Appleతో సైన్ ఇన్ చేయండి, గోప్యత

‘Appleతో సైన్ ఇన్ చేయండి’ని సెటప్ చేస్తున్నప్పుడు, మోసాన్ని నివారించడానికి మీ Apple ఖాతా మరియు డివైజ్ వినియోగ ప్యాటర్న్ సమాచారాన్ని Apple ఉపయోగిస్తుంది.
 

మీ గోప్యతను రక్షించే మరియు Apple ప్రొడక్ట్‌ల అంతర్నిర్మిత భద్రత ద్వారా మీకు సురక్షిత సైన్ ఇన్ అనుభవాన్ని అందించే విధంగా ‘Appleతో సైన్ ఇన్ చేయండి’ రూపొందించబడింది.


Privacy Icon

  • మీ గోప్యతను కాపాడుతూ 'Appleతో సైన్ ఇన్ చేయండి’ మిమ్మల్ని యాప్‌లు, వెబ్‌సైట్‌లకు సైన్ ఇన్ చేయడానికి అనుమతిస్తుంది.
  • కొందరు డెవలపర్‌లు మీ పేరును అడగవచ్చు, దాన్ని మీరు ఎడిట్ చేయవచ్చు. వారు మీ ఇమెయిల్‌ను కూడా అడగవచ్చు, మీరు నేరుగా అందించవచ్చు లేదా మారు ఇమెయిల్‌ను ఉపయోగించవచ్చు.
  • మీరు యాప్‌లు లేదా వెబ్‌సైట్‌లకు Appleతో సైన్ ఇన్ చేయడాన్ని ఎనేబల్ చేస్తే Appleకు తెలుస్తుంది, కానీ మీరు ఏయే యాప్‌లు మరియు వెబ్‌సైట్‌లకు సైన్ ఇన్ చేస్తున్నారు లేదా ఎప్పుడు చేస్తున్నారనే విషయాన్ని ట్ర్యాక్ చేయదు.
  • మీరు మొదటిసారిగా 'Appleతో సైన్ ఇన్ చేయండి'ని ఏదైనా యాప్‌కి సైన్ ఇన్ చేయడానికి ఉపయోగించినప్పుడు, మోసాన్ని నివారించడానికి మీ ఖాతా, Appleతో మీ అనుభవాలు, మీ డివైజ్ సమాచారంతో పాటు, డివైజ్ వినియోగ ప్యాటర్న్‌లను Apple ఉపయోగిస్తుంది.

‘Appleతో సైన్ ఇన్ చేయండి’ని ఎనేబల్ చేయడం

'Appleతో సైన్ ఇన్ చేయండి' ఫీచర్ మిమ్మల్ని వ్యక్తిగతంగా గుర్తించే ఎలాంటి సమాచారాన్ని డెవలపర్‌కు అందించకుండా యాప్ (లేదా యాప్ క్లిప్)కు సైన్ ఇన్ చేయడానికి మిమ్మల్ని అనుమతించడం ద్వారా మీ గోప్యతను రక్షిస్తుంది. 'Appleతో సైన్ ఇన్ చేయండి' ఫీచర్ మీ బ్రౌజర్ ద్వారా సాధారణ వెబ్ ఫంక్షన్ల కోసం ఉపయోగించే సమాచారం కంటే మిమ్మల్ని వ్యక్తిగతంగా గుర్తించే ఎలాంటి అదనపు సమాచారాన్ని డెవలపర్‌కు అందించకుండా వెబ్‌సైట్‌కు సైన్ ఇన్ చేయడానికి కూడా మిమ్మల్ని అనుమతిస్తుంది. బదులుగా, మీరు 'Appleతో సైన్ ఇన్ చేయండి'ని ఉపయోగించినప్పుడు, Apple మీ సమాచారాన్ని ప్రైవేట్‌గా ఉంచడానికి అనుమతించే ప్రత్యేక ఐడెంటిఫైయర్‌ను యాప్ డెవలపర్‌కు అందిస్తుంది. ఈ ఐడెంటిఫైయర్ ప్రతి యాప్‌కి ప్రత్యేకంగా ఉంటుంది, కాబట్టి పలు డెవలపర్‌లు అన్ని యాప్‌లలో మీ గురించిన సమాచారాన్ని పొందలేరు, షేర్ చేయలేరు. డెవలపర్‌లు తమ యాప్‌లు లేదా వెబ్‌సైట్‌లలో ఇప్పటికే ఉన్న ఖాతాల కోసం Appleతో సైన్ ఇన్ చేయడానికి మిమ్మల్ని అనుమతించవచ్చు. డెవలపర్ దీన్ని ఎనేబల్ చేయాలని ఎంచుకుంటే, మీరు ఇప్పటికే కలిగి ఉన్న ఖాతాను అలాగే ఉంచుకోవచ్చు, కానీ 'Appleతో సైన్ ఇన్ చేయండి'ని ఉపయోగించి సైన్ ఇన్ చేయవచ్చు.

