిన ప్రయాణం రేంజ్ అలాగే మీ వాహనం గరిష్ట రేంజ్
  • మీ వాహనం శక్తి వినియోగం గురించిన డేటా
  • గమ్యస్థానానికి చేరుకోవడానికి అంచనా వేసిన సమయంతో పాటు, మీ రూట్ గురించిన సమాచారం

ఇది, Appleకు బ్యాటరీ ఛార్జ్ అంచనాల ఖచ్చితత్వాన్ని బాగా తెలుసుకోవడానికి వీలు కల్పిస్తుంది. Apple, ఈ డేటాను EV రూటింగ్, ఇతర లొకేషన్-ఆధారిత Apple ప్రోడక్ట్‌లు, సర్వీస్‌లను మెరుగుపరచడానికి అనామకంగా అలాగే పెట్టుకుంటుంది. మీరు ఎప్పుడైనా సెట్టింగ్స్ > యాప్‌లు > మ్యాప్స్ > EV రూటింగ్‌ను మెరుగుపరచండికి వెళ్లి, ‘EV రూటింగ్‌ను మెరుగుపరచండి’ని ఆఫ్ చేయవచ్చు.

2025-12-12