సున్నితమైన కంటెంట్ హెచ్చరిక మెరుగుదల, గోప్యత

సున్నితమైన కంటెంట్ హెచ్చరికను మెరుగుపరచండి మీ సమాచారాన్ని సంరక్షించడానికి డిజైన్ చేయబడింది, అలాగే మీరు ఏమి షేర్ చేయాలో ఎంచుకోవడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది.


మీరు సున్నితమైన కంటెంట్ హెచ్చరికను మెరుగుపరచడాన్ని ఎంచుకుంటే, ఫీచర్ పనితీరును మెరుగుపరచడానికి, అర్థం చేసుకోవడానికి, సున్నితమైన కంటెంట్ హెచ్చరిక ఎలా ఉపయోగించబడుతుందనే దాని గురించి Apple డేటాను సేకరిస్తుంది. డిఫరెన్షియల్ ప్రైవసీ వంటి గోప్యతను రక్షించే సాంకేతికతలను ఉపయోగించి ఈ సమాచారం సమగ్రపరచబడుతుంది, రక్షించబడుతుంది మరియు Apple ఖాతాకు లేదా మీ ఇతర Apple సర్వీస్‌లకు సంబంధించి Apple కలిగి ఉన్న ఇతర డేటా ఏదీ లింక్ చేయబడలేదు.

సేకరించబడే సమీకృత డేటాకు సంబంధించిన ఉదాహరణలలో ఇవి ఉంటాయి:

  • అభ్యంతరకరమైన కంటెంట్‌గా గుర్తించబడి స్వీకరించిన మొత్తం ఇమేజ్‌లు లేదా వీడియోల సంఖ్య
  • “సహాయం పొందే మార్గాలు” ఎంపికపై చేసిన ట్యాప్‌లు లేదా క్లిక్‌ల సంఖ్య
  • సున్నితమైన కంటెంట్ హెచ్చరిక ఆప్షన్‌లపై చేసిన ట్యాప్‌లు లేదా క్లిక్‌ల శాతం

మీరు మీ iOS, iPadOS లేదా visionOS డివైజ్‌లో సెట్టింగ్స్ > గోప్యత, భధ్రత > సున్నితమైన కంటెంట్ హెచ్చరికకు వెళ్ళడం ద్వారా లేదా Macలో సిస్టమ్ సెట్టింగ్స్ > గోప్యత, భద్రత > సున్నితమైన కంటెంట్ హెచ్చరికకు వెళ్ళడం ద్వారా సున్నితమైన కంటెంట్ హెచ్చరికకు మెరుగుపరచడాన్ని ఆఫ్ చేయవచ్చు. అన్ని వేళలా Apple సేకరించిన సమాచారం, Apple గోప్యతా విధానానికి అనుగుణంగా ఉపయోగించబడుతుంది, దీని గురించి www.apple.com/in/privacy ద్వారా తెలుసుకోండి

2025-12-12