ఎందుకంటే కొన్ని యాప్‌లు మీ గురించి మరింత సమాచారాన్ని సేకరించడానికి కారణం ఉండవచ్చు - ఉదాహరణకు, మీ ఖాతాను పేరు ద్వారా సూచించడానికి లేదా ఇమెయిల్ ద్వారా మిమ్మల్ని సంప్రదించడానికి - కాబట్టి మీరు 'Appleతో సైన్ ఇన్ చేయండి'ని ఉపయోగించినప్పుడు కొందరు డెవలపర్‌లు మీ పేరు లేదా ఇమెయిల్ అడ్రెస్‌ను అడగవచ్చు. మీ Apple ఖాతాతో అనుబంధించబడిన పేరు డిఫాల్ట్ పేరుగా ఉంటుంది, మీరు డెవలపర్‌లకు షేర్ చేయడానికి ముందు దాన్ని ఎడిట్ చేయవచ్చు. డెవలపర్ ఇమెయిల్ అడ్రెస్ అడిగితే, మీరు మీ Apple ఖాతాతో అనుబంధించబడిన ఇమెయిల్ అడ్రెస్‌లలో ఒకదాన్ని అందించడానికి ఎంచుకోవచ్చు లేదా మీ ఇమెయిల్ అడ్రెస్‌ను దాచవచ్చు. మీరు డెవలపర్ నుండి మీ ఇమెయిల్ అడ్రెస్‌ను దాచాలని ఎంచుకుంటే, Apple ఒక ప్రత్యేక ఇమెయిల్ అడ్రెస్‌ను రూపొందించి, మిమ్మల్ని సంప్రదించడానికి డెవలపర్‌కు అందింస్తుంది. మీ Apple ఖాతాతో అనుబంధించబడిన ఇమెయిల్ అడ్రెస్‌కు ఆ అడ్రెస్ నుండి వచ్చిన ఇమెయిల్‌ను Apple ఫార్వార్డ్ చేస్తుంది; సందేశాలు డెలివరీ అయిన తర్వాత లేదా డెలివరీ కాకపోతే కొంతకాలం తర్వాత వాటిని Apple తొలగిస్తుంది. మీ iOS, iPadOS, లేదా visionOS డివైజ్‌లో, సెట్టింగ్స్ > [మీ పేరు] > iCloud > iCloud Mail > Mail ఫార్వర్డింగ్‌కు వెళ్ళడం ద్వారా, మీరు మెయిల్‌ను ఫార్వార్డ్ చేయాలనుకుంటున్న ఇమెయిల్ అడ్రెస్‌ను మార్చవచ్చు లేదా ఇమెయిల్ ఫార్వర్డింగ్‌ను డిసేబల్ చేయవచ్చు. మీ Macలో, సిస్టమ్ సెట్టింగ్స్ > [మీ పేరు] >వ్యక్తిగత సమాచారంకు వెళ్ళండి. మీరు ‘నా ఇమెయిల్‌ను దాచండి’తో ఉపయోగించిన ఇమెయిల్ అడ్రెస్‌ను డియాక్టివేట్ చేసినప్పుడు లేదా డిలీట్ చేసినప్పుడు, దుర్వినియోగాన్ని నివారించడానికి ఇది మీ Apple ఖాతాతో అనుబంధిచబడి, 30 రోజుల పాటు స్టోర్ చేయబడుతుంది. తొలగించిన అడ్రెస్ మీ Apple ఖాతా నుండి శాశ్వతంగా తొలగించబడుతుంది అలాగే అడ్రెస్‌ను తిరిగి జారీ చేయకుండా నిరోధించడం వంటి భద్రతా ప్రయోజనాల కోసం మాత్రమే ఉంచబడుతుంది.

