ఆరోగ్య సంబంధ రికార్డ్‌ల మెరుగుదల, గోప్యత
ఆరోగ్య సంబంధ రికార్డ్‌లు, సంబంధిత ఫీచర్‌లను అభివృద్ధి చేయడం, మెరుగుపరచడం అలాగే అర్థం చేసుకోవడంలో Appleకు సహాయపడటానికి ఆరోగ్య సంబంధ రికార్డ్‌ల మెరుగుదల, మీ ఆరోగ్య సంబంధ రికార్డ్‌లు, సంబంధిత ఫీచర్‌ల వినియోగం, ఎంగేజ్‌మెంట్ గురించి మీ iPhone అలాగే iPad నుండి నిర్దిష్ట సమాచారాన్ని ఆటోమేటిక్‌గా Appleకు పంపుతుంది. మీ డేటా మరే ఇతర అవసరాల కోసం ఉపయోగించబడదు.
ఆరోగ్య సంబంధ రికార్డ్‌ల మెరుగుదలలో భాగంగా సేకరించిన సమాచారంలో, మీ ఆరోగ్య సంబంధ రికార్డ్‌ల నిర్దిష్ట సమాచారం (మీ పరిస్థితులు, మందులు, వైటల్స్, ఇమ్యునైజేషన్‌లు, ల్యాబ్ ఫలితాలు, ప్రక్రియలు, అలాగే ధృవీకరించదగిన ఆరోగ్య సంబంధ రికార్డ్‌ల డేటా వంటి ఆరోగ్యం యాప్‌లోని ఆరోగ్య సంబంధ రికార్డ్‌ల విభాగం కింద పొందిన, నిల్వ చేయబడిన ఇతర ఆరోగ్య సంబంధ రికార్డుల డేటా వంటివి), మరియు ఆరోగ్య సంబంధ రికార్డ్‌ల ఫీచర్‌తో మీ ఎనేబల్‌మెంట్, ఎంగేజ్‌మెంట్ గురించిన సమాచారం (డేటా సోర్స్‌లను కలిగిన మీ ఆరోగ్య సంబంధ రికార్డ్‌ల బదిలీకి సంబంధించిన విశ్లేషణల డేటా వంటివి) ఉండవచ్చు. విశ్లేషణ కోసం Appleకి మీ సమాచారాన్ని పంపే ముందు, మీ పేరు లేదా ఫోన్ నంబర్ వంటి వ్యక్తిగతంగా గుర్తించగలిగే డేటాను తొలగించడానికి ఇది ప్రాసెస్ చేయబడుతుంది. ఈ ప్రక్రియ మిమ్మల్ని వ్యక్తిగతంగా గుర్తించగల సమాచారం మొత్తాన్ని తొలగించేలా రూపొందించబడినప్పటికీ, గుర్తించగల సమాచారాన్ని Apple పొందే అవకాశం ఉంది. వ్యక్తిగతంగా గుర్తించగలిగే డేటా ఏదైనా ఉంటే, అది వెంటనే డిలీట్ చేయబడుతుంది.
Appleకు పంపబడిన సమాచారం బదిలీ అవుతున్నప్పుడు, అలాగే ఒక చోట ఉన్నప్పుడు అది ఎన్‌క్రిప్ట్ చేయబడుతుంది.
‘ఆరోగ్య సంబంధ రికార్డ్‌లను మెరుగుపరచండి’ని ఎనేబల్ చేయడం ద్వారా మీరు పైన తెలిపిన విధంగా Apple మరియు దాని అనుబంధ సంస్థలు, అలాగే ఏజెంట్‌లు ఈ సమాచార పంపిణీ, సేకరణ, నిర్వహణ, ప్రాసెసింగ్ మరియు వినియోగానికి అంగీకరిస్తున్నారు మరియు సమ్మతిస్తున్నారు. Apple ఈ సమాచారాన్ని ప్రాసెస్ చేసి, విశ్వసనీయ థర్డ్-పార్టీ సర్వీస్ ప్రొవైడర్‌ల వద్ద స్టోర్ చేయవచ్చు. మీరు ఎప్పుడైనా మీ ఆరోగ్య సంబంధ రికార్డ్‌లను షేర్ చేయడాన్ని ఆపివేయవచ్చు. దీని కోసం, సిస్టమ్ సెట్టింగ్స్> గోప్యత, భద్రత > విశ్లేషణలు, మెరుగుదలకు వెళ్లి ‘ఆరోగ్య సంబంధ రికార్డ్‌లను మెరుగుపరచండి ఆఫ్ చేయండి’పై ట్యాప్ చేయండి.
అన్ని వేళలా Apple సేకరించిన సమాచారం, Apple గోప్యతా విధానానికి అనుగుణంగా ఉపయోగించబడుతుంది, దీని గురించి www.apple.com/in/privacy ద్వారా తెలుసుకోండి
2025-12-12