దశల వారీ సహాయం, గోప్యత

మీరు దశల వారీ సహాయాన్ని ఉపయోగించినప్పుడు, మీ స్వంతంగా సాధారణ డివైజ్ సమస్యలను గుర్తించి, పరిష్కరించడంలో మీకు సహాయపడటానికి Apple మీ డివైజ్ సమాచారాన్ని సేకరిస్తుంది. మీరు దశల వారీ సహాయం ద్వారా Apple మద్దతును సంప్రదించాలనుకుంటే, మీరు మీకు సహాయం చేసే Apple సలహాదారుకి అదనపు సమాచారాన్ని అందించవచ్చు.
 

మీ గోప్యతను సంరక్షించేలా దశల వారీ సహాయం రూపొందించబడింది.


Privacy Icon

  • మీరు దశల వారీ సహాయాన్ని ఉపయోగించినప్పుడు, సాధారణ డివైజ్ సమస్యలను మీరే స్వయంగా నిర్ధారించి, పరిష్కరించడంలో మీకు సిఫార్సులను అందించడానికి Apple మీ డివైజ్ మోడల్, సీరియల్ నంబర్, ఆపరేటింగ్ సిస్టమ్, దేశం, ఇంకా భాష సెట్టింగ్‌లను సేకరిస్తుంది.
  • మీరు దశల వారీ సహాయం ద్వారా Apple మద్దతును సంప్రదిస్తే, Apple సలహాదారు మీకు సహాయం చేయడంలో మీ దశల వారీ సహాయం వినియోగానికి సంబంధించిన అదనపు సమాచారాన్ని Appleతో షేర్ చేసేలా ఎంచుకోవచ్చు. ఈ సమాచారం మీ Apple ఖాతాతో అనుబంధించబడుతుంది, అలాగే మద్దతు కేస్‌ను తెరవడానికి ఉపయోగించబడుతుంది.

మీ గోప్యతను పూర్తి స్థాయిలో సంరక్షించేలా దశల వారీ సహాయం రూపొందించబడింది. మీ అనుభూతిని మెరుగుపరచడానికి మాకు కావాల్సిన డేటాను మాత్రమే సేకరించడానికి మేము చాలా కష్టపడతాము. మేము డేటాను సేకరిస్తున్నప్పుడు, మేము ఏం సేకరిస్తున్నాం అది మాకు ఎందుకు అవసరం అనేది మీకు తెలియాలి అని ముఖ్యంగా భావిస్తాం, దీనితో మీరు తెలివిగా నిర్ణయాలు తీసుకోవచ్చు.

సెల్ఫ్ సర్వీస్ మద్దతు

దశల వారీ సహాయంలో సాధారణ ప్రశ్నలు, సమస్య పరిష్కార అవసరాలకు తగిన సహాయం అందించబడుతుంది. మీరు మీ డివైజ్ కీప్యాడ్‌లోని Apple మద్దతు ఫోన్ నంబర్‌ను డయల్ చేసి, ‘దశల వారీ సహాయం’ ఎంపికను ట్యాప్ చేయడం ద్వారా, మీ డివైజ్‌తో సమస్యను పరిష్కరించడంలో సహాయం కోసం Siriని అడగడం లేదా టిప్స్ యాప్‌కి నావిగేట్ చేయడం ద్వారా దశల వారీ సహాయాన్ని ఎప్పుడైనా యాక్సెస్ చేయవచ్చు. మీరు దశల వారీ సహాయాన్ని ఉపయోగించినప్పుడు, సాధారణ డివైజ్ సమస్యలను గుర్తించి, పరిష్కరించడంలో మీకు సహాయపడే కంటెంట్‌ను సిఫార్సు చేయడం కోసం మీ మోడల్, సీరియల్ నంబర్, ఆపరేటింగ్ సిస్టమ్, దేశం, ఇంకా భాష సెట్టింగ్‌లతో సహా ఇతర డివైజ్ సమాచారాన్ని Apple సేకరిస్తుంది.