మీరు ఒక యాప్ కోసం 'Appleతో సైన్ ఇన్ చేయండి'ని ఎనేబల్ చేయాలని ఎంచుకుంటే, ఆ ఎంపిక మీరు iCloud కోసం ఉపయోగించే Apple ఖాతాకు లింక్ చేయబడుతుంది కాబట్టి మీరు మీ అన్ని Apple డివైజ్‌లలో ఆ యాప్ కోసం 'Appleతో సైన్ ఇన్ చేయండి'ని ఉపయోగించవచ్చు.

మోసాల నివారణ, భద్రతా కారణాల దృష్ట్యా, మీరు మొదటిసారి కొత్త యాప్‌తో ‘Appleతో సైన్ ఇన్ చేయండి’ని ఉపయోగించిన తర్వాత, మీరు నిజమైన వ్యక్తి అని డెవలపర్‌కు నమ్మకం కలిగించడానికి Apple వారితో సాధారణ బైనరీ స్కోర్‌ను షేర్ చేస్తుంది. ఈ స్కోర్ మీ ఇటీవలి Apple ఖాతా యాక్టివిటీతో పాటుగా మీ డివైజ్, మీ డివైజ్ వినియోగ నమూనాల గురించి సంక్షిప్త సమాచారం నుండి గ్రహించబడింది. మీరు మీ డివైజ్‌ను ఎలా ఉపయోగిస్తున్నారనే దాని గురించి Apple లేదా డెవలపర్‌కు నిర్దిష్ట సమాచారం అందదు.

‘Appleతో సైన్ ఇన్ చేయండి’ని ఉపయోగించడం

యాప్ లేదా వెబ్‌సైట్ కోసం ‘Appleతో సైన్ ఇన్ చేయండి’ని ఎనేబల్ చేసినప్పుడు Appleకు తెలుస్తుంది, తద్వారా మేము సైన్ ఇన్‌ను సెటప్ చేయడంలో సహాయపడగలము. మీరు మీ iPhoneలోని యాప్‌లో ‘Appleతో సైన్ ఇన్ చేయండి’ని ఉపయోగించినప్పుడు, మీరు ఏ యాప్‌లకు సైన్ ఇన్ చేసారో లేదా మీరు ‘Appleతో సైన్ ఇన్ చేయండి’ని ఎప్పుడు ఉపయోగించారు అనే సమాచారాన్ని Apple చూడదు లేదా స్టోర్ చేయదు — ఆ సమాచారం మీ డివైజ్‌లో ఉంటుంది. మీరు Safariలో ‘Appleతో సైన్ ఇన్ చేయండి’ని ఉపయోగించినప్పుడు, మీరు వెబ్‌సైట్‌కు సైన్ ఇన్ చేసినప్పుడు Apple చూస్తుంది, తద్వారా Apple మీ సైన్ ఇన్‌ను ప్రామాణీకరించగలదు, కానీ మీరు ఏ వెబ్‌సైట్‌లకు సైన్ ఇన్ చేసారు లేదా మీరు ‘Appleతో సైన్ ఇన్ చేయండి’ని ఎప్పుడు ఉపయోగించారో తెలియజేసే సమాచార చరిత్రను కలిగి ఉండదు.

మీరు యాప్ లేదా వెబ్‌సైట్‌కు సైన్ ఇన్ చేయడానికి ‘Appleతో సైన్ ఇన్’ను ఉపయోగించినప్పటికీ, సైన్ ఇన్ చేసిన తర్వాత డెవలపర్‌లు అదనపు వ్యక్తిగత సమాచారాన్ని అడగవచ్చు. డెవలపర్‌కు అందించడానికి మీరు ఎంచుకున్న ఏదైనా వ్యక్తిగత సమాచారం వారి గోప్యతా విధానానికి లోబడి ఉంటుంది.