Apple మద్దతును సంప్రదిస్తోంది
మీరు దశల వారీ సహాయాన్ని ఉపయోగించి మీ డివైజ్ సమస్యలను మీ స్వంతంగా పరిష్కరించలేకపోతే, అదనపు మద్దతును పొందడానికి దశల వారీ సహాయం ద్వారా నేరుగా Apple సలహాదారుతో సంప్రదించేలా ఎంచుకోవచ్చు. దశల వారీ సహాయం నుండి Apple మద్దతుకు క్రమబద్ధీకరించబడిన హ్యాండ్‌ఆఫ్‌ను సులభతరం చేయడానికి, మీ దశల వారీ సహాయం ఉపయోగం, అలాగే మీరు పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్న నిర్దిష్ట సమస్యకు సంబంధించిన సమాచారాన్ని షేర్ చేయడానికి ఎంచుకోవచ్చు. మీరు Apple మద్దతుతో షేర్ చేయడానికి ఎంచుకున్న సమాచారం మోసం గుర్తింపు ప్రయోజనాల కోసం కూడా ఉపయోగించబడుతుంది. మీరు షేర్ చేసే సమాచారంలో ఇవి ఉంటాయి:

  • మీరు Apple ఖాతాను సెటప్ చేసారా లేదా అనే దాని గురించి సమాచారం, మీ Apple ఖాతాతో అనుబంధించబడిన పేరు, ఇమెయిల్ అడ్రెస్, ఫోన్ నంబర్, ఇంకా ప్రత్యేక ఐడెంటిఫైయర్ వంటి Apple ఖాతా డేటా
  • సందేశం సెట్టింగ్‌లు, వీటిలో iMessage ఆన్ చేయబడి ఉందా లేదా అనేవి ఉంటాయి
  • Wi-Fi స్థితి, దీనిలో మీ Wi-Fi ఆన్ చేయబడి, కనెక్ట్ చేయబడిందా లేదా అనేవి ఉంటాయి
  • Bluetooth సెట్టింగ్‌లు, కనెక్ట్ చేయబడిన డివైజ్‌లు, వీటిలో Bluetooth ఆన్‌లో ఉందా లేదా, వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ కనెక్ట్ చేయబడ్డాయా లేదా వంటివి ఉంటాయి
  • Mail ఖాతా సెట్టింగ్‌లు, వీటిలో మీ వద్ద సెటప్ చేయబడిన ఇమెయిల్ ఖాతా ఉందా లేదా అనేవి ఉంటాయి
  • ఆటోమేటిక్ అప్‌డేట్‌ల సెట్టింగ్‌లు, వీటిలో మీకు ఆటోమేటిక్ అప్‌డేట్‌లు ఉన్నాయా లేవా వంటివి ఉంటాయి
  • VPN సెట్టింగ్‌లు, వీటిలో మీ VPN ఆన్ చేయబడి, కనెక్ట్ చేయబడిందా లేదా అనేవి ఉంటాయి
  • సాఫ్ట్‌వేర్ వెర్షన్, అలాగే మీ డివైజ్‌కు సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ అందుబాటులో ఉందా లేదా వంటిది ఉంటుంది
  • మీ దశల వారీ సహాయ సెషన్ నుండి మీ ఇంటరాక్షన్‌లు, వీటిలో సమస్య పరిష్కార ప్రశ్నలకు మీ ప్రతిస్పందనలు, అలాగే దశల వారీ సహాయంలో మీరు టైప్ చేసిన శోధనలు, సిఫార్సు చేయబడిన డివైజ్ సెట్టింగ్‌లను తెరవడం వంటి దశల వారీ సహాయం సూచనల ఆధారంగా మీరు తీసుకున్న చర్యలు, అలాగే మీకు సూచించబడిన, మీరు తెరిచిన దశల వారీ సహాయ కథనాలు ఉండవచ్చు

Appleకు పంపబడిన డేటాను ప్రాసెస్ చేసి, స్టోర్ చేయడానికి విశ్వసనీయ థర్డ్-పార్టీ సర్వీస్ ప్రొవైడర్‌లను ఉపయోగించవచ్చు.