‘Appleతో సైన్ ఇన్ చేయండి’ని నిర్వహించడం

'Appleతో సైన్ ఇన్ చేయండి'ని నిర్వహించడానికి, iOSలో ఐతే సెట్టింగ్స్ > [మీ పేరు] > సైన్-ఇన్, భద్రత > మీ Apple ఖాతాను ఉపయోగించే యాప్‌లకు వెళ్ళండి, Macలో ఐతే సిస్టమ్ సెట్టింగ్స్ > [మీ పేరు] > సైన్-ఇన్, భద్రతకు వెళ్ళండి లేదా accounts.apple.com లింక్‌ను సందర్శించి, సైన్-ఇన్, భద్రతా విభాగానికి వెళ్ళి, ఆపై 'Appleతో సైన్ ఇన్ చేయండి'కి వెళ్ళండి. అక్కడ, మీరు ‘Appleతో సైన్ ఇన్ చేయండి’ని ఉపయోగించే యాప్‌ల జాబితాను కనుగొనవచ్చు, వాటి గోప్యతా విధానాన్ని రివ్యూ చేసి, ‘Appleతో సైన్ ఇన్ చేయండి’ని డిసేబల్ చేయవచ్చు. మీరు ఏదైనా యాప్ విషయంలో ‘Appleతో సైన్ ఇన్ చేయండి’ని డిసేబల్ చేయడాన్ని ఎంచుకున్నట్లయితే, ఆ యాప్ కోసం ‘Appleతో సైన్ ఇన్ చేయండి’ని సెటప్ చేయడానికి డెవలపర్‌తో షేర్ చేయబడిన సమాచారం, ‘Appleతో సైన్ ఇన్ చేయండి’తో డెవలపర్ అనుబంధించబడిన ఏదైనా సమాచారం డెవలపర్ గోప్యతా పాలసీ ప్రకారం నిర్వహించబడుతుంది.

మరింత సమాచారం

Touch ID, Face ID, బలమైన పాస్‌కోడ్ ఎంపికల ద్వారా ఆధారితమైన బలమైన ప్రామాణీకరణతో Apple, ‘Appleతో సైన్ ఇన్ చేయండి’ని సంరక్షించడానికి పని చేస్తుంది.

‘Appleతో సైన్ ఇన్ చేయండి’ గురించిన అజ్ఞాత, సమగ్ర సమాచారాన్ని Apple అందుకోవచ్చు, అందులో ‘Appleతో సైన్ ఇన్ చేయండి’ వినియోగం గురించిన సమాచారం కూడా ఉంటుంది. సేకరించిన సమాచారంలో మీ వ్యక్తిగత వివరాలు ఉండవు. Apple ప్రోడక్ట్‌లను, సర్వీస్‌లను మెరుగుపరచడానికి, మార్కెటింగ్ కోసం, అలాగే మోసాల నివారణ, భద్రతా కారణాల వలన మిమ్మల్ని గుర్తించని సమాచారాన్ని Apple ఉపయోగించవచ్చు. మేము స్వీకరించే ‘Appleతో సైన్ ఇన్ చేయండి’ డేటాలో ఏదైనా అజ్ఞాత లేదా సమగ్ర సమాచారాన్ని తిరిగి గుర్తించడానికి Apple ప్రయత్నించదు.

Apple మీ సమాచారాన్ని చట్టం ప్రకారం అలాగే మోసాల నివారణకు అవసరమైన విధంగా షేర్ చేయడానికి ఉపయోగించవచ్చు. ఈ Appleతో సైన్ ఇన్‌ను ఉపయోగించడం ద్వారా మీరు పైన తెలిపిన విధంగా Apple మరియు దాని అనుబంధ సంస్థలు, అలాగే ఏజెంట్‌లు మీ సమాచార పంపిణీ, సేకరణ, నిర్వహణ, ప్రాసెసింగ్ అలాగే వినియోగానికి అంగీకరిస్తున్నారు, సమ్మతిస్తున్నారు.

Apple గోప్యత పాలసీ లేదా మా సర్వీస్ పేర్కొన్న గోప్యత నోటీసు ఆధారంగా లేదా చట్టాలకు అవసరమైన విధంగా వ్యక్తిగత సమాచారాన్ని దాన్ని సేకరించిన అవసరం తీరే వరకు మాత్రమే Apple దాన్ని అలాగే ఉంచుతుంది. డేటాను అలాగే ఉంచాల్సిన వ్యవధులను పరిశీలిస్తున్నప్పుడు, మేము ముందుగా సేకరించిన వ్యక్తిగత సమాచారాన్ని అలాగే ఉంచడం అవసరమా అనేది జాగ్రత్తగా పరిశీలిస్తాము, అవసరమైతే, వ్యక్తిగత సమాచారాన్ని వీలున్నంత కాలానికి చట్టంలో అనుమతించినట్లుగా ఉంచడానికి పని చేస్తాము.

అన్ని వేళలా Apple సేకరించిన సమాచారం, Apple గోప్యతా విధానానికి అనుగుణంగా ఉపయోగించబడుతుంది, దీని గురించి www.apple.com/in/privacy ద్వారా తెలుసుకోండి

2025-12-12