రిటెన్షన్

Apple గోప్యత విధానం లేదా మా సర్వీస్‌లో ఉన్న గోప్యతా నోటీసులలో వివరించినట్లుగా లేదా చట్టాలకు అవసరమైన విధంగా వ్యక్తిగత డేటాను సేకరించిన అవసరం తీరే వరకు మాత్రమే మేము దాన్ని అలాగే ఉంచుతాము. డేటాను అలాగే ఉంచాల్సిన గడువులను పరిశీలిస్తున్నప్పుడు, మేము ముందుగా సేకరించబడిన వ్యక్తిగత డేటాను అలాగే ఉంచడం అవసరమా అనేది జాగ్రత్తగా పరిశీలిస్తాము, అవసరమైతే వ్యక్తిగత డేటాను అత్యంత తక్కువ సమయానికి చట్టంలో అనుమతించినట్లుగా ఉంచడానికి పని చేస్తాము. మీరు దశల వారీ సహాయం ద్వారా Apple మద్దతుతో మద్దతు కేస్‌ను తెరిస్తే, మీ మద్దతు కేస్‌తో అనుబంధించబడిన వ్యక్తిగత డేటా కనీసం ఎనిమిది సంవత్సరాలు లేదా మీ అధికార పరిధిలోని వర్తించే చట్టానికి అనుగుణంగా అలాగే ఉంచబడుతుంది. అదనంగా, మీరు మద్దతు కేస్‌ను తెరిచినప్పుడు, మోసపూరిత చర్యల గుర్తింపు కోసం మేము మీ వ్యక్తిగత డేటాలో కొంత భాగాన్ని అలాగే ఉంచవచ్చు. మీరు privacy.apple.com సైట్‌లో ‘Apple డేటా, గోప్యత’ పేజీకి వెళ్ళి, ఖాతా తొలగింపు అభ్యర్థనను సమర్పించవచ్చు. దశల వారీ సహాయానికి సంబంధించి మీ వ్యక్తిగత డేటా ఎలా ఉపయోగించబడుతుందనే దాని గురించి మీకు సందేహాలు ఉంటే లేదా మీరు మా డేటా రక్షణ అధికారిని సంప్రదించాలనుకుంటే, మీరు www.apple.com/in/legal/privacy/contact లింక్ ద్వారా మమ్మల్ని సంప్రదించవచ్చు.

వ్యక్తిగత డేటాను ప్రాసెస్ చేయడానికి వర్తించే చట్టపరమైన ఆధారం

మీరు దశల వారీ సహాయాన్ని ఉపయోగించినప్పుడు లేదా దశల వారీ సహాయం ద్వారా నేరుగా Apple సలహాదారులతో కనెక్ట్ అయినప్పుడు, డివైజ్ నిర్దిష్ట సమస్య పరిష్కార మద్దతు కోసం మీకు సిఫార్సులను అందించడానికి, అలాగే మా చట్టపరమైన బాధ్యతలకు కట్టుబడి ఉండటానికి Apple మీ వ్యక్తిగత డేటాను అవసరమైన విధంగా ప్రాసెస్ చేస్తుంది. సమ్మతి అనేది తగిన చట్టపరమైన ఆధారం అయినప్పుడు, మేము వర్తించే చట్టానికి అనుగుణంగా దానిని కోరుతాము.

వర్తించే చట్టం అందించినప్పుడు, మోసం, ఇతర హానికరమైన కార్యాచరణలను నివారించడం కోసం, అలాగే భద్రతా ప్రయోజనాల కోసం మా చట్టబద్ధమైన ప్రయోజనాలకు అనుగుణంగా లేదా థర్డ్ పార్టీ అవసరాలకు అనుగుణంగా మేము వ్యక్తిగత డేటాను ప్రాసెస్ చేస్తాము.

అన్ని వేళలా, Apple సేకరించిన సమాచారం, www.apple.com/in/privacy లింక్‌లో ఉన్న Apple గోప్యతా విధానానికి అనుగుణంగా ఉపయోగించబడుతుంది.

2025-12